మన ఆచారాలుమనం పాటించాలి. వాటిని వదిలివేయరాదు. మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు. ఆచారహీనం నపుసంతి వేదా? అని ఆర వాక్యం. ఆచార హీనుణ్ణి వేదములు కూడా పవిత్రుణ్ణి చేయలేవు అని దానర్థం. అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం. మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండవచ్చు. కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. అంతే.. మడి అంటే ఏమిటి? మడి అంటే శారీరక శౌచము. (ధర్మ దేవతకు సత్యము, శౌచము,తపస్సు,దయఅనునవినాలుగూనాలుగు పాదములు). శౌచము లేక శుభ్రత అనునవి శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీక శౌచము లేకుండా గృహస్తునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగవలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మండి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు.
మడి ఎలా కట్టుకోవాలి?
రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరవేసినది ఉత్తమం. ఉతికి జాడించి తరువాత మనము స్నానము చేసి తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, దండెముల మీద ఇంటిలో గాని ఆరుబయట గాని ఎవరూ తాకకుండా ఆరవేయవలెను.
(ఒకవేళ చిన్న పిల్లలు, తెలియనివారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్ళలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండము వంటి కట్టలు ప్రే లాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు). మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడిగుడ్డతో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీపోసి కట్టుకొనవలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాకకూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట లేక పూజ చేయవలెను. మడితోనే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి ఆ మడితోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. (ఇది ఉత్తమమైన మడి)
శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చేయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడిబట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్ళోడుతున్న తడి బట్ట పనికిరాదు. మడిబట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టుబట్ట కట్టుకోవడము మూడో పద్దతి. పట్టుబట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికిరాదు. ఒకవేళ చేస్తే పట్టుబట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టుబట్టను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని, మరలా ప్రక్కరోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేకపోతే పట్టుబట్టలు మడికి పనికిరావు. ధావళి కట్టుకొని పూజించడం పట్టుబట్ట కంటే శ్రీ శ్రం. పట్టుబట్టలో కొంత దోషం ఉన్నది. అదే జీవహింస. కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున నూలుగుడ్డ శ్రేష్ఠము. ద్విదీయ పక్షం ధావళి. అదికూడా కుదరనిచో స్వచ్ఛమైన పట్టువస్త్రం. మగవాళ్ళు పంచను లుంగీలాగ కట్టుకొని గాని, ఆడవారు చీరను పావడాతో గాని కట్టుకొని దైవకార్యములు చేయకూడదు. కరాణం జననేంద్రియములు ఆచ్చాదనం లేకుండా ఉండకూడదు. కావున మగవాళ్ళు గానీ, ఆడవారు గానీ గోచీపోసి మాత్రమే పంచ లేక చీర కట్టుకోవలెను. పంచ లేక చీర మాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏకవస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించినవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలలో పనికిరావు.
మడితో పచ్చళ్ళు, మడితో వడియాలు, మడితో పాలు పెరుగు నెయ్యి ఉండడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలావరకు నేడు పోయినాయి. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహం చేత కొద్ది కొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది. ఆసక్తి కలిగినవారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందరము. మనం ఆచరించి, అందరికీ పించి ఆదర్శం అవ్వాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. ఒక్కసారి మడి కట్టా డండి. దానిలోని ఆనందం, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవత్వం అనుభవంలోకి వస్తాయి. నేటికీ కొంతమంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. అటువంటి వారు అందరికీ ఆదర్శనీయులు.