గాయత్రీదేవి మంత్ర ఉపాసన


గాయత్రీదేవి మంత్ర ఉపాసన                                                                                                                        - కతా నిర్మల


బాలుడికి ఉపనయన సమయంలో తండ్రి గురువై తనయునికి గాండ్రీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ తర్వాత నుంచి ఆ బాలుడు గాంత్రీ మంత్రాన్ని జపించే సాధకుడుగా మారతాడు. రోజుకు మూడుసార్లు సంధ్యావందనం చేయాలి. అయితే ఇప్పటికాలంలో సమయం చాలక, తమ ఉద్యోగం కోసం ఎక్కువ సమయం కేటాయించే కొంతమంది పురుషులు రోజుకు ఒక్కసారి మాత్రమే సంధ్యావందనం చేస్తున్నారు. గాం. మాత మంత్రాన్ని పఠిస్తున్నారు. గాంత్రీ మంత్ర జప మహిమ ఎంతో అద్భుతమయినది, అమోఘమయినది. గాంత్రీ మంత్రాన్ని మంత్ర ఉపాసన నిష్ఠతో, నియమంతో, భక్తి శ్రద్ధలతో జపించినట్లయితే ఆ మాత అనుగ్రహానికి పాత్రులవుతారు.


దేవాలయాల్లో, తులసి మొక్క దగ్గర, పుణ్యక్షేత్రాల్లో, పుణ్యజీవనదీ తీరాల్లో, గాంత్రీ మంత్రాన్ని చిత్తశుద్ధితో పఠించేవారు శుభఫలితాన్ని పొందుతారని వేదపండితులు, ఆధ్యాత్మికులు, దేవీ ఉపాసకులు చెప్తున్నారు. గాంత్రీ దేవి శక్తినీ, మహత్యాన్నీ, ఆమెను పూజిస్తే, దేవి మంత్రాన్ని పఠిస్తే కలిగే ఫలితాన్ని గురించి వ్యాసమహర్షి జనమేజయునికి తెలిపినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది. గౌతమ మహర్షి గాంత్రీ మంత్రాన్ని అవిరామంగా కొన్ని సంవత్సరాలు జపించి, కరువు కాటకాలను, అనావృష్టిని తొలగించి, దేశాన్ని సుభిక్షంగా చేశాడని పురాణాలు వివరించాయి.


గాయత్రి అనే పదానికి అర్థం ప్రాణం రక్షించేది అని. ఆ కారణంగానే ఆ దేవిని ప్రాణాగ్ని అంటారు. గాంత్రీ మంత్ర ఉపాసన, ప్రాణశక్తిని ఆ ఉపాసకునికి అధికంగా ప్రసాదిస్తుంది. గాంత్రీ మంత్రాన్ని జపించేవారికి త్యాగం, మ, నిస్వార్ధగుణం, సంయమన శక్తి, మానసిక ధైర్యం అలవడుతాయి. మంచి చెడుల విచక్షణా జ్ఞానం ఏర్పడుతుంది. ఉపాసన అంటే భగవంతునికి చేరువగా ఉండటం అని అర్థం. మనస్సులోనూ, కన్నుల ఎదుట ఆ గాత్ర మాతను దర్శిస్తూ, గాంత్రీ మంత్రాన్ని పఠిస్తూ, భక్తి శ్రద్ధలతో పూజించేవారిని ఆ మాత కటాక్షిస్తుంది. ఉపాసకునికి, ఆ మాతకూ మధ్య సాన్నిహిత్యం , ఆత్మీయత, ఏకత్వం , భక్తిభావాన్ని కలుగజేసేదే ఉపాసన, మంత్రజప ఉచ్చారణ అని ఆధ్యాత్మికులు, గురువులు, పెద్దలు తెలియజేస్తున్నారు. మానవ జీవితంలో ఉపాసనకు మించిన మార్గం మరొకటి లేదు. ఉపాసకునికి యోగాన్ని, మార్గదర్శకాన్నీ ప్రచారం చేస్తుంది గాంథీ మాత. ఉపాసన అన్నది సాధారణ మనిషిలో దైవత్వాన్ని ప్రవేశపెడుతుంది.


గాత్రీ మంత్రానికి వేదోక్తమయిన సంప్రదాయం ప్రకారంగా కవచము, హృదయము, శక్తి, బీజము, కలశము అనేవి ఉన్నట్లుగా పురాణాలు వెల్లడించాయి. గాంత్రీ కవచధారణ చేసి, ఆ తర్వాత గాంత్రీ మంత్రాన్ని హృదయంలో నెలకొల్పాలి. గాంత్రీ మాతకు ఉండే అయిదు ముఖాలలో నాలుగు, నాలుగు దిక్కులనూ స్తూ ఉంటాయి. అయిదవ ముఖం ఊర్ధ్వ ముఖంగా ఉంటుంది. గాత్రీ దేవికి పది హస్తాలుంటాయి. కుడి, ఎడమ రెండు చేతుల్లో రెండు పద్మాలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన ఎనిమిది చేతులలో వరద, అభయ, అంకుశ, కళాది శక్తులను ధరించి ఉంటుంది. పరాశక్తి స్వరూపమే గాంత్రీ దేవి. గాంత్రీ దేవికి సంధ్యాదేవి అనే మరోపేరు కూడా ఉంది. గాంథీ మాత ఉదయం గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా మూడు రూపాల తేజస్సుతో భక్తుల మంత్ర జపాలను అందుకుంటోంది. నిత్యపూజా విధానంలో కూడా గాంత్రీ మంత్రం ఉంటుంది.


గాంత్రీ దేవికి భవాని అని మరో పేరు ఉంది. కొంతమంది స్త్రీలు మండలం రోజులు భవానీ దీక్షను చేస్తున్నారు. గాండ్రి మంత్రం సమస్త మంత్ర శాస్త్రములకు ఆధారం, ప్రాణం. వేదమాత, దేవమాత, విశ్వమాతగా గాంబ్రీ మహాశక్తి ద్వారా ఉద్భవించింది. గాంత్రీ మంత్రాన్ని జపించేవారికి బాధలు, సమస్యలు, కష్టాలు కలిగినప్పుడు వాటిని ఎదుర్కోగలిగిన శక్తిని ప్రసాదిస్తుంది. సద్భావనలను, మంచి ఆలోచనలను చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగించే శక్తి ఏర్పడుతుంది. సద్బుద్ధిని, ప్రశాంత జీవితాన్ని పొందగలుగుతారు. ఆధ్యాత్మిక పరిశోధకులు శోధించిన నిధే ఈ గాబ్రీ మహామంత్రంగా చెప్పబడింది. మనిషిలో అంతర్గత శక్తిని రేపించే మహామంత్రం ఇది. మానసిక వికారాలను, మనో వైకల్యాన్ని తొలగిస్తుంది. కర్తవ్య పాలనను బోధిస్తుంది. సిరిసంపదలు, సౌఖ్యం, మానసిక వికాసం, శారీరక ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది. గాంత్రీ మంత్రం. గాంత్రీ ఉపాసన విజయం వైపుకు నడిపిస్తుంది. గాత్రీ మంత్ర జపం యొక్క మహిమను అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతారు.