లక్ష్మీదేవి- కోజాగరీ పూర్ణిమ


లక్ష్మీదేవిప్ర తికరమైన కోజాగరీ పూర్ణిమ                   - ఐ.ఎల్.ఎన్. నరసింహారావు


ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష పూర్ణిమ - "కోజాగరీ పూర్ణిమ". సంపదల తల్లి, ధనానికి అధిదేవత... శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీ లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన నాడు శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ వ్రతం చేయాలని శాస్త్ర వచనం. ఈ వ్రతానికే "కోజాగరీ పూర్ణిమా వ్రతం" అనీ, "కోజాగరీ వ్రతం" అని పేర్లు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దారిద్యాలు తొలగిపోయి అషైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు, సంపదలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. పూర్వం వాలఖిల్య మహర్షి మిగతా మహర్షులకు ఈ వ్రతాన్ని గురించి వివరించినట్లు పురాణాల్లో చెప్పబడింది.


కోజాగరీ పూర్ణిమ నాడు లక్ష్మీదే పై త్యర్థం వ్రతం చేయడం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ప్రచారంలో ఉంది. పూర్వం మగధ దేశంలో "వలితుడు" అనే పండితుడు ఉండేవాడు. గొప్ప పండితుడు, భక్తి పరాయణుడు అయిన వలితుడు వేదవిద్యలపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండేవాడు. జీవనం అంతంత మటుకే సాగుతూ ఉండేది. వలితుడి భార్య "చండిని". పేరుకు తగ్గట్టుగానే గయ్యాళి స్వభావం కల వ్యక్తి. డబ్బు, ఆభరణాలంటే మోహం గల ఆమె తనకు ఆభరణాలు, వస్త్రాలు కొనివ్వ లేదని భర్తను నిందించడం ఆమె దినచర్యగా మారింది. దీనికి తోడు అన్ని విషయాల్లోనూ భర్తమాటలను ధిక్కరించడం, భర్త చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం చేస్తూ ఉండేది. ఒకవైపు పేదరికం, మరోవైపు భార్య గయ్యాళితనం వలితుడిని నిత్యం కృంగదీసేది. ఇలా ఉండగా ఒకనాడు వలితుడి వద్దకు అతని స్నేహితుడైన గణేశశర్మ వచ్చాడు. వలితుడి విషజ్ఞ వదనామ సి అందుకు అతని భార్య ప్రవర్తనే కారణమని తెలుసుకున్న గణేశ శర్మ పరిపరి విధాలుగ ఆలోచించి చివరకు "నీ భార్య చేత నీవు ఏ పని చేయించాలనుకుంటావో అందుకు వ్యతిరేకమైనది ఆమెకు చెప్పు. నీవు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆమె చేస్తుంది కనుక నీ పని నెరవేరుతుంది" అని సలహా ఇచ్చాడు. మిత్రుడు గణేశశర్మ ఇచ్చిన సలహా విని సంతోషించిన వలితుడు అదేవిధంగా చేయసాగాడు. కొంతకాలం గడిచింది. తన తండ్రి ఆభీకం వచ్చింది. ఆ సమయంలో - a "నా తండ్రి నాకు ఎటువంటి ఆస్తిపాస్తులు ఇవ్వలేదు. అటువంటి వ్యక్తికి ఆబ్దికం చేయడం దండగ. చేయవద్దు" అని భార్యతో అన్నాడు. భర్త మాటలను విన్నవలితుడి భార్య - "పితృదేవతలకు తప్పనిసరిగా ఆబ్దికం చేయాల్సిందే. లేదంటే పాపం వస్తుంది" అని చెప్పి పౌరోహితులను పిలిపించి ఆబ్లీకాన్ని నిర్వహింపచేసింది.


దీనితో సంతోషించిన వలితుడు ఆ ఆనందంలో భార్యతో మాట్లాడాల్సిన తీరును మర్చిపోయి - "పిండాలను నదిలో వదిలిపెట్టు" అని భార్యకు చెప్పాడు. భర్తను వ్యతిరేకించడమే నియమంగా పెట్టుకున్న ఆమె పిండాలను తీసుకువెళ్ళి మురికిగుంటలో పడవేసింది. దీనిని చూ సి వలితుడు భరించలేకపోయాడు. భార్యపట్ల, జీవితం పట్ల అసహ్యం కలిగి ఇల్లు వదిలి అడవులకు చేరాడు. అడవులలో పండ్లు ఫలాలు భుజిస్తూ ఒక నదీతీరంలో భగవంతుడిని స్మరిస్తూ గడపసాగాడు. ఇలా ఉండగా ఒక రోజు సాయంత్రం ముగ్గురు నాగకన్యలు వచ్చి నదిలో స్నానమాచరించి లక్ష్మీదేవిని పూజించారు. అనంతరం పాచికలు ఆడేందుకు సిద్ధమయ్యారు. అయితే పాచికలు ఆడేందుకు నాలుగో మనిషి అవసరం కనుక ఎవరైనా కనిపిస్తారేమోనని చుటూ సిన వారికి వలితుడు కనిపించడంతో ఆహ్వానించి పాచికలు ఆడమన్నారు. అందుకు వలితుడు పాచికలు ఆడడజూ దమనీ, ఆడడం తప్పనీ సమాధానం ఇచ్చాడు. అయితే ఈనాడు ఆశ్వయుజ పూర్ణిమ అనీ, పాచికలు తప్పనిసరిగా ఆడాలని నియమం ఉందని చెప్పి వలితుడిని - అంగీకరింపచేశారు. పాచికలు ఆడడం మొదలుపెట్టి - అర్థరాత్రి వరకూ ఆడుతూ ఉన్నారు. భూలోకంలో ఎవరు మేలుకున్నాయో సేందుకు భూలోకం చేరినశ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మిలు పాచికలు ఆడుతూ మేల్కొని ఉన్న నాగకన్యలను, వలితుడిచూ సి సంతోషించి వారు సర్వ సంపదలను ప్రసాదించారు. సంపదలతో ఇల్లు చేరిన భర్తచూ సి చండిక మతో ఆహ్వానించింది. భర్త ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన సమయంలో భర్తలేని లోటును గుర్తించిన ఆమె తిరిగి వచ్చిన భర్తను గౌరవందూ డసాగింది. వారిద్దరూ అన్యోన్యంగా జీవించడంతో పాటు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పూర్ణిమనాడు వ్రతం చేయసాగారు. అప్పటినుంచి ఈ వ్రతం అమల్లోకి వచ్చినట్లు కథనం.


ఆచరణా విధానం : 


కోజాగరీ పూర్ణిమ అంటే ఆశ్వయుజ పూర్ణిమ నాటి ముందురోజు రాత్రి ఉపవాసం ఉండి పవిత్రంగా గడపవలెను. పూర్ణిమనాడు తెల్లవారు ఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయవలెను. ఇంటిని శుభ్రపరచి ముగ్గులను తీర్చి దిద్దడంతో పాటు గడపలకు పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టవలెను. అనంతరం లక్ష్మీదేవిని పూజించవలెను. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయమయ్యాక శ్రీ లక్ష్మీదేవిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించవలెను.పాలు, పంచదార, ఏలకులపొడి, కుంకుమపువ్వులతో వండిన క్షీరాన్నమును ఇతర నివేదనలతో పాటు అమ్మవారికి సమర్పించవలెను. పూజానంతరం క్షీరాన్నమును ఆరుబయట వెన్నెలలో కొద్దిసేపు ఉంచవలెను. తర్వాత దానిని ప్రసాదంగా స్వీకరించడంతో పాటు ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవలెను. అనంతరం రాత్రి జాగరం చేయవలెను. ఈ సమయంలో పాచికలు, గవ్వలు ఆడుతూ గడపాలని శాస్త్ర వచనం. ఈవిధంగా ఆశ్వయుజ పూర్ణిమ నాటి రాత్రి సంపదల తల్లి అయిన శ్రీ లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ... జాగరణ చేస్తున్న వారిని గుర్తించి వారికి సర్వ సంపదలను, అశ్వర్యాలను ప్రసాదిస్తుందని కథనం. ఈ విధంగా పూర్ణిమనాడు వ్రతం చేయంతో పాటు మరునాడు తిరిగి పునఃపూజ చేసి వ్రతాన్ని ముగించవలెను.


"గంధద్వారం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ ఈశ్వరీగం సర్వభూతానామ్ | తామిహోపహ్వాయే శ్రియమ్"