తప్పక తెలుసుకోవలసిన 78 విషయాలు


తప్పక తెలుసుకోవలసిన 78 విషయాలు                 - శ్రీశ్రీశ్రీ వైకుంఠ నారాయణులు


           పుణ్య పాప కర్మల వలన కలిగే భిన్న భిన్న భావాలు, JI.మరల మరల ఆయా కర్మలను వారు చేయడానికి దారి తీస్తూ ఉంటాయి. అందుచేతనే పుణ్యకర్మలను చేసేవారు వాటిని కొనసాగించడము, పాపకర్మలను చేసేవారు మరల మరల వాటియందు ఆసక్తితో ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇదొక 'చక్రం'లా ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఏదైనా ఒక బలమైన పుణ్యకర్మ వలన మాత్రమే ఈ చక్రాన్ని ఛేదించే అవకాశం ఉంటుంది.లేడీ మన్నారాయణ మూర్తి నిర్ణేతుకంగా సంకల్పించి ఛేదించాలంతే. .


             కట్టలు కట్టలుగా కట్టబడిన పుణ్య పాప కర్మలలో JL.చాలా బలమైనవి ఏకట్టలో ఉంటే ఆకట్ట ముందుగా అనుభవానికి వస్తుంది. అది అనుభవిస్తూ ఉండగానే ఇంకా తీవ్రమైన పుణ్య పాప కర్మలు చేస్తే, నిలవ ఉన్న కట్టలలోకి అవి ప్రవేశించకుండానే ప్రస్తుతము అనుభవిస్తున్న ప్రారబ్ద కర్మ అనబడే కట్టలోనికే నేరుగా అవి ప్రవేశించేస్తాయి. అంటే, ఈ జన్మలలోనే తీవ్ర పుణ్య, పాపముల అనుభవం జరిగిపోతుందన్నమాట. శాపములు, వరములు అంటే ఆ విధమైన అతి తీవ్ర పాపపుణ్యములే. వాటిని అనుభవించే విధానాన్ని, కాల వ్యవధిని కూడా ఆ శాపాలనీ వరాలనీ ఇచ్చే పుణ్యపురుషులే నిర్ణయిస్తారు. వారు చేసుకున్న పుణ్యమే వారికా అధికారాన్నిస్తుంది. వాక్శుద్ధినిస్తుంది. అందుకే పెద్దల, భక్తుల, స్వామీజీల వాక్కులకి చాలా శక్తి ఉంటుంది.


              పుణ్యములంటే శ్రీ మన్నారాయణ మూర్తికి JJ. ఇష్టమయినవి. పాపములంటే ఆయనకు ఇష్టము లేనివి కనుక మనము ప్రయత్నము చేసి పుణ్యములనే పెంచుకునే అవకాశం చాలా ఉన్నది. ఇతరులు దుఃఖిస్తూ ఉంటే డలేక, ఏదో ఒక విధంగా సహాయపడాలని ప్రయత్నించడం, కనీసం మనస్సులో అయినా అలా భావించడశ్రీ మన్నారాయణమూర్తికి చాలా ఇష్టమయిన పని. పుణ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఈ పద్దతి చాలాశ్రీ ష్ఠము. ఆయన సేవ చేయడం, చేయాలని కోరుకోవడం, ఆ భాగ్యం ఇమ్మని ప్రార్థించడం కూడ ఆయనకిష్టమైన పనులే. అయితే, అయనకి ఇష్టం లేని పనులని మాత్రం మానివేయక తప్పదు.


.             ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ విధంగా ప్రవర్తించవలసి Jt. ఉంటుందో ఒక ప్రణాళికశ్రీ మన్నారాయణమూర్తి చేత తయారయి ఉంటుంది. ఆ విధంగానే అందరి పుణ్య, పాప కర్మల అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఆక్సిడెంట్లుగా మనం చెప్పుకునేవన్నీ శ్రీ మన్నారాయణమూర్తి ప్రణాళికలో భాగములే అని మనం గమనించాలి. తన ప్రణాళిక ప్రకారం కొందరి జీవుల కర్మానుభావాల కోసం, మరికొందరు జీవులను ఉపయోగించుకుంటూ ఉంటాడు.


..        ఏదైనా ఒక భవనం నిర్మించాలని ఒక వ్యక్తి J. సంకల్పించి, ఏ పనివారి చేత ఆ పనిని పూర్తి చేయిస్తాడో, ఆ పనివారిని 'సాక్షాత్ కర్తలు' అంటారు. సంకల్పించిన ఆ యజమానిని 'ప్రాయోజక కర్త' అంటారు. సాక్షాత్ కర్తలు, యజమాని చెప్పినట్లు పొల్లుపోకుండా చేస్తే, తత్సంబంధమైన పుణ్య పాపములు ప్రాయోజక కర్తకే చెందుతాయి. కాని సాక్షాత్ కర్తలకు చెందవు. అయితే, ఆ పని ప్రారంభం అవడానికి ముందు సాక్షాత్ కర్తలు తమ విచక్షణా జ్ఞానాన్ని ఏవిధంగా వినియోగిస్తారో దానిని అనుసరించి కొంత కొంత పుణ్య పాపములు వారికి కూడా చెందుతాయి. తప్పుడు పనులని తెలిసి తెలిసి వాటిని చేయడానికి అంగీకరించకూడదు.