మన ప్రతి ఆలోచన భగవంతుని వైపునే ఉండాలి

మన ప్రతి ఆలోచన భగవంతుని వైపునే ఉండాలి


భగవంతుడు ఈ విశాల సృష్టిని సృష్టించాడు. అందులో మానవులను కూడా సృష్టించి వారిని భాగస్వాములుగా చేశాడు. ఆయన సృష్టి ప్రతిక్షణం మార్పు చెందుతున్నదనే విషయం మనందరికీ తెలుసు. ఈ సృష్టితో పాటు | మనము క్షణ క్షణము మార్పు చెందుచున్నాము. కాని మానవుడు తాను, | తనవారను భావనతో మైమరచి, అసలు తనకు ఈ సృష్టికి గల సంబంధమును తెలుసుకోలేకపోవుచున్నాడు. ఈ సృష్టిలో తనతో పాటు కోటానుకోట్ల జీవులు జీవించుచున్నవి. ఎన్నో వింతలు, విశేషాలు, సంతోషకరమైనవి, దుఃఖకరమైనవి, జ్ఞానాన్ని ఇచ్చేవి కొన్నెతే, రాక్షసత్వాన్ని పెంపొందించేవి మరికొన్ని జరుగుచున్నవి. కామ క్రోధ మోహ మద మాత్సర్యాలను పెంపొందించే విషయాలే ఎక్కువగా జరుగుచున్నవి. వీటి ప్రభావముచే ఈ సృష్టి ఒక చక్రవ్యూహం లాగా ఈ జీవుల్ని తిప్పని చోట తిప్పకుండా తిప్పుచున్నవి. కాని మానవులు ఈ చక్రబంధం నుండి విడివడుటకు ప్రయత్నించుట లేదు. అసలు ఈ బంధంలో ఇరుక్కున్నాననే జ్ఞానం సహితం లేక రకరకాల కోరికలతో అంతా నాకే కావాలి అని భావించుచు మరింత లోతుకు కూరుకుపోతున్నాడు. ఫలితంగా పునరపి జననం పునరపి మరణంలో ఇరుక్కుంటూ ఉన్నాడు. అసలు ఈ లోకంలో అన్ని జీవరాశులమాదిరిమనిషి కూడా పుట్టుట అవసరమా? ఎందుకు జన్మించాడు? మనమే కాకుండా మనతో పాటు 'నా' అనుకునేవారు, శత్రువులు అనువారు, తటస్తులు, తెలిసినవారు, తెలియనివారు, ఎందరు జన్మించారు, ఎందుకు ఇన్ని బాధలను, కష్టాలను అనుభవించుచున్నామని ప్రతివారు వారి జీవితాన్ని గురించి ఆలోచించాలి. ఎంత ఆలోచించినా కాని విషయం అర్థం కాదు. కాని సంపూర్ణమనస్సుతో భగవంతునిపై మనసును లగ్నము చేసి, ఆలోచించినచో జ్ఞానోదయముకాగలదు. ఈ సృష్టిమన కోసమే ఉద్భవించింది. సమస్త జీవులు, తోటివారు, శత్రువులు, మిత్రులు, తెలిసినవారు, తెలియనివారు అందరు మనకోసమే జీవించుచున్నారు. వీరందరు మనకు గురువుల వంటివారు. ప్రతివారి ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకొని ఆచరించదగినవిగా ఉండును. నిజానికి ఈ సృష్టిలో పనికిరానిదనే విషయం లేదు. అంతా ఉత్తమమైనదే, అందరూ మంచివారే. శత్రువులు గాని, చెడును ప్రోత్సహించేవారు గాని ఎవ్వరూ ఉండరు. కాని దానిని మనం ఏ కోణంలో డాలి? అనే దాని పైననే ఆధారపడి ఉంటుంది. మన ప్రతి ఆలోచన భగవంతుని వైపునే ఉండాలి. ప్రతి కదలిక లోక క్షేమాన్నే ఆశించాలి. ప్రతి పని మంచిదైనా, చెడ్డదైనా మన జ్ఞానోదయానికై భగవంతుడు ప్రసాదించిన ఒక సాధనముగా లేక అవకాశంగా భావించి దానిలోని మంచిని నేర్చుకోవాలి. ప్రతి విషయాన్ని భగవంతుడు ప్రసాదించిన అవకాశంగా భావించి ఇన్ని రకాల ప్రపంచములో మనం ఏవిధంగా జీవించుచున్నామన్నదే అసలు పరీక్ష. ఇదే ఈ జీవితపు ముఖ్య పరీక్ష. భగవంతుడు మనకై ఏర్పాటు చేసిన పరీక్ష. దీనిలో అందరము ఉత్తీర్ణులము కావాలని ఆశిద్దాం.


 వినా వేంకటేశం న నాథో న నాథః | సదా వేంకటేశం స్మరామి స్మరామి||