తప్పక తెలుసుకోవలసిన విషయాలు - శ్రీశ్రీశ్రీ వైకుంఠ నారాయణులు


గత సంచిక 71 బ్రహ్మాండంలో ఏ లోకంలో ఉన్నా ప్రకృతి | I . సంబంధముతో ఉన్నట్లే. అంటే సంసారంలో ఉన్నట్లే. దుఃఖముతో కూడిన సుఖమే తప్ప, కేవల సుఖము ఏ బ్రహ్మాండంలోనూ లభించదు. పరమ పదములో మాత్రము, ఏవిధమైన కలీలేని గొప్ప ఆనందం లభిస్తుంది. అది ఎల్లప్పుడూ పెరిగేది. ఏనాటికీ అంతము లేనిది. దానిని మనకు లభింపచేయాలనిశ్రీ మన్నారాయణుడు ఎప్పుడూ ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. అందులో భాగమే వివిధ అవతారాలు.


 ఆయా అవతారముల వలన ప్రయోజనము, ఆయా | L. కాలాలలో ఉన్నవారికే అధికం. మిగిలినవారు రామాయణము, భారతము, భాగవతము వంటి గ్రంథముల ద్వారా ఆ అవతారములను అనుభవించవలసినదే. అంతకు మించి ఎక్కువ ప్రయోజనాన్ని జీవులకు కల్పించాలని విగ్రహరూపంగా కూటీ మన్నారాయణమూర్తి అవతరించాడు. అలా అవతరించిన మొట్టమొదటి విగ్రహం ప్రస్తుతం మనం శ్రీ రంగంలో దర్శిస్తున్న రంగనాథుని రూపం. అటు తరువాత, అనేక స్థలాలలో అనేక రూపాలలో ఆయన విగ్రహ రూపంలో అవతరిస్తూనే ఉన్నాడు. 


72 అలా ఆయన అవతరించిన ఒక ఆలయానికి | ఎ. వెళ్ళి, అక్కడ ఉండే విగ్రహాన్ని దర్శించినపుడు, ఆ విగ్రహము'లో'శ్రీ మన్నారాయణ మూర్తి ఉన్నాడు అని భావించకూడదు. ఆ విగ్రహ'మేశ్రీ మన్నారాయణమూర్తి అని భావించాలి. ఆలయంలో ప్రవేశిస్తూనే రాజ (గాలి) గోపుర శిఖరం దర్శించాలి. ధ్వజస్తంభం వద్ద శిరసా నమస్కరించాలి. గరుడాళ్వార్లని దర్శించి అక్కడి నుండే మూల విరాట్ ను దర్శించ ప్రయత్నించాలి. లక్ష్మీ సన్నిధిలో నమస్కరించి గర్భగుడిలో ప్రవేశించాలి. స్వావిశ్రీ పాదములను దర్శించి ధన్యులమవాలి. మన మన ఇళ్ళలో ఉన్న ఆరాధన మూర్తులు కూడ స్వయంగా శ్రీ మన్నారాయణ మూర్తె అని తెలుసుకోవాలి.


74 పరమపదంలో అపరిమిత ఆనందాన్ని /+.మనమందరం పొందడానికి వీలుగా ఎన్నో మార్గాలనశ్రీ మన్నారాయణమూర్తి శాస్త్రములలో సూచించాడు. వాటన్నింటిలోకి ఆయనకు ఇష్టమైనది 'తనను మించడం'. ఏ విధమైన ఫలమును ఆశించకుండా మించడం. దానిని మనకు అలవాటు చేయడానికి అష్టోత్తర శతనామావళులలో ప్రతి నామానికి చివర 'నమః' అని పెద్దలు మన చేత చెప్పిస్తూ ఉంటారు.


75 'నమః' అంటే 'నా కొరకు కాదు' అని అర్థం. ఎ.నామాలలో 'కేశవాయ', 'మాధవాయ' అని అంటే కేశవుని కొరకు, మాధవుని కొరకు అని అర్థం. 'ఈ పుష్పములు సమర్పిస్తున్నప్పుడు లేదా ఈ పసుపు, కుంకుమలు సమర్పిస్తున్నప్పుడు ఇవి నీ కొరకే తప్ప నా కొరకు కాదు. నేనేమీ ఆశించడం లేదు' అనే భావాలను అభ్యాసం చేయడం కోసం అర్చనలు జరుగుతూ ఉంటాయి. తప్పక పాల్గొని 'నమః' అని ఉచ్చరిస్తూ ఉండాలి నామం తెలియకపోయినా. 'నారాయణాయ నమః' అని ప్రతిసారి అనగలుగుతే ఇంకా మంచిది.శ్రీ మతే నారాయణాయనమః' అని అనగలిగినవారికి లక్ష్మీదేవి సిఫారసు కూడా లభించి ధన్యులవుతారు. -


7 పరస్పర పరిచయం లేని ఒక యువకుడు, ఒక తనకు తెలియకుండానే మించడం ప్రారంభిస్తుంది. ఆ మకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనము ఉండదు. అదేవిధంగా, శ్రీ మన్నారాయణ మూర్తిని ఈ జీవులు భర్తగా మించగలగాలి. దానిని 'భక్తియోగం' అంటారు. - .యువతి వివాహము చేసుకున్న తరువాత, అతడు తన భర్త అనే భావనను ఆమె క్రమంగా కొంతకాలానికి దృఢ పరుచుకుంటుంది. అతనితోటే ఉంటూ, అతని మాటలే వింటూ,తనకు తెలియకుండానే మించడం ప్రారంభిస్తుంది. ఆ మకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనము ఉండదు. అదేవిధంగా, శ్రీ మన్నారాయణ మూర్తిని ఈ జీవులు భర్తగా మించగలగాలి. దానిని 'భక్తియోగం' అంటారు. -


77 ఏపనైనా చేస్తున్నపుడు, తాను చేసినందువలన కాక, | | శ్రీ మన్నారాయణ మూర్తి అనుగ్రహం వలననే ఆ పనికి ఒక ఫలితం వచ్చిందని భావిస్తూ ఉంటే దానిని 'కర్మయోగం' అంటారు. అదే క్రమంగా 'జ్ఞానయోగం'గా మారిపోతుంది. అప్పుడు తనకిశ్రీ మన్నారాయణ మూర్తికి మధ్య ఉండే బంధము స్పష్టమవుతుంది. ఆ తరువాతి దశలో 'భక్తియోగం' వికసిస్తుంది.


| 0.ఒక గురువు గారిని ఆశ్రయించడం మంచిది. ఆయన వద్ద 'నారాయణ' మంత్రాన్ని ఉపదేశం పొంది దానిని అనుసంధానం చేస్తూ ఉంటే జీవితమే మారిపోతుంది. తాను శ్రమపడవలసిన అవసరం లేకుండా పిత్రార్జితమైన ఆస్తి లభించినట్లు నారాయణ మంత్రశక్తి లభిస్తుంది. అంతవరకు కష్టాలుగా కనిపించినవి ఇక ఆ విధమైన భావనను ఈయవు. అన్నిటాశ్రీ మన్నారాయణ మూర్తిని దర్శిస్తూ, సుఖంగా కాలం గడిపి, అటుపిమ్మట నేరుగా పరమపదాన్ని చేరుకోవచ్చు. ఇది మన జీవిత లక్ష్యం. ఇదే జీవులందరి లక్ష్యం.


గమనిక ఈ 78 విషయములు సూత్రప్రాయంగా మాత్రమే అందించబడ్డాయి. అనగా ప్రాథమిక అవగాహన కొరకు మాత్రమే తెలియపరచబడినాయి. మరింత వివరంగా తెలుసుకొనదలచివాను శాస్తాభ్యాసమును చేసి కాని, శాస్త్రాభ్యాసం చేసిన పండితులను కాని ఆశ్రయించి తెలుసుకొనవచ్చును. - ప్రకాశకులు