శ్రీవేంకటేశ శరణాగతి దీక్ష


శ్రీవేంకటేశ శరణాగతి దీక్ష


గత సంచిక తరువాయి


పూలరంగడు | అనంతార్యునికి అల్లుడు!


తిరుమలవాసాశ్రీ నివాసా! నీజ్ఞానంతో నిండి, నీ మతో పండిన వారిదే కదా బ్రతుకు! ఎంతటి దుష్టుడైననూ తెలిసియో, తెలియకయో పరిహాసమునకైననూ నీ నామమును పలికిన చాలును. వారి సమస్త పాపములను భస్మీపటలము చేసి స్వర్గ మోక్షములను అనుగ్రహించెడి కరుణామయుడవు నీవు.


వైకుంఠవాసా! అలనాడు నిన్ను శోధించు నిమిత్తమై భృగుడు నీకు చేసిన అపచారమునకు ఆగ్రహించక సాదరముగ తండ్రి బిడ్డను ఆదరించినట్లు ఋషిని లాలించితివి. చేష్టకు అలిగి వైకుంఠమును వీడిన లక్ష్మిని వెదకు నెపమున ఏడుకొండలకు చేరితివి కదా స్వామీ! నీపై ఆ బ్రహ్మ, శివులకు ఎంత మ! పుట్టలోన నిలచిన నీవు ఆకలిదప్పులతో ఉన్నావని భావించి వారిరువురూ నీకై ఆవు దూడలుగా మారి, రాజుకు అమ్ముడుబోయి, పాలధారలను మాత్రము నీకే అందించినారు కదా ! రాజుకు దక్కవలసిన పాలు పుట్టపాలవుతున్నాయని కినిసి గొడ్డలితో గోవును ఆదలించబూనిన గొల్లవాని దూకుడు పుట్టనుండి వెలికి వచ్చిన నిన్ను గాయపరచినది. ఎంత ఆశ్చర్యము! నినభూ చి, నీకు జరిగిన అపచారమునకు హడలి ప్రాణములు విడచినాడు ఆ గొల్లవాడు. ఆ జీవునకు సద్గతిని ప్రసాదించుటతో బాటుగా అతని సంతతి వారికి ఈ కలియుగాంతము వరకూ నీ తొలి దర్శనమను వరముగా అనుగ్రహించితివే. "సన్నిధిగొల్ల"గా నిలిచి, నీ సేవలలో తరించుచున్న ఆ గొల్లవాని సంతతిదే కదా భాగ్యాతి భాగ్యము. నిన్ను గాయపరిచినీ అభిమానమును పొందినవారి వరుసలో గొల్లవానికి తోడుగా నిలిచిన అనంతార్యుని సౌభాగ్యము మాత్రము సామాన్యమైనదా!


యామునాచార్యులవలె నీ సేవకై తన శిష్యులను ప్రోత్సహించుచున్న రామానుజుల మదికి సంతసము కలుగునట్లుగా అనంతార్యుడు గురుని అభిమతమును నెరవేర్చు దీక్షను ప్రకటించె. నీ కొండపై నున్న ఈతి బాధలకు వెఱచి, నీ సేవచేయ సాహసించని ఇతర శిష్యులకు సిగ్గు కలుగునట్లుగా రామానుజుల నుండి 'మగధీరుడ'న్న ప్రశంసలు పొంది భార్యా సమేతముగ నీ కొండచేరినాడా అనంతుడు. లెక్కకు మీరిన సంకటము లెదురైనా వెనుదీయక గురుభక్తితో నీ కైంకర్య నిష్ఠను ప్రకటించిన అనంతార్యునిపైన నీకును అపారమైన అభిమానమే. పుష్పప్రియుడవైన నీకై పూలవనమును పెంచ అనంతార్యుడు సరస్సు త్రవ్వగ సిద్దమాయె. ఇతరులెవ్వరిని శ్రమపెట్ట నిచ్చగించక భార్యతో కలిసి అతడు నీకై చెఱువు త్రవ్వుచుండుట నీకు మురిపమాయె! నిండు గర్భిణి తోడ మట్టి తట్టలను మోయించు అనంతార్యుని అధిక శ్రద్ధకు నీవు ఆనందించి బాలుడవై సాయము వెళ్ళితివి.


ఆందోళనతో నిన్ను అనుసరించిన అతనికి నీ బాలరూపము కనిపించదాయె. గుడిలోని నీ దివ్యమంగళ విగ్రహమ్మున రక్తధారలు గోచరించ అనంతార్యుడు ఆశ్చర్య చకితుడై గగ్గోలు పెట్టె. నిన్నాతడు అపరాధ క్షమాపణలు వేదూ గాయమైన నీ గడ్డమునకు పచ్చకర్పూరమదై... దోష భోగ్యుడవైన ఓ భోగమూర్తీ! అనంతార్యుని కైంకర్య శ్రద్ధాతిశయముపై నీకు గల మకు గుర్తుగా నీ వదన మండలమున ఏర్పడిన గాయమ్ముపై నిత్యము గుబాళించు పచ్చకర్పూరమద్దమని నీ అర్చక పరివారమును శాసించితివి. ఏ గునపముచే నీకు గాయమయ్యెనో ఆ గునపము భక్తులందరికీ దర్శనీయమగునట్లు నీ ఆలయముననే దానిని భద్రపరచితివి. కడు విచిత్రము కదా నీ లీలావిశేషము. నీ కొండపై రామానుజుని పేర పూలవనమును అనంతుడు కడు భక్తితో పెంచసాగె. నీకు తప్ప అన్యులకు భోగ్యమ్ము కారాదని అతడు శ్రద్ధతో ఆ తోటను కాచుచుండె. అనంతార్యుడి పట్టుదల నొకసారి రుచూ చియూ, తృప్తి చెందక నీవు, మా అమ్మ పద్మావతితో కలిసి మనుజరూపమున తోటలో విహరించసాగితివి. ఇచ్చవచ్చినట్లు రాత్రులందు తన తోటలో విహరించు మీ జంట భరతంబు పట్ట మిమ్ము పట్టబోయినాడా అనంతుడు. మునుపు పొందిన సత్కారమును గుర్తుంచుకొని నీవు మాయమైతివి కాని అమ్మ చిక్కిపోయె. పద్మావతిని పట్టి చెట్టుకు కట్టి నీ పతి చిరునామా చెప్పమని అనంతుడు నిర్బంధించసాగె. మరురోజు తాను బంధించినది అలమేలు మంగనని అర్చకులనంపి అనంతునకు తెలిపిన మాయావివి నీవు.


తప్పు తెలుసుకొని, చెంపలేసుకొని అమ్మవారిని పూలబుట్టలో కూర్చుండబెట్టి నీకు సమర్పించినాడా అనంతుడు. ఆవిధముగా అనంతార్యునికి కన్యాదాన ఫలమునిచ్చి అతనికి నీవు అల్లుడవైతివి. నీవాడిన ఈ వింత ఆటను మాకు గుర్తుచేయ ప్రతి ఏటా "పురిశైతోట ఉత్సవము"ను మా మేను పులకించునట్లుగా నీవు జరిపించుకొనుచున్నావు. యామునాచార్యుని పేరు మీదుగా అనంతార్యుడు ఆరంభించిన పుష్పకైంకర్యమును నేటికీ నిర్విఘ్నముగా నడిపించుకొనుచున్న నీ ఆశ్రిత వాత్సల్యమునకివే మా శతకోటి వందనములు. ఆ అనంతుని వలె నీ దయకు పాత్రులమగునట్లు మంచి దాసులుగ ఉండునట్లుగ మమ్ము ఆశీర్వదింపు.


క్షేత్రద్రష్ట! భాష్య కర్త!... శ్రీ వేంకటేశ శరణాగతి - 5 రామానుజ!


ఆనంద నిలయమున చిద్విలాసముగ నిలచి లోకములను పాలించుచున్నశ్రీ వేంకటేశా! నీకు శరణు. మా అంతరంగములలో నీ పట్ల అప్రమత్తతను, నీ పట్ల నిరంతర వినమ్రతను మాకు అనుగ్రహించుము. మా మాటలలో, మా చేతలలో, మా భావనలలో, మా నడవడిలో నీ సంకల్పమే నిలచునట్లు మమ్ము దీవించుము. ఓ దేవదేవా! మా అపరిపక్వతను రూపుమాపి పరిపూర్ణతను అనుగ్రహించుటకై మమ్ము నీ సేవకులుగా మార్చుకొనుము. . రేయనక పగలనక వేధించు వాంఛలతో నుగ్గు నుగ్గగుచున్న దీన జీవులము మేము. వంచనా వలయములకు చిక్కి వ్యధలతో పొర్లాడు మూస బతుకులు మావి. నీ పర, వ్యూహ, విభవ తత్త్వముల ఎఱుకయే మాకు లేదు. అంతర్యామివని అందరూ అందురేకాని అటకూడ నీవు మాకు అతిదూరుడవె. అర్చామూర్తివయిన నిన్ను కొలుచు క్రమమెట్టిదో తెలియజాలని అల్పబుద్దులు మావి. .


మా హీనతను గ్రహించి, నిన్ను పట్టెడి నేర్పు మాకు అలవరచుటకు గాను భక్తితత్త్వపు బాటను మాకు తెలిపెడి గురునిగా భువిపైన 'రామానుజు'ని అవతరింపచేసితివి నీవు. - నూట ఇరువది ఏండ్లు ఈ నేలపై చరియించి, విష్ణుతత్త్వపు ఘనతను వాడవాడల చాటిన పరమ దివ్యగురుడు మా రామానుజుండు. ఈ కలియుగంబున నీవె గతియని చాటిన ఘన గురుదైవమతడు. గతులు తప్పిన మా మతులకు నీ గురుతు తెలిపి, నిన్ను చేరెడిదారు సిని మార్గదర్శి. నిన్ను ప్రకటించు విషయమున ఆయన గురువులకే గురువు. - గుడి గోపురమునెక్కి ఎల్లవారలను తరియింప చేసెడి నీ దివ్యమంత్రమును వెదజల్లినట్టి సౌశీల్యమూర్తి. అస్పృశ్యులని జనులు ఈసడించిన వారిని ఓదార్చి నీ వొడికి చేర్చి, జీవులందరు నీ సంతానమేయని మతోడ చాటి చెప్పిన నీ వాత్సల్యపు మూటయతడు. భార్య అందము తప్ప మరి ఏమీ పట్టని ధనుర్గాసుకు నినమా పి, నీకు బానిసగ అతనిని మార్చిన నీ సౌందర్యపు నిలువుటద్దమె ఈ రామానుజుండు. - శ్రీ భాష్యకారుడై, విశిష్టాద్వైత తత్త్వమును ఇలను స్థిరముగ నిలిపిన ధీశాలి ఇతడు. నీదివ్యదేశముల అస్తవ్యస్తతలను చక్కపరచి, ఆగమోక్తముగా ఆరాధనలు సలుపు క్రమమును విశదపరచిన ఆచార్యశేఖరుడు. నారాయణుండవే నీవని, నీదు క్షేత్రపు మహిమను నిర్ద్వందముగ చాటి, వాదులాటకు దిగిన వ్యక్తుల గర్వము ఖర్వము చేసిన ఘన తపశ్శాలి. మోకాలితో నీ కొండనెగబ్రాకినట్టి భక్తితత్పరుండు. నీకు శంఖ, చక్ర ప్రదాత. వీర నరసింహ గజపతి నీకు అర్పించిన నాగాభరణమునకు జతగా వేరొకటి నీకు అర్పించినట్టి అలంకారమూర్తి. నీదు వక్షస్థలమున మా అమ్మను అమర్చి, నిన్ను 'అలమేలుమంగ తాళి మెడవాని'గా మార్చి శుక్రవారపు అభిషేక భాగ్యమును మాకబ్బచేసిన సౌభాగ్యశాలి. నీ కొండపైని పూలు నీ భోగమునకే తప్ప, నరులకనర్హంబను నియమమేర్పరచిన కైంకర్యశాలి. సద్భక్తుడైన నీలకంఠునిచే అర్చించబడిన నీ నారసింహమూర్తికి ఆరాధనా లోపము జరుగరాదని తలచి, నీ దివ్య ఆలయముననే, నీ దివ్య విమానమునకు అభిముఖ దృష్టి కలవానిగా ఆ మూర్తిని ప్రతిష్టించిన శాస్త్రవేత్త.


నీకు సంతసమగునట్లు తీరైన "ఊర్ధ్వపుండ్రముల"ను నీకు ధరింపచేసి, నీ శోభను ప్రకాశింపచేసిన ఉజ్జీవకరుడు. నీ దేవాలయమునకు తిన్నని మాడవీధుల నిర్మించి, వైభవముగ నీదు ఉత్సవములను నీ కొండపైననే నడిపించినట్టి నియమశీలి. బింబాధరుండను వైఖానస తంత్ర పారంగతుడైన భాగవతోత్తముని పంచ సంస్కారపరుడైన అర్చకునిగా నిలిపి, నీకు నిత్యారాధనను సక్రమముగా నిర్వర్తింపచేసిన యోగీశ్వరుండు. నీ కొండపైన మృతకళేబరములకు దహన సంస్కారాదులు జరగరాదను నియమంబు చేసిన పవిత్రమూర్తి. నీ కొండమీద విహరించు మృగ పక్ష్యాదులను సహితము నీ రూపముగ తలచి వాటిని హింసించరాదను కట్టుబాటును చేసిన మశీలి. దిగ్బలిని ఇచ్చు నీ దివ్యనగర వీధుల యందు (మాడవీధులు) పాదరక్షలు ధరింపరాదని, వాహనములు ఎక్కరాదని నియమంబు చేసిన యతిరాజు ఇతడు.


నీ పరత్వ దివ్యత్వమును సదా మాకు స్పురణకు తెచ్చుటకు నీ అనుమతితో రామానుజుండేర్పరచిన ఇట్టి నియమంబులు మాబోటి భక్తులకు దాట వీలుకానిది కదా! - క్రిమికంఠ చోళుని వలన భగ్నమైన నీ చిత్రకూట ఆలయమును పద్మపురియందుకడురమ్యముగ నిర్మింపచేసిన ధర్మరక్షకుండు రామానుజుండు. తన శిష్యుడైన యాదవరాజుచే "దివ్య ఆలయ సముదాయభరిత తిరుపతి క్షేత్రముగశ్రీ పద్మపురి"ని తీర్చి దిద్దించినట్టి రాజగురుడు. సప్తగిరీశుడైన శ్రీ నివాసునిగ, క్షీరాబ్ది శయనగోవిందునిగ తిరుమల తిరుపతి క్షేత్రములయందు నీ వైభవ ప్రకటనమునకై యతిరాజును నీవు అంగీకరించిన విధమునీ సేవక వ్రతదీక్ష కొక చక్కని నిదర్శనంబు. నియమ బాహుళ్యము తోడ నీ ఆలయ పాలనమును సుబద్దీకరించి, నీ శరణాగతికి మార్గమును మాకు తెలిపిన రామానుజాచార్యుని గురుత్వమును లోకమున చాటుటకు నీ దివ్యసన్నిధానమున విగ్రహరూపమున ఆచార్యునిశ్రీ మూర్తిని ప్రతిష్ఠింపచేసిన శ్రీ నివాసా! నీకు శరణు శరణు!! -