శ్రీ బదరీ నారాయణ క్షేత్రము

శ్రీ బదరీ నారాయణ క్షేత్రము                                        -                                                                                   ఈచంబాడి రామానుజం


శ్లో|| బహూని సంపత్తి తీర్థాని, దివి భూమౌ, రసాయిచ బదరీయ దృశ్యం, తీర్థాన నభూతో నభవిష్యతి - స్కంద పురాణం


స్వర్గ, మర్త్య, పాతాళములందు అనేవు ణ్యతీర్థములు కరు . కాని బదరీ తీర్థము వంటిది వేరొకటి ఇంతవరకును లేదు. ఇక ముందు కూడా ఉండదు అని భావము.


భారతదేశములో నాలుగు వేదములు, నాలుగు వర్ణములు, నాలుగు వర్ణాశ్రమములు - వలె నాలుగు దిశలయందును నాలుగు పీఠములు కలవు. అవి అతి ప్రాచీనమయినవి. తూర్పున పూరీ జగన్నాథస్వామి, దక్షిణమున రామేశ్వరము, పడమట ద్వారకాధీశుడు, ఉత్తరాన బదరీనారాయణ స్వామి కలరు.


వీటిలో పూరి, ద్వారక, రామేశ్వరములు - భగవంతుని లీలలను తెలియజేయుచున్నవి. ద్వాపర యుగము నందు శ్రీ కృష్ణుడు తన రాజధాని యైన గిరివ్రజపురమును వదలి ద్వారకకు వెళ్ళెనుత్రే తాయుగము నందుశ్రీ రామచంద్రుడు లంకను జయించినందువలన రామేశ్వరము నందు శివలింగ ప్రతిష చేసి రామేశ్వర లింగమును పూజించిరి. బద్రినాథుని యందు భగవంతుడు నర నారాయణుల రూపములతో తపస్సు చేసి, తపస్సు వలన విశేషములను ప్రపంచమునకు చాటి చెప్పెను. -


నా అవతార విశేషములు, కృత్యాలు, గుణాలను; నాతో తమకున్న భక్తి అను దృఢమైన బంధాన్ని కీర్తించు. మహానుభావులను వారు అనుగ్రహించిన నాలాయిరం దివ్య ప్రబంధాలను, నేను అపరిమితమైన ఆనందముతో వింటూ పరవశుడనవుతాను. - నాకు వారి మీదను, వారి ప్రబంధాల మీదను గల మ నిత్యము నా హృదయమున వసించు లక్ష్మీదేవి యందు కూడా ఉండదు అని పలికెను. ప్రాపంచిక భోగాలు అనుభవించు. కోరిక కలవారిని బుభుక్షువులు, భగవంతుని కైంకర్యము చేయుచు మోక్షము కోరని వారిని ముముక్షువులు అంటారు. భగవానునికి 3 విధములుగా కైంకర్యములు చేయవచ్చును. 1. తపో మంత్ర జపాదులు. మానసిక కైంకర్యములు 2. నమస్కరించడం, ప్రదక్షిణాలు చేయడం, పూలమాలికలు అర్పించడం, భాగవద్దివ్యాలయాలందు గల ప్రబంధాలను మళ్ళీ ముద్రించి భక్తులకు సమర్పించు మొదలైన కైంకర్యములుగా చెప్పవచ్చును.


3. స్తోత్రాలను, దివ్య ప్రబంధాలను పారాయణములు చేయడాన్ని వాచిక కైంకర్యాలుగా చెప్పవచ్చును. పన్నిద్దరు ఆళ్వారులలో శ్రీ గోదాదేవి తాను రచించిన ఆండాళ్ దివ్య ప్రబంధము నందు (32 పాశురాలు) తన 5వ పాశురములో ఈ విధముగా తెలిపెను.


అమరీ కులత్తివి తోడ్లుమ్ మణివిళక్కె త్తాయైకుడల్, విళ్కమ్, శెయదాయోదనై తూయమాయ్ వన్దు నామ్ మామలర్ తూవి తోళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క పోయప్పిళైయుమ్ ప్పుగుదురు వాని స్ధవుయ్ ,


భావము : రాజవంశమున పుట్టియు, గొల్లకులములో వెలసిన వాడు అయిశ్రీ కృష్ణుడు అందమైన దీపము వలె తల్లి కడుపున వెలిగినవాడు అగు దామోదరుని, పవిత్రముగా వచ్చి, పవిత్రమైన పూలను తెచ్చి, పూజించి, నోటితో పాడి, మనస్సులో ఆ దేవదేవుని నిల్పి స్మరించిన గడచిన (అనగా చేసిన పాపములు) పాపాలు నశించును.


"తూయ పెరునీర్ యమునై తురైవనై" - అనగా యమునా నదీ జలము శిశువు అయిన కృష్ణుని పాదములు తాకి పునీతమగుటచే, మన పాపములు కూడా నశించి పునీతులము అగుదుమని - ఆండాళ్ తెలిపెను.


బదరీ నారాయణుని దివ్యక్షేత్ర మహిమలు:


సృష్టి ఆరంభమున బ్రహ్మదేవునకు అయోనిజులైన పదిమంది పుత్రులు కలిగిరి.వారు - మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహందు, క్రతువు, భృగువు, దక్షుడు, భారద్వాజుడు మరియు నారదుడు. దక్షుడు,మనువుకుమార్తె అయిన ప్రసూతిని వివాహమాడెను. ప్రసూతికి 16మంది కుమార్తెలు కలిగారు. వారిలో 13వకుమార్తె యగు మూర్తికి నరనారాయణులు జన్మించారు. వారు ఇరువురు తన తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించసాగిరి. ఆమె వారిరువురి భక్తి శ్రద్దలకు మెచ్చి వరము కోరుకొమ్మని పలికెను. అందులకు వారు ఇరువురు తపస్సు చేసుకొనెదము.దయచేసి అనుమతి ఇమ్మని ప్రార్థించిరి. ఆ తల్లి ఇచ్చిన మాటను తప్పలేక ఇష్టం లేకున్నను తపస్సు చేసుకొనుటకు అనుమతించెను. - అంత ఇరువురు కుమారులు నైమిశారణ్యమనకు వెడలి ఘోర తపము చేయ ప్రారంభించిరి. ఒక పర్యాయము ప్రహ్లాదుడు తీర్థయాత్రలు చేయా నైమిశారణ్యమునకు వచ్చెను. అచట ధనుర్బాణపాణియై, తపస్సు చేయుచున్న వీరిరువురుచూ చి మోసకారులని భావించి వారితో యుద్ధము చేసెను. వెయ్యి సంవత్సరాలు వారితో యుద్ధము చేసిననూ, ఎవరునూ పరాజయము పొందలేకపోయారు. అప్పుడు ప్రహ్లాదుడు భగవానుడై శ్రీ మన్నారాయణుని ప్రార్థించగా వైకుంఠవాసుడు ప్రత్యక్షమై, "కుమారా వీరు ఇరువురు భగవంతుని అవతారము కలవారు. కారణజన్ములు అని తెలిపెను. అంత ప్రహ్లాదుడు వారిని క్షమించమని కోరెను.


పిదప ప్రహ్లాదుడు కుమారులారా! మీరు తపస్సు చేసుకొను చోటు ఇది కాదు. ఈ భారతావనిలో ఉత్తర భాగమున హిమాలయములలో శ్రీ మన్నారాయణుడు బదరీవాసుడై ఉన్నాడు. ఆ స్వామి వద్దకు వెళ్ళినవారిని తప్పక అనుగ్రహిస్తాడు. అక్కడకు వెళ్ళి తపస్సు చేసికొని ఆ బదరీవాసుని అనుగ్రహము పొందండి అని తెలిపెను. పిదప నర నారాయణులు బదిరీకాశ్రమమునకు వెళ్ళి అచట ఘోరముగా తపస్సు చేయ ప్రారంభించిరి. ఇంద్రుడు వీరిరువురి తపస్సుకు భయపడి స్వర్గము నుండి అప్సరసలను రప్పించి వారి తపస్సును భంగము చేయుమని కోరెను. అప్సరసలు చేయు చేష్టలు, నాట్యానికి నరనారాయణులు చలించలేదు. వారిని అవమాన పరచు విధముగా భగవంతుడగు నారాయణుడు తన తొడను స్పృశించి వారికన్నా అందమైన ఊర్వశిని, ఇంకా అనేక అందమైన స్త్రీలను ఉత్పత్తి గావించెను. అంత దేవేంద్రుడికి ఊర్వశితప్ప మిగిలినవారు (అప్సరసలు) అందవిహీనముగా కనిపించసాగిరి. కాని ఊర్వశితో సహా మిగిలినవారిని స్వర్గలోకమునకు తీసుకువెళ్ళమని తెలిపిరి నర నారాయణులు.


కృతయుగములో భగవానుడు బదరికావనములో సాక్షాత్తు నర నారాయణ రూపములో తపస్సు చేసిరి. ద్వాపర యుగము నందు నర నారాయణులు కృష్ణార్జునులుగా అవతరించిరి. - భగవానుడు ఋషులకు ఈ విధముగా తెలిపెను. "కలి యుగములో నా అసలు రూపమును ఎవరును దర్శించలేరు. నారద క్షేత్రములో ఉన్న, నా దివ్య మంగళ రూపమును తెచ్చి ఈ బదరీ క్షేత్రమునందు ప్రతిష్ఠించండి. ఆ దివ్యమంగళ రూపమును భక్తులు దర్శించి ముక్తిని పొందెదరు. ఈ బదరీ క్షేత్రానికి నాలుగు పేర్లుగా చెప్పబడుచున్నవి. అవి 1. కృతయుగములో దీనికి "ముక్తిపదము" అనియు, త్రే తాయుగమునందు "యోగసిద్ది" అని, 3. ద్వాపర యుగమున "ట్రీ విశాల్" అని, కలియుగమున "బదరికాశ్రమము" అని పిలువబడుతోంది. వరాహ పురాణమున 48వ అధ్యాయము నందు, విశాల మహారాజు కథ కలదు. సూర్యవంశపు రాజులలో విశాల మహారాజు యుద్ధములో ఓడి, తన రాజ్యమునంతయును పోగొట్టుకొనెను. పిదప పిచ్చివానివలె అరణ్యాలు, పర్వతాలు తిరగ బదరికాశ్రమము చేరి తపస్సు చేయసాగెను. అతని తపస్సునకు అనుగ్రహించిన నర నారాయణులు దర్శనమిచ్చి "వరము కోరుకోమని" తెలిపెను. అందులకు విశాల మహారాజు చేతులు జోడించి నమస్కరియా , తన రాజ్యమును తిరిగి వచ్చేలా చేయమని కోరెను. అంత భగవానుడు అతని రాజ్యమును తిరిగి ఇచ్చి, ఆ పట్టణమును "ద్రీ విశాల్" అను నామకరణముతో ప్రసిద్ది చెందునని తెలిపెను.


 నాథుని విగ్రహమును దర్శించిన వెంటనే, ఏ మతము వారైననూ వారి ఇష్టదైవమును దర్శించినట్లు సంతోషించెదరు. . విష్ణు ఉపాసకులు పద్మాసనములో ఉన్న భగవానుని యొక్క రెండు చేతులనే కాక, వాటి నుండి కుడి ఎడమల మరి రెండు చేతులనూ డగలము. శైవులకు సర్వాలంకారుడైన కైలాసవాసరూ డగలరు. నాభి మొదలుకొని కంఠము వరకు గల భాగము శివలింగోపాసకులకు మిక్కిలి ఆనందమును కలిగించును. మరికొందరకు, ఆయుధము ధరించి, జుట్టు విరబోసుకుని యున్న విగ్రహమునూ చి భద్రకాళి అని పూజింతురు. ఈ బదరీ క్షేత్రములో రామానుజుల వారి సాంప్రదాయము కలిగిన వైష్ణవులు కలరు. బదరీనాథుని ప్రక్కనే నారద విగ్రహము, నర నారాయణుల విగ్రహాలు, కుబేరుని విగ్రహము, ఉద్దవ, గరుడ విగ్రహములు, సుదర్శనుల వారి విగ్రహములు కలవు. వీరందరి' సిశ్రీ బదరీ వాసుని సేవించు విధములుగా కనబడును.


అఖండజ్యోతి:


బదరీవాసుని ఎడమవైపున 12 నెలలు ఆరిపోకుండా వెలుగుచున్న అఖండ జ్యోతి కలదు. గుడి ద్వారము మూసివేసిన రోజు ఈ దీపమును వెలిగించెదరు. ఆరు నెలల తరువాత మరలా ద్వారము తెరచినప్పుడు ఈ అఖండజ్యోతి పూర్వమువలె వెలుగొందు వుండుటమూ డగలము. ఈ అఖండ జ్యోతిని దర్శించుటకై మందిరము తెరచిన రోజున వేలకొలది యాత్రికులు వచ్చెదరు.


తప్తకుండము:


ఋషులు బదరీనారాయణ డడానికి వస్తూ ఉంటారు. వారు స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఒక పర్యాయము అక్కడ ఋషుల సభ జరిగినది. సప్తఋషులు, మునులు కూర్చొని భగవానుని గురించి చెప్పగా శ్రవణానందపరవశులై ఆలకించసాగిరి. ఆ సభలో అగ్ని భగవానుడు ప్రవేశించి అందరికీ భక్తితో చేతులు జోడించి నమస్కరించుచు వినయముతో "బ్రహ్మజ్ఞాన సంపన్నులైన మహరులారా ! నేను సర్వభక్షకుడను. పాతకుడను. నరకముతో సమానమైన ఈ పాతకము నుండి విముక్తిని పొందుటకు మార్గము ఏదైనా అనుగ్రహించండి అని ప్రార్థించెను. అప్పుడుమునులు అందరి తరపున వేదవ్యాసుడు "అగ్నిదేవా! అన్నింటికన్నారక్షించువాడు ఆ బదరీవాసుడే.


          అందరి పాపాలను నాశనము చేయు పరంధాముడు అతనే. మీ పాపాలను పోగొట్టి మిమ్ములను కాపాడు కరుణామయుడు అతనే. అతనిని భక్తి శ్రద్ధలతో పూజింపుము. తగిన ఫలితము కలుగును అనెను. వేదవ్యాసుని ముఖము నుండి వెలువడిన మాటలు విని అగ్నిదేవుడు ఉత్తరదిశగా వెళ్ళి గంధమాదన పర్వతమును చేరి అక్కడి గంగలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో బదరీ నారాయణుని ధ్యానము చేయసాగెను. అగ్నిదేవుని ధ్యానమునకు ప్రసన్నుడైన బదరీనారాయణుడు "వత్సా! నీ ధ్యానమునకు ప్రసన్నుడనైనాను. నీకు కావలసిన వరము కోరుకొనుము" అనెను. - అంత అగ్నిదేవుడు చేతులు జోడించి నమస్కరియా తన కోర్కెను తెలిపెను. అందులకు బదరీవాసుడు "ఈ బదరీ క్షేత్రమును దర్శించినంతనే సకల పాపములు పటాపంచలు అయినవి. నా అనుగ్రహము వలన నీకెన్నడూ పాపము అంటుకొనదు" అని వరమిచ్చెను. అప్పటినుండి అగ్నిభగవానుడు అన్ని దిక్కులకు వ్యాపించెను. కాని బదరీ క్షేత్రమునందు వేడినీటి రూపముగా వుండెను. భక్తులు ఈ అగ్నితీర్థములో స్నానమాడి పుణ్యాత్ములు అగుచున్నారు. ప్రాతఃకాలముననే లేచి, ఈ అగ్నితీర్థములో స్నానమాడి, బదరీవాసుని దర్శించుకొని పుణ్యమును సంపాదించుకొనెదరు. "వహ్నితీర్థసమం తీర్థాని నభూతం నభవిష్యంతి" ఈ వహ్ని తీర్థములో స్నానమాడి అక్కడ ఉన్న పండితులకు భోజనము పెట్టి స్వర్ణదానము, రత్నదానము, భూదానము, వస్త్రదానము, నానా విధములైన దానములు ఇచ్చిన వారి వంశములో దారిద్యము అనునది ఉండదు. "వహ్ని తీర్థము"నకు సమానమైన తీర్థము ఏదియును లేదు.