భగవద్గీత - భక్తియోగం


భగవద్గీత 


ప్రపంచ సాహిత్యంలో మరలా మరలా చదువగల్గింది, చదువుకొనవలసింది, చదివినకొద్దీ అపురూపమైన అర్ధాలు, ఆలోచనలు, ఆనందానుభూతులను నింపేది, పెంచేది, పంచేది ఒక్క భగవద్గీత మాత్రమే. ఇది అత్యుక్తి కాదు. అక్షరసత్యం. అక్షర పరబ్రహ్మ దివ్యగానామృతం. గీత అంటేనే గానం చేయబడింది. గీతా సాహిత్యాలు కూడా సంస్కృత భాషలో అనేకా లున్నాయి. అయినా భగవద్గీత యొక్క పరిపూర్ణత ప్రత్యేకమైంది. 5 వేల సంవత్సరముల క్రిందటిది భగవద్గీత. అయినా నిత్యనూతనమే. నిజానికి భగవద్గీత ప్రత్యేక గ్రంథం కాదు. మహాభారతంలో భీష్మపర్వంలో 25 నుండి 52వ అధ్యాయం వరకు సాగిన 18 అధ్యాయాల భాగం. ప్రతి అధ్యాయం ఒక యోగంగా వ్యాసులవారు వివరించారు. ఉపనిషత్తుల సారం. బ్రహ్మవిద్యయు నైన యోగశాస్త్రం శ్రీ కృష్ణార్జునుల సంవాదం.


మహాభారత యుద్ధం కార్తీక అమావాస్య నాడు ప్రారంభమైంది. పదిరోజులు యుద్ధం జరిగింది. 11వ రోజున సంజయుడు ధృతరాష్ట్రుని కడకు వచ్చినప్పుడు, ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధ విశేషాలను అడుగుతాడు. అదే మార్గశిర శుద్ధ ఏకాదశి. అప్పుడు సంజయుడు వ్యాసభగవానుల మహిమతో, తాను ఎవరికీ కన్పించకుండా, ఎలాంటి ఆయుధం తగలకుండా, యుద్ధభూమిలో సంచరించిచూ చి, వినిన సర్వ విశేషాలను అందిస్తాడు.


అదిగో ఆ సందర్భంగా యుద్ధారంభంలో శ్రీ కృష్ణార్జునుల సంవాదాత్మకమైన గీతాగానాన్ని, తు.చ తప్పకుండా చెప్తాడు. అంటే వ్యాస రచన -శ్రీ కృష్ణార్జునుల సంభాషణం అనేది ప్రస్తుతం పరోక్షం. విశ్వాలకు, విశ్వజనులకు ఆ గీతాగానాన్ని విన్పించిన సౌభాగ్యశాలి, ఇంద్రియాలను జయించిన పావనమూర్తి, ఆత్మాన్నత్యదీప్తి, సుజ్ఞాన చైతన్య స్ఫూర్తి, సంజయుడు. పాపవిముక్తి, పుణ్యలోక ప్రాప్తి, అజ్ఞాన జనిత మోహవినాశానుశీలి గీతాదేవి. ధర్మయుక్తమైన, యోగశాస్త్రసార మిళితమైన కృష్ణార్జునుల సంవాదం వినడానికి శ్రద్ధాళువులు, ఈర్ష్య అసూయలు లేనివారు, భక్తియుక్తులైన పావనులే అర్హులట. అతి రహస్యంగ్రే ష్ఠమైన ఆనందానుభూతికి చెప్పసాధ్యం కాదట. అసలు భగవానుని విశ్వరూపమే అత్యద్భుతమట. అందుకే గీత చివరలో అర్జునుడు "కృష్ణా! నా అజ్ఞానం తొలగింది. సుజ్ఞానం కలిగింది. సంశయాలు నశించాయి. నీ యాజ్ఞ ప్రకారం కర్తవ్య ధర్మ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాను" అంటాడు. ఈ గీతోపదేశాన్ని ధృతరాష్ట్రునకు వినిపించిన సంజయుడు కూడా "రాజా! కృష్ణార్జునుల సంభాషణ, పరమాత్మ విశ్వరూప సందర్శనం, తలచుకొన్న కొలది ఒడలు పులకరిస్తుంది. హృదయం ఆనందానుభూతికి లోనవుతోంది" అంటూ మరీ మరీ తలచుకొని భక్తితో చేతులు ముకుళిస్తాడు.


గీత మత గ్రంథం కాదు. మానవ శాస్త్రం. మనిషి బ్రతుకు నీతి. మానవ జీవన వేదం. వేదం తెలియదగింది. తెల్సి ఆచరించదగింది. ఇంతకూ వేదం ఏం చెప్తోంది? ధర్మం. మానవ ధర్మంశ్రీ యోదాయకమైన కర్మమే ధర్మం. ధర్మం పుణ్యాన్నిస్తే మన పాపాలు శిథిలమవుతాయి. గీత కూడా అలాంటిదే. గీత కష్టమైంది కాదు. క్లిష్టమైంది కాదు. స్పష్టత నిచ్చే మానవ జీవన సవిమర్శక పరిశీలనం. ప్రకృతిలో, ప్రకృతి జీవులతో సహజీవనం సాగించే మానవుడు తనను తాను తెల్సుకొని, సకల సృష్టికి మూలమైన పరబ్రహ్మ తత్వదీప్తిని గుర్తించి, ఆ పరబ్రహ్మానుభూతిని పొందాలి. చేసే కర్మలు, కదిలించే ఊహలు, కవ్వించే ఊసులు, బంధుత్వ బాంధవ్యాను బంధాలకు, బంధనాలకు మూలమైన మనస్సు, దాన్ని నిగ్రహించుకొనే తీరతు తెన్నులను సమగ్రంగా ఆవిష్కరించింది భగవద్గీత. గీత యోగశాస్త్రం. సమత్వమే యోగం. విషమత్వం అనగా భేదభావం రోగం. ఆత్మ పరమాత్మల కలయిక యోగం. ఆత్మే పరమాత్మ యనే అద్వైతరీతికి, నీతికి యోగం ఒక సంకేతం. సృష్టిలోని ప్రాణులన్నీ ఒక్కటే. అందరిలో ఉన్న ఆత్మ కూడా ఒక్కటే. అంతర్యామియైన అక్షర పరబ్రహ్మ ఒక్కడే. కులాలను దేహాలు సృష్టించాయి. ఆత్మలు కావు. నశించే దేహాలకు విలువేముంది? నశించని శాశ్వతమైన జీవాత్మలు ఒక్కటే. ఇది గీతామాత కుండ బద్దలు కొట్టి చెప్పింది. అదే "ఆత్మవత్ సర్వభూతాని సర్వభూతానిచ ఆత్మని".


701 శ్లోకాలలో 18 అధ్యాయాలలో సాగిన గీతలో 12వ అధ్యయం భక్తియోగం. 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని ప్రదర్శించి, ఉపసంహరించుకొన్న పరమాత్మ "అర్జునా! వేదాధ్యయనంతో గాని, యజ్ఞాలతో గాని, తపోదానాదులతో గాని నన్ను జీవులూ డలేరు. అనన్యభక్తితో మాత్రమే నను చూ డగలరు. తెలియగలరు. నను పొందగలరు" అనగానే అర్జునుడు "కృష్ణా ! నిన్ను ఉపాసించేవారిని, ఇంద్రియాతీతమౌన అక్షర పరబ్రహ్మను ధ్యానించేవారిని, వీరిలో యోగజన్ములయిన వారిని గూర్చి తెలుపు"మంటాడు. అప్పుడు స్వామి భక్తి యోగానికిశ్రీ కారం చుడతాడు. భక్తి వలన పొందే ఫలితం, అందుకున్న ఆధ్యాత్మిక సాధనలు, భక్తుల స్వభావాలను సరళ సుందరంగా స్వామి చెప్తాడు. అదే భక్తియోగం.


భక్తియోగసారం : మానసిక ప్రవృత్తిని నిల్పి, శ్రద్ధాసక్తులతో, పరమాత్మను సదా ఉపాసించేవారు యోగివరులు. వీరు ఇంద్రియాలను జయించి, సమబుద్దితో, భూతదయ గలి, సనాతనము, సత్యము, శివము, సుందరమైన అక్షర పరబ్రహ్మను ఉపాసిస్తూ, ఆ దైవమునే చేరుతున్నారు. నిజానికి ఇది అంత సులభం కాదు. దేహాభిమానం గల జీవులకు నిర్గుణ, నిరాకార పరబ్రహ్మ ప్రాప్తి కష్టతరం. సర్వకర్మలను సర్వేశ్వరునకు అర్పించి, సగుణ రూపుడైన పరతత్త్వాన్ని ఉపాసించి, అనన్యమైన భక్తియోగంతో పరమాత్మను చేరి, భవబంధ విముక్తిని కోరేవారిని స్వామి ఉద్దరిస్తాడనేది నిజం. అయితే చిత్రాన్ని సర్వేశ్వరునిపై లగ్నం చేయడంలో కష్టత, క్లిష్టతలు కల్గితే, అభ్యాస యోగం ద్వారా ప్రయత్నించాలి. అభ్యాసయోగం కూడా కష్టమైనప్పుడు పరమాత్మకు సంబంధించిన కర్మలను శ్రద్ధాసక్తులతో నిర్వహించిననూ అలాంటి జీవుడు దేవుని చేరగలడు. అదియును సాధ్యం కానప్పుడు కర్మఫల త్యాగం చెయ్యాలి. అదే ఈశ్వరార్పణ బుద్ది. చేసేయా చేది, యోచించేది వాని ఫలితాలు అన్నీ పరమాత్మవేయన్న అనుభూతి రావాలి. అభ్యాసం కన్నా శాస్త్రజ్ఞానం, జ్ఞానానుభూతి లేని పరోక్షజ్ఞానం కన్నా, పరబ్రహ్మ సగుణోపాసన శ్రీ ష్ఠం. సగుణోపాసనారూపమైన ధ్యానం కన్నా కర్మఫలత్యాగం శ్రీ భ్రమైంది. ఇలా అర్జునునకు పరమాత్మ భక్తిమార్గాల వివరాలను చెప్తూ, ఏది సులభమనిపిస్తే అది చేయమని సెలవిచ్చాడు.


భూతదయ, మమకార అహంకారాలు లేకుండుట, సుఖాలకు పొంగిపోవడం, దుఃఖాలకు క్రుంగిపోవడం కాకుండా సమభావంతో ఉండడం, క్షమాగుణం, దొరికినదానితో సంతృప్తి, త్రికరణాలను వశమందుంచుకోవడం, పరమాత్మ యెడల దృఢసంకల్పం, విశ్వాసం కల్గి ఆయనయందే మనస్సును, బుద్ధి అర్పించేవాడు మంచి భక్తుడు. భగవానునకు ఇష్టుడైన భక్తుడు.


భూతదయ, మమకార అహంకారాలు లేకుండుట, సుఖాలకు పొంగిపోవడం, దుఃఖాలకు క్రుంగిపోవడం కాకుండా సమభావంతో ఉండడం, క్షమాగుణం, దొరికినదానితో సంతృప్తి, త్రికరణాలను వశమందుంచుకోవడం, పరమాత్మ యెడల దృఢసంకల్పం, విశ్వాసం కల్గి ఆయనయందే మనస్సును, బుద్ధి అర్పించేవాడు మంచి భక్తుడు. భగవానునకు ఇష్టుడైన భక్తుడు. అలాగే నిర్వికారుడు, ఆశాపాశాలను ③ చుకొన్నవాడు, నిర్మలుడు, నిశ్చలుడు, పక్షపాత రహితుడునై కర్మల యెడల కర్తృత్వాభిమానం లేకుండా దైవాన్ని ఉపాసించేవాడు నిజమైన భక్తుడు. సమభావం, సమబుద్ది, సమయోగాలు భక్తుల ప్రధాన లక్షణాలు. నిత్యసంతుష్టి, స్థితప్రజ్ఞతలతో అమృతరూపమైన ధర్మమును అనుష్ఠించడం భక్తుల విధి. ఇలాంటి భక్తులంటేనే పరమాత్మకు ప్రియం. ఇది భక్తియోగసారం.


భక్తి - విశేషాలు - భక్తియోగం - వివరణలు ::


"భజ్" అనే ధాతువు నుండి భక్తి యనే పదం ఏర్పడింది. భజించడం అనగా సేవించడం అని అర్థం. "సాత్వస్మిన్ పరమ మరూపామృత స్వరూపా - కేవల అవిచ్ఛిన్న అనుభవరూపా". పరమాత్మపై మభక్తి. ఈ మ అవిచ్చిన్నమైంది. అనుభవ రూపమైంది. అమృతమయమైంది. వాస్తవానికి జీవునకు భయం, భక్తి రెండూ అవసరమే. భయం ఇహం. భక్తి పరం. ఇహ పర సుఖాలను కోరక భగవానుని యందే మతో మనసును లగ్నం చేయడం భక్తి ఈశ్వరుని యందు మాత్రమే అనురక్తిని కలిగి యుండడం భక్తి యనియు ఒక నిర్వచనం. మొత్తానికి మలో నిజంగా అహం ఉండదు. భయమూ ఉండదు. నీచం ఉండదు. దౌష్ట్యం ఉండదు. శుచి, రుచి, అభిరుచులే ఉంటాయి. శాంతం, సహనం, సౌమనస్యం ఉంటాయి. సాత్త్వికత, సౌజన్యశీలం స్పష్టంగా కన్పిస్తాయి. కనుక స్వార్థం ఎరుగని పరమార్థం ఉంటుంది. పరహితార్థం స్పష్టపడుతుంది. కనుకనే అలాంటి మానుభూతి భక్తియై, ఇహముపై విరక్తి, పరమాత్మపై అనురక్తిని అవిచ్ఛిన్నంగా పెంచి పరమునందిస్తాయి. ఈ భక్తులు కూడాఆ ఆర్తులు, జిజ్ఞాసువులు, అధార్డులు, జ్ఞానులు అని చతుర్విధంగా కన్పిస్తారు. అందరూ భక్తులే. భగవదనురక్తులే. పుణ్యాత్ములే. పావనమూర్తులే. కాని వారిలో భక్తిని రేపించిన కారణాలే విభిన్నాలు. కష్టాలు, నష్టాలు, ఛిద్రాలు, బాధలు, వేదనలు, రోదనల వలన వాని నుండి విముక్తి కోరుతూ భక్తిని ప్రకటించేవారు ఆర్తులు. భగవంతుని తత్త్వదీప్తిని, భగవానుని మహిమా స్ఫూర్తిని తెలియాలని కోరుకొనేవారు జిజ్ఞాసువులు. "జిజ్ఞాస" అనేది పురాకృత సుకృతంతోనే జీవునకు సిద్ధిస్తుంది. దైవాన్ని గూర్చిన జిజ్ఞాసతో భక్తిని అనుభవించేవారేజిజ్ఞాసువులు. సంపదలు, ప్రయోజనాలు ఈ రెండు తనకు లేదా తానున్న మానవ సమాజానికి కావాలని కోరి భక్తిని పాటించేవారు అర్థార్డులు. నిష్కామబుద్ది అనగా తాను చేసే కర్మలో ప్రతిఫలం లేకుండా, ఈశ్వరార్పణ బుద్ధితో, ఆత్మజ్ఞాన అనుభూతితో పరమాత్మను భజించేవారు జ్ఞానులు. శుకమహర్షి, నారదుడు, భీష్ముడు మొదలైన వారు జ్ఞానులు. నాల్గు విధములైన భక్తులలో జ్ఞానులు సర్వదాళ్ ష్ఠులు.


ఇక గీతలో భక్తియోగం గానావసరమున భగవానుడు కొన్ని అంశాలను స్పష్టమైన పదాలతో చెప్పడం గురించి ఆలోచించాలి. 1. "అనన్యేనైవ యోగేనమాంధ్యాయమౌ" పరమాత్మను తప్ప ఇతరములను తలంచని యోగంతో ధ్యానించి, ఉపాసించే వారిని భగవానుడు సంసార సాగర రూపమైన భవబంధాల నుండి విముక్తిని కల్గిస్తాడట. మనసు చేసే మాయలు అనంతం. మనసు నిల్పే చిత్రాలు, దృశ్యాలు అనూహ్యాలు. కనుక చిత్తవృత్తిని నిరోధించాలి. అంటే పరమాత్మే పరమునిచ్చే దివ్యశక్తియని 2. "అభ్యాస యోగేన తతోమామిచ్ఛాప్తుం" అభ్యాస యోగంతోనే పరమాత్మను పొందాలని కోరుకోవాలి. మానవులకు మనస్సే బంధ మోక్షములకు మూలం. ఎంతగా యత్నించిననూ,మనసుమాట వినదు. అందుకు అభ్యాసయోగం కావాలూ పులు వెళ్ళిన చోటుకు మనస్సు వెళ్ళరాదు. మనస్సు వెళ్ళిన చోటుకు మనిషి వెళ్ళరాదు. దృశ్య ప్రపంచం కల్ల. కలలో కల్గిన లాటరీ, కల చెదిరితే లాటరీ హుళక్కి. ఈ వాస్తవం గుర్తించి మనస్సును ఆత్మయందు నిశ్చల పరచడానికి అభ్యాసం అనగా యోగసాధన చేయాలి. ఇది సాధ్యం కాకపోతే "మత్కర్మ పరమో భవ" పరమాత్మ సంబంధమైన ఆధ్యాత్మిక కర్మల యెడల ఆసక్తిని పెంచుకొని అడుగులు వేయమని హితవు.


3. "దృఢ నిశ్చయః" - "మయ్యర్పిత మనోబుద్ధిః" భగవానుని యందు దృఢనిశ్చయం కావాలి. స్వామి యందే మనోబుద్ధులను సమర్పించాలి. అప్పుడు నిజమైన భక్తి అనుభూతి కల్గుతుంది. మాయల దయ్యం మనసు. అది నిశ్చలం కావాలంటే భగవంతుడున్నాడనే నమ్మకం దృఢం కావాలి. నమ్మకం బలం పెరిగితే మనోనిశ్చలత ఫలం దొరుకుతుంది. దృఢమైన మనోబుద్దులు పరమాత్మను ఎరుకపరుచుతాయి అన్నది నిజం.


4. "స్థిరమతిః భక్తిమాన్" స్థితప్రజ్ఞత కలవాడే భక్తుడు. శత్రువులు, మిత్రులు, మానావమానములు, సుఖదుఃఖాలు, ఆనంద విషాదాఅణలు అన్నింట్లో సమంగా ఉండేవాడే, ఏ విషయం లోనూ ఆసక్తి, అనుబంధం లేకుండా మౌనంగా యుండే నిత్యసంతుష్టి, స్థితప్రజ్ఞుడు. అలాంటి స్థితప్రజ్ఞతే భక్తి పరాకాష్ఠకు మూలమై జీవుని దేవుని దగ్గర చేస్తుంది.


5. "ధర్మ్యామృతం..." అమృత రూపమైన కర్తవ్య ధర్మాన్ని క్రమంగా, నిష్ఠగా, నియతిగా, అనుభూతితో ఆచరించే శ్రద్ధాళువులు పరమాత్మకు ఇష్టమైన భక్తులట.


భక్తియోగంలో మొత్తం 20 శ్లోకాలున్నాయి. స్థూలంగా చెప్పిననూ, స్పష్టంగా భక్తి విధానాలను, మార్గాలను పరమాత్మ వివరించాడు. 


పరమాత్మ నిర్గుణుడే. నిరాకారుడే. కాని సగుణుడు. సాకారరూపుడైన స్వామిపై మనసు నిల్పి ఉపాసనారీతిని అభ్యసించి, క్రమంగా నిరాకార మూర్తిని ఆశ్రయిస్తే ఫలితం సులభం. భక్తితోనే పరమాత్మ సాధ్యం. అందుకు మనోబుద్ధుల సమర్పణం కావాలి. ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామ కర్మలు చేయాలి. స్థితప్రజ్ఞత అవసరం. అందుకే అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం అనేవి ఎనిమిది పుష్పాలు. ఈ గుణపుష్పాల సమర్పణతోనే స్వామి స్వాధీనమవుతాడనేది అక్షరసత్యం. గీతాజయంతి సందర్భంగా మనం పైన పిన సుగుణ పుష్పాలతో స్వామిని అర్చించి, అర్పించి, తరిద్దాం.