గీతాజయంతి -మరుదాడు అహల్యాదేవి 


గీతాజయంతి మరుదాడు అహల్యాదేవి 


యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్టో ధనుర్ధరః | తపై ర్విజయో భూత్రి వ నీతిర్మతిర్మమ ||


ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీ కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో, అక్కడ విజయం, లక్ష్మి తథ్యం. దశావతారాల్లో మానవ స్వభావానికి అత్యంత సమీపంగా కనిపించేది కృష్ణావతారం. సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుని ముఖపద్మం నుండి వెలువడింది భగవద్గీత. ఆదిలో సూర్యునికి, తద్వారా మనువుకు, మనువునుంచి ఇక్ష్వాకునికి విన్పించి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి వినిపించగా, జెండాపై ఉన్న కపిరాజు సంజయుని ద్వారా ధృతరాష్ట్రుడు గీతను విని, జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. ఈ "సర్వశాస్త్రమయి గీత" అని మహాభారతం భీష్మపర్వంలో చెప్పడాన్ని బట్టి వేదాలు, శాస్త్రాలు కంటే సాక్షాత్తు మహావిష్ణువు అవతారమైశ్రీ కృష్ణుని ద్వారా వెలువడింది కనుక 'భగవద్గీత' పరమ పవిత్రమైంది. గీత నేపథ్యం కురుక్షేత్ర యుద్ధం. యుద్ధంలో శత్రు నిర్మూలన చేసి ధర్మాన్ని నిలబెట్టాల్సిన మహావీరుడు అర్జునుడు నిరాశ చెందడంతో కర్తవ్యాన్ని బోధించడానికి గీతను ఉపదేశించాడు శ్రీ కృష్ణ పరమాత్మ.


'మాసానాం మార్గశీరోహమ్' |


అని చెప్పి శ్రీ కృష్ణ పరమాత్మ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీతను బోధించాడు. ఈ రోజు విష్ణుపూజ, విష్ణు సహస్రనామ పారాయణ, ఉపవాసం విశేష ఫలితాల నిస్తాయని శాస్త్ర వచనం. "పారా! పిరికివానిలా మాట్లాడటం నీకు తగదు. ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. గుండె నిబ్బరం చేసుకుని, యుద్ధానికి సిద్ధపడు" అని భగవానుడు అర్జునునికి కర్తవ్యాన్ని బోధించాడు. " మృత్యువు శరీరానికి గాని, ఆత్మకు కాదని, అశాశ్వత శరీరం గురించి బాధపడటం ధీరుల లక్షణం కాదన్నాడు.


యుద్ధం కేవలం రాజ్య సంపాదనకే అనుకోవడం పొరపాటు. యుద్ధం ధర్మరక్షణకు ఉద్దేశించింది. అర్జునుడు క్షత్రియ వీరుడు. ధర్మసంరక్షణ, దుష్టశిక్షణ క్షత్రియుని కర్తవ్యం. వ్యక్తి కర్తవ్య నిర్వహణ సామాజిక బాధ్యతగా చెప్పాడు. ఎలాంటి కష్టాలు, సమస్యలు ఎదురైనా వ్యక్తి ధర్మాన్ని ఆచరించి తీరవలసిందేనని గీత సందేశం ఇస్తోంది. "కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన | మాకర్మఫల హేతుర్భూః మాతే సంగోస్త్య కర్మణి || కర్మ చేయడంలోనే అధికారం ఉంటుంది గానీ ఫలితంతో కాదు, కర్మ ఫలితం ఆశించి ఏ పనీ చేయకూడదని భగవాన్ సందేశం. నిర్భయం, అంతఃకరణ శుద్ధి, స్థిరత్వం, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞకర్మల నిర్వహణ, త్యాగబుద్ధి, శాంతస్వభావం, మృదుభాషణ, క్షమ, సహనం మొదలైనవి ఉత్తమ గుణాలు.


మనసు చాంచల్యాన్ని వీడి, సుఖాలస్పృహ వదిలి, అనురాగం, భయం, క్రోధం లేనివాడే స్థితప్రజ్ఞుడు. మనసులోని కోరికలను వదిలిపెట్టి సహజ స్థితిలో ఆత్మానందాన్ని అనుభవించేవాడు స్థితప్రజ్ఞుడు. సుఖాల్లో పొంగి, కష్టాల్లో క్రుంగడం, దేనిపట్లా అనురాగ మమకారాలు పెంచుకోనివారు స్థితప్రజ్ఞులు. చుక్కాని లేని పడవను గాలి అటూ ఇటూ ఊపేసినట్లు ఇంద్రియాలకు లోబడిన మనస్సు బుద్దిని హరింపచేస్తుంది. ఇంద్రియ నిగ్రహం పాటించేవారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. స్థితప్రజ్ఞుడు ప్రాపంచిక విషయాల్లో నిద్రావస్థలో ఉండి, ఆత్మవిషయంలో జాగ్రత్తగా ఉంటాడు. ఎన్ని నదులలో నీరు వచ్చి కలిసినా సముద్రం హెచ్చు తగ్గులు లేక స్థిరంగా ఉంటుంది. స్థిరబుద్ది కలిగినవాడు ప్రాపంచిక విషయాలను అనుభవిస్తున్నా శాంతిని పొందుతాడు. అటువంటివాడు మరణ సమయంలో బ్రహ్మీస్థితికి చేరుకొని మోక్షాన్ని పొందగలడు. నిరాహారుడైన వానికి ఆహారం మీద కోరిక నశించదు గానీ పరమార్థం కోరుకునే స్థితప్రజ్ఞునికి మాత్రం అటువంటి కోరిక నశిస్తుంది. మానవుడు విషయలోలుడు. కోరికలు తీరకపోతే క్రోధం. దీనివల్ల ఆవేశంలో తనను తాను మరచి యుక్తాయుక్త వివేకం నశిస్తుంది. రాగద్వేషాలను విడిచిపెట్టినవాడు విషయాలను అనుభవిస్తున్నా నిర్మలాంతఃకరుణుడు అవుతాడు. అటువంటి నిర్మల మనస్కునికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. అనురాగం, భయం, క్రోధం విడిచిపెట్టి, జ్ఞానమనే తపస్సుతో పవిత్రమైన వారు నన్ను చేరుకుంటారు. విద్య, వినయ సంపన్నులైన బ్రాహ్మణుల పట్ల, గోవులు, ఏనుగులు, సర్వప్రాణుల పట్ల జ్ఞానులు సమదర్శనులై ఉంటారు. "సమ దుఃఖ సుఖం ధీరా సోమృతత్వాయ కల్పతే" సుఖ దుఃఖాల పట్ల సమానంగా ఉండేవాడే అమృత తుల్యాన్ని సాధించగలడు. చిరిగిన, పాత వస్త్రాలను విడిచి కొత్తవి ధరించినట్లు, జీర్ణించిన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త శరీరాలను ధరిస్తూ ఉంటుంది. "దేహాభిక్రమనాశోస్తి ప్రత్యపాయో న విద్యతే | స్వల్ప మప్యస్య ధర్మస్య తాయతే మహతో భయాత్" || కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మనం మన ధర్మాన్ని కొద్దిగా ఆచరిస్తే చాలు. గొప్పదైన సంసార భయం తొలగిపోతుంది. ఆదర్శ వ్యక్తుల నడవడికను సమాజం ప్రమాణంగా తీసుకుంటుంది. ఆ "త్రివిధం నరకమ్యేదం ద్వారం నాశన మాత్మనః | కామ క్రోధ స్తధాలోభః తస్మా దేతత్తయం త్యజేత్" || కామ క్రోధ లోభాలు నరకానికి ద్వారాలు. అవి వినాశనానికి దారి తీస్తాయి. ప్రయత్నపూర్వకంగా వాటికి దూరంగా ఉండాలి. అప్పుడే మోక్షసిద్ధి. విషయాలను నిగ్రహించుకోలేని వారికి నిర్మలబుద్ది ఉండదు. అటువంటి వారికి జీవిత లక్ష్యం ఉండదు. అలాంటి వారికి మనశ్శాంతే ఉండదు. - ఇబ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునికి అనేక అంశాలు బోధించి, యుద్ధంలో నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. భగవద్గీత మాహాత్మ్యాన్ని వరాహపురాణం ఇలా వివరించింది. కామ క్రోధ లోభాలు నరకానికి ద్వారాలు. అవి వినాశనానికి దారి తీస్తాయి. ప్రయత్నపూర్వకంగా వాటికి దూరంగా ఉండాలి. అప్పుడే మోక్షసిద్ధి. విషయాలను నిగ్రహించుకోలేని వారికి నిర్మలబుద్ది ఉండదు. అటువంటి వారికి జీవిత లక్ష్యం ఉండదు. అలాంటి వారికి మనశ్శాంతే ఉండదు. - ఇబ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునికి అనేక అంశాలు బోధించి, యుద్ధంలో నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. భగవద్గీత మాహాత్మ్యాన్ని వరాహపురాణం ఇలా వివరించింది. "సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే | గోపాల గోపి కాశ్చ నారదోద్ధవ పార్పదైః | సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే' || గీతా పారాయణం జరిగే చోట సమస్త దేవతలు, ఋషులు, యోగులు, వాసుకి, అనంతుడు, నాగులు, గోపాలురు, గోపికలు, నారదుడు, ఉద్దవుడు మొదలైన వారందరూ ఉండి సహాయం చేస్తుంటారని విష్ణుమూర్తి భూదేవికి చెప్పాడు. గీతాభ్యాసంలో నిమగ్నమైన వారు ఉత్తమ ముక్తిని పొందుతారు. మరణ సమయంలో గీతను స్మరిస్తే సద్గతి దక్కుతుంది. "అనన్యా శ్చింత యంతో మాంయే జనాః పర్యుపాసతే | తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్" || ఇతర ఆలోచనలేవీ లేకుండా నన్నే స్మరిస్తూ సదా నా పట్లే మనసు నిలిపిన వారి యోగక్షేమాలు నేచూ స్తుంటాను" అని భగవానుడు భక్తులకు హామీ ఇచ్చాడు. "శుద్ధమైన మనస్సుతో పత్రం, పువ్వు, పండు, జలం ఏది సమర్పించినా మతో స్వీకరిస్తాను" అని భగవానుడు చెప్పాడు. భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాల గురించి విలువైన సందేశాలు గీతలో ఉన్నాయి. సృష్టి క్రమం, మానవుల కర్తవ్యాలు గీత గీతలో ఉన్నాయి. సృష్టి క్రమం, మానవుల కర్తవ్యాలు గీత వివరించింది. స్వార్థ, రాగ, ద్వేష, మమకార, అహంకార, వికారాది గుణాల నిర్మూలన నిమిత్తం భగవద్గీత అవతరించింది. 'గీతాజయంతి' పర్వదినాన భగవద్గీతను భగవత్ స్వరూపంగా పూజామందిరంలో యధోచితంగా పూజించి, గీతా పారాయణం జరపటం సంప్రదాయం. జాతి, మత, స్త్రీ పురుష వివక్షత లేకుండా గీతా బోధామృతం ఆస్వాదించి, గీతా సందేశాన్ని అందుకొని, ఆచరించే దిశలో చరిద్దాం. ఆధ్యాత్మికానందానుభూతిని పొంది తరిద్దాం. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతాజయంతి. సకల ఉపనిషత్తుల సారమైన భగవద్గీతని పూజించి, అర్థం చేసుకొని మన జీవితాలను సరిదిద్దుకోవాలి.


ఒక పూలహారం, ఒక దీపం, మిఠాయితో తయారయిన ప్రసాదం ఇవీ పూజాసామగ్రి. గీతను పూజించాక, గీతాపఠనం, హారతి ఇవ్వాలి. ఈ పండుగ ఉద్దేశం గీత సిద్ధాంతాలు, ఉపదేశాలు ఆత్మానుభవంలోకి తెచ్చుకొని, జీవితాన్ని ఆ ప్రకారం తీర్చిదిద్దుకోవాలి. అదే భగవద్గీతకు నిజమైన ఆరాధన. . "కర్మ ఆచరించు, కానీ దాని ఫలం గురించి ఆశించకు" ఇదీ గీతోపదేశ సారాంశం.