33. ఇరవై రెండేళ్ళ విరహం... ముగింపు


33. ఇరవై రెండేళ్ళ విరహం... ముగింపు


                                        నాకు మహాలక్ష్మి మాటిమాటికీ గుర్తుకొస్తోంది. ఆమెను వెంటబెట్టుకు వస్తానని కోలహపురానికి వెళ్ళినశ్రీ నివాసుడు ఇంకా తిరిగి రాలేదు. ఇరవై రెండేళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇన్నేళ్ళు బరువుగా.... మోయలేనంత బరువుగా గడిచిపోయాయి. అప్పటినుంచి పద్మావతి వరాహ క్షేత్రంలో భర్త కోసం ఎదుచూ స్తూనే ఉంది. వేంకటాచలం మీద ఆకు కదిలినా ఆయన అడుగుల చప్పుడులా వినిపిస్తోంది ఆమెకు. పక్షులు కూసినా ఆయన మాటల సవ్వడి అనిపిస్తోంది. చిరుగాలి వీస్తే.... నింగిలో నిండు చందమామచూ స్తే... కోనేటి నీటిలో కమలామ్న స్తే... భర్తె కళ్ళముందు మెదులుతున్నాడు. తొండమానుడు పద్మావతి దగ్గరికి తరచుగా వచ్చి ఆమెకు ధైర్యం చెబుతున్నాడు. "అమ్మా! దిగులుపడకు. బాధపడకు. నీ సవతిని వెంటబెట్టుకుని రమ్మని నీ భర్తని పంపటం నీకే చెల్లింది. ఇంకా కొత్త కాపురం మోజు తీరలేదు. ముద్దూ ముచ్చటా తీరలేదు. ఆనందం అంచులూ లేదు. అయినా నీ భర్తని పంపావు" అన్నాడు తొండమానుడు. "ఏంచెయ్యను చిన్నాన్నా!ఆయన బాధవా డలేక పంపాను. ఆమెను నేను సవతిగా అనుకోలేదు. అక్కయ్యగా అనుకున్నాను. అయినా ఇందులో ఇసుమంతయినా ఆమె తప్పులేదు!" అంది తలవంచుకుని పద్మావతి. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆమె మొహరూ స్తే తొండమానుడికి నోట మాట రాలేదు. కాసేపు మౌనంగా ఉండిపోయాడు.


"అమ్మా!" ఆత్మీయంగా పిలిచాడు తొండమానుడు. చెప్పు చిన్నాన్నా!" అంది చీరకొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ పద్మావతి అంది. "అటు స్వామి... దైవం! ఇటు కూతురు! అడకత్తెరలో పోకచెక్కలా తయారయింది నా పరిస్థితి. ఏం చెయ్యాలో.... ఏం చెప్పాలో నాకు తెలియటం లేదు....." అన్నాడు తొండమానుడు. .................." పద్మావతి మౌనంగా ఉంది. "నినూ స్తే నాకు గర్వంగా ఉంది పద్మావతీ! నీకు ఎంత సహృదయం... ఎంత సౌజన్యం... ఎంత సౌశీల్యం... ఎంత సౌరభ్యం... ఎంత సౌమనస్యం... తల్లీ!" అని అభినందించాడు తొండమానుడు. .................." పద్మావతి మాట్లాడలేదు. "ఇంతవరకూ నీ భర్త గురించి చెప్పాను. ఇప్పుడు నా స్వామి గురించి చెబుతున్నాను విను. ఆయన తప్పక త్వరగా వస్తాడు. నిన్ను హృదయంలో పెట్టుకుంటాడు. నమ్మినవాళ్ళని నట్టేట ముంచేరకం కాదు!" నమ్మకంగా చెప్పాడు తొండమానుడు. "చిన్నాన్నా! ఆయన మీద నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది!" అంది పద్మా వతి. "ఆ విషయం నాకు తెలుసు తల్లీ! తెలుసు!" అని వెళ్ళిపోయాడు తొండమానుడు. పద్మావతికి ఒక్కో క్షణం ఒక్కో యుగంగా గడుస్తోంది. కాలుగాలిన పిల్లిలా ఆనంద నిలయంలో అటూ ఇటూ లేదు. తిరుగుతున్నారు పరిచారికలు. ఆమె వేళకి అన్నం తినటం లేదు. నిద్రపోవటం లేదు. చిక్కి శల్యమైపోయింది. వకుళ మాలిక తరచుగా వచ్చి కోడలి' సి వెళుతోంది. అలాగే సోదరుడు... బంధువులు వచ్చి వెళుతున్నారు. అందరూ అలా వచ్చి వెడుతుంటే ఆమెకి బాధ పెరుగుతోంది. తరగటం లేదు.


ఆమె ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. "వేంకటాచలాన్ని... వరాహస్వామిని... వకులమాలికను... నన్నూ... ఆనందనిలయాన్ని మరిచిపోయి కోలహపురంలో స్వామి ఎలా ఉన్నారో? వేళకి అన్నం తింటున్నారో లేదో... అసలు మహాలక్ష్మిని కలిశారో లేదో... ఆమెకి కోపం తగ్గిందో లేదో... ఈ విరహాన్ని ఇరవై రెండేళ్ళు ... ఇరవై రెండేళ్ళు నా దృష్టిలో అనంతకాలం ఎలా భరించానో... ఇంకెన్నాళ్ళు భరించాలో... నేను... ఇంకా విరహాన్ని భరించగలనా? ఏమో... ఈ తనువు అంతవరకు నిలిచేనా? రా స్వామీ! నన్ను నీ గుండెలకి హత్తుకో. నన్ను ఆలింగనం చేసుకో. నేనింక వేగలేను..." అంటూ పలవరిస్తోంది పద్మావతి. - వకుళమాలిక పరుగులాంటి నడకతో పద్మావతి దగ్గరికి వచ్చింది. ఆమె చాలా ఉద్వేగంలో ఉంది. పద్మావతి అత్తగారి మొహం వంకూ సింది. వకుళమాలిక కూడా పద్మావతి మొహంలోకి సూటిరూ సింది. ఇద్దరూ పరస్పరం మనస్సుల్లోని భావాల్ని గ్రహించారు. "కోడలు పిల్లా ఏంటీ బేలతనం?" పద్మావతి దగ్గరకు చేరి ఆప్యాయంగా ఆమె తలని నిమురుతూ అంది వకుళమ్మ. "అత్తయ్యా...." అంటూ భోరున ఏడ్చింది పద్మావతి. "ఏంటమ్మా... ఇది? ఎందుకీ దుఃఖం...?" అనునయంగా అడిగింది వకుళమాలిక. అంతఃపుర పరిచారికలు అక్కడినుంచి దూరంగా వెళ్ళి నిలబడ్డారు. "ఇన్నేళ్ళుగా ఈ బాధని భరించాను.... కానీ.... ఇక భరించలేను అత్తయ్యా!" మళ్ళీ ఏడుస్తూ అంది పద్మావతి. "ఊరడిల్లు తల్లీ! ఊరడిల్లు... ఆడవాళ్ళకి ఆకాశమంత ఓరిమిని ఇచ్చాడంటారు..." పద్మావతి కన్నీటిని చేతితో తుడుస్తూ అంది వకుళమాలిక. అంతలో పద్మావతికి ప్రియమైన పరిచారిక వచ్చి వకుళమాలికకి ఎదురుగా నిలబడింది.


"అమ్మగారూ!" అంది పరిచారిక. "చెప్పు..." అంది వకుళమాలిక. "ఇవ్వాళ తెల్లవారు జాము నుంచి పద్మావతీ దేవిగారు ఎందుకో ఇలాగే దుఃఖిస్తున్నారు. ఎంతగా అడిగినా కారణం చెప్పటం లేదు. అందుకే తమరికి కబురు పంపాను!" చెప్పింది. పరిచారిక. . "అలాగా!" అంది వకుళమాలిక. ఆమె కారణం గురించి ఆలోచించటం ఆరంభించింది. భర్తకోసమే దుఃఖిస్తోందని భావించింది వకుళమాలిక. "అత్తయ్యా!" అంది పద్మావతి. "ఎందుకు... ఏడుస్తున్నావు? చెప్పు తల్లీ! నిన్ను స్తుంటే నా గుండె తరుక్కుపోతోంది" అంది వకుళమాలిక. "శకునశాస్త్రం మీకు బాగా తెలుసు కదా! తెల్లవారు జామున వచ్చిన కలలు నిజమవుతాయా?" దిగులు దిగులుగా అడిగింది పద్మావతి. "శకునశాస్త్రం అనంతమయింది. నాకు కొద్దిగా తెలుసు. శుభశకునాల్ని మానవులకి సమకూర్చే దేవతలు అశ్వినీ దేవతలు. వాళ్ళ దగ్గరే తెలుసుకున్నాను. తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయని నమ్మకం ఉంది... నిదర్శనాలు కూడా ఉన్నాయి. నీకు ఏం కల వచ్చింది?" అడిగింది వకుళమాలిక. -


".................." కాసేపు కళ్ళు మూసుకుంది పద్మావతి. "చెప్పూ" అడిగింది వకుళమాలిక. "నాకు తెల్లవారు జామున కలలోకి మీ అబ్బాయి వచ్చారు. అక్కయ్య.... మహాలక్ష్మి కోసం తపస్సు చేస్తున్నారు... నిద్రాహారాలు మానేశారు... బాగా చిక్కిపోయారు... మొహం పాలిపోయింది... గుర్తుపట్టలేకపోయాను... నాకు భయంగా ఉంది... ఆయనకి ఏమీ కాదుకదా!" అంది ఏడుస్తూ పద్మావతి. "నేను చెబుతున్నాను... నివాసునికి ఏమీ కాదు. నన్ను నమ్ము తల్లీ!" అంది ఓదార్పుగా వకుళమాలిక. "భయంగా ఉంది అత్తయ్యా!" అంది పద్మావతి. - "పద్మావతీ దేవీ! కళ్ళు మూసుకో... యోగదృష్టిమేడు ... యధార్థం బోధపడుతుంది. మాయపొర తొలగిపోతే అంతా వెలుగే. భయమూ... విచారమూ... దుఃఖమూ ఉండవు. - వకుళమాలిక చెప్పినట్టే పద్మావతి కళ్ళు మూసుకుని యోగదృష్టితో అంతా గ్రహిస్తోంది. వకుళమ్మ చెబుతున్న మాటల్ని బుద్దిగా వింటోంది.


"పద్మావతీ! నువ్వు సామాన్య స్త్రీ వి కాదు. కారణజన్మురాలివి. ఆకాశరాజు కుమార్తెవి. నీకు బేలతనం తగదు. ఇలా దుఃఖించటం నీ భర్తపై యస్కరం కాదు. ధైర్యంగా ఉండు. నీ భర్త ఎవరనుకుంటున్నావు..శ్రీ హరి..శ్రీ మన్నారాయణుడు... ఆయనకి ఏమీ కాదు. మహాలక్ష్మితో కలిసి ఆనందంగా నీ స్వామి తిరిగి వస్తాడు. నా కుమారుడి మీద నాకు పూర్తిగా నమ్మకముంది. నా మాటల్ని నమ్ము!" అంది అప్యాయంగా అనునయంగా వకుళమాలిక. . పద్మావతికి మనసు తేలికపడింది. కళ్ళు తెరిచింది.


ప్రశాంతంగా ఉంది. బుద్ధి కుదురుగా ఉంది. కన్నీటిని తుడుచుకుంది. చిరునవ్వు ఆమె పెదవుల మీద చిగురించింది. కళ్ళు మిలమిలలాడాయి. "ఊఁ... నా కోడలంటే ఇలా ఉండాలి... బాగుంది!" అంటూ వకుళమాలిక ఆమె తలని నిమిరింది.. "నీకో శుభవార్త చెబుదామని వచ్చాను" అంది వకుళమాలిక. "ఏంటదీ?" ఆతృతగా అడిగింది పద్మావతి. "విను! నీకు ఆనందాన్ని కలిగించే తీపి కబురు ఇది!" ఊరిస్తూ అంది వకుళమాలిక. 'చెప్పండి... చెప్పండి! అత్తయ్యా!" అంది పద్మావతి. "సువర్ణముఖీ నదీతీరంలో తపస్సు చేస్తున్న శ్రీ నివాసుని మహాలక్ష్మి అనుగ్రహించిందని శుకమహర్షి కబురు పంపారు. ఆయనకి ధన్యవాదాలు తెలిపాను!" అంది వకుళమాలిక. "మహాలక్ష్మి అనుగ్రహించిందా? అయితే అక్కయ్యకి కోపం తగ్గిందన్నమాట!" సంతోషంతో అంది పద్మావతి. "అవును!" అంది వకుళమాలిక. "అయితే... అత్తయ్యా! మనం వెంటనే వెళ్ళి ఆయనని కలుసుకుందామా?" ఉత్సాహంగా అడిగింది పద్మావతి.


"ఎందుకూ.శ్రీ నివాసుడే మన దగ్గరికి వస్తున్నాడట!" అంది వకుళమాలిక. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగానే నందకం ఆనంద నిలయంలోకి వచ్చాడు... అతని మొహం వెలిగిపోతోంది. "నందకం ఎంటిరా ఇలా వచ్చావు?" ఆశ్చర్యంగా అడిగింది వకుళమాలిక. "అన్నయ్య వచ్చేస్తున్నాడోచ్..." గలగలా నవ్వుతూ చెప్పాడు నందకం. "నా కన్నయ్య వస్తున్నాడా?... నిజంగానా?..." ఆశ్చర్యంగా ఆనందంతో లేచి నిలబడి ఎదురుగా కళ్ళు చికిలించూ స్తూ నందకాన్ని అడిగింది వకుళమాలిక. తెల్లటి గుర్రం మీద ఎక్కి వచ్చాడు అన్నయ్య. ఆయన వెనక మరో గుర్రం మీద తొండమానులవారు కూడా వచ్చారు. ఇంకా... భటులు కూడా!" చెప్పాడు నందకం. "స్వామి వచ్చారా?" అంటూ గభాలున లేని తూలి పడబోయింది ఆమెను పరిచారిక పడకుండా పట్టుకుంది.