కార్తీకం శుభప్రదం 


కార్తీకం శుభప్రదం                                                        - డా|| మరుదాడు అహల్యాదేవి


న కార్తీక సమో మాసః న దేవః కేశవాత్పరమ్ | న చ వేద సమం శాస్త్రం, న తీర్థం గంగాయాన్సమమ్ ||


"కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణుదేవునితో సమానమైన దేవుడు లేడు. గంగతో సమానమైన తీర్థము లేదు" అని చెప్పబడింది. మాసాలన్నిటిలో మహిమాన్వితమైనది కార్తీకమాసం. హరిహరులిద్దరికీ ఎంతో ప్రీ తికరమైనది ఈ మాసం. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతలు, దానాలు అన్నీ ఇతర మాసాలలో కన్నా ఎంతో ఎక్కువ పుణ్యఫలాన్ని ఇస్తాయి. చేసే ఏ కొద్ది పుణ్యకార్యమైనా, అది కూడా తెలియకుండా, యాదృచ్ఛికంగా చేసినా ఎంతో పుణ్యాన్ని ప్రసాదించే మహిమ ఈ మాసానికి ఉన్నది. అందుకే సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదించేదిగాను, పాపాలను పరిహరించి పునీతులను కావించేదిగాను కార్తీకమాసాన్ని గూర్చి పురాణాలన్నిటిలో చెప్పబడింది. ఈ మాసం మహిమ గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లు లింగ, స్కాందపురాణాలలో పేర్కొనబడింది. కార్తీకమాసంలో ముఖ్యంగా చేయవలసినవి నదీస్నానాలు, దానాలు, వ్రతాలు, భగవన్నామ స్మరణము. ఈ కార్యాలు మానవులను సన్మార్గ వర్తనులుగాను, సత్కర్మాచార పరాయణులుగాను తీర్చి దిద్దుతాయి. కార్తీకమాసంలో సూర్యభగవానుడు తులారాశిలో సంచరించే కాలంలో అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసానికి అధిదైవం కార్తీక దామోదరుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు.శ్రీ మహావిష్ణువును ఈ నామంతో పూజించడం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.


కార్తీకమాసంలో పాటించాల్సిన విధులు


1. నదీస్నానాలు : ఈ మాసంలో గంగ, గోదావరి, కావేరి మొదలైన నదులలో స్నానం ఆచరించి ఆ నదీతీరాలలో వెలసి ఉండే పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. నదీస్నానం ఆచరించి ఉదయిస్తున్న సూర్యునికి అభిముఖంగా నిలిచి అర్య ప్రదానం కావించాలి. నదీతీరాన కూర్చుని గాంత్రీ మంత్రో పాసనతో సంధ్యావందనం కావించాలి. తరువాత ఆలయంలో భగవద్దర్శనం చేసుకుని పుష్పాలు, తులసీదళాలు, బిల్వపత్రాలు సేకరించుకుని ఇంటికి వచ్చి పూజా మందిరంలో నిత్యపూజలు నిర్వర్తించుకోవాలి. జీవనదులలో కార్తీక మాసంలో శరీర దారుఢ్యాన్ని మెరుగుపరిచే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కారణంగా కార్తీకమాసంలో గంగా స్నానం ఆచరించడానికి భక్తులు తరలి వెళ్తుంటారు. ఈ మాసంలో కొన్ని కనీస నియమాలు పాటించవలసి ఉంటుంది. అవి - 1. శాకాహారం భుజించాలి. మాంసాహారం తినకూడదు.


1. శాకాహారం భుజించాలి. మాంసాహారం తినకూడదు. 2. చల్లటి నీటి స్నానం (ముఖ్యంగా నదీజలాల్లో) ఆచరించటం ఉత్తమం. నదులు సమీపంలో లేని పక్షంలో బావినీళ్ళు, అవీ లేకపోతే ఇంటిలో వాడే నీళ్ళను జీవనదుల నామాలను స్మరిస్తూ స్నానం చేయాలి. "గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిన్ కురు" అనే శ్లోకాన్ని మనస్సులో మననం చేస్తూ స్నానం చేయాలి. , 3. వ్రత దీక్షలో ఉన్నవారు బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై నిద్రించాలి. ఒక పూట భుజించాలి. కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని మితభాషణం కావించాలి. 4. గుడులకు వెళ్ళడం, దానాలు, ధర్మాలు చేయడం ఆనందాన్ని కలిగిస్తాయి. చెడు ఆలోచనలను మనస్సులోకి రాకుండా 2. వ్రతాలు : కార్తీకమాసంలో కావించే వ్రతాలలో సోమవార వ్రతాలు, సత్యనారాయణస్వామి వ్రతం ముఖ్యమైనవి. నాగారాధన (నాగుల చవితి) కూడా ఈ మాసంలో జరపడం విశేషం. చేసాయి.


1. సో మవారవ్రతం ముందు రాత్రి సంకల్పం చేసుకుని ఉపవాస దీక్షను పాటిస్తూ సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు, స్నానం పూర్తి చేసుకుని శివలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం, పూజ జరపాలి. బిల్వపత్రాలతో పూజించడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. సాయంత్రం శివాలయంలో దీపాలను వెలిగించి దీపదానం కావించి, నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. పాలు, పండ్లు తీసుకుని రాత్రంతా జాగరణ చేస్తూ శివపురాణం, శివలీలలు పారాయణ కావించాలి. మర్నాడు యథాశక్తి అన్నదానం జరిపించాలి. . కార్తీకమాసంలో వచ్చే నాలుగు సోమవారాలు గాని, కనీసం ఒక్క సోమవారం గాని ఈ వ్రతాన్ని ఆచరించడం చేత పరమేశ్వరానుగ్రహంతో సర్వశుభాలు సంప్రాప్తమవుతయి. ఈ వ్రతం ఆచరించిన స్త్రీలంతా అఖండ సౌభాగ్యం, సత్సంతాన ప్రాప్తి లభిస్తాయి. కార్తీక మాసంలో ఈ వ్రతం ఆచరించినవారు తమ పుణ్యఫలాన్ని ఇతరులకు ధారపోయడం వల్ల వాళ్ళ పాపాలు పరిహారమై సద్గతులు పొందుతారు. ఇందుకు ఉదాహరణగా మానవ జన్మలో అనేక పాపాలు ఆచరించి నరక బాధలనుభవించి, నీచజన్మలెత్తుతూ ఊరకుక్కగా జన్మించిన స్త్రీ సోమవార వ్రతదీక్షాపరుడైన బ్రాహ్మణుడు ఆ వ్రతఫలాన్నికుక్కకు ధారపోయడంతో ఉత్తమగతి పొందుతుంది. అదేవిధంగా పాపకర్మలు చేసి బ్రహ్మరాక్షసుడిగా జీవిస్తున్న నలుగురు విప్రులు సోమవార వ్రత ఫలాన్ని మరొక ఉత్తముడు ధారపోయడం వల్ల సద్గతులు పొందుతారు. ఈ విధంగా కార్తీకమాసంలో ఆచరించే సోమవార వ్రత మహాత్మ్యం ఎంతటి మహిమాన్వితమైనదో గ్రహించవచ్చును.


2. కార్తీక దర వ్రతం - శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతం గూర్చి, దాని మహత్వం గురించి అందరూ ఎరిగినదే శ్రీ మహావిష్ణువు స్వయంగా తెలిపిన ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో ఏకాదశి, పౌర్ణమి తిథులలో ఆచరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. అనంతమైన పుణ్యం సంప్రాప్తమవుతుంది. మహావిష్ణువుకు ఇష్టమైన తులసీదళాల మాలలు సమర్పించి విధివిధానంగా ఈ వ్రతాన్ని ఆచరించే వారి ఇంట మహాలక్ష్మి స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది. విశేష ఫలప్రదమైన ఈ వ్రతాన్ని సామూహికంగా గుడులలో ఆచరించడం వల్ల భక్తులలో భగవద్భక్తి దృఢమౌతుంది. సామాజిక జీవితం వైషమ్యాలు లేకుండా సజావుగా సాగుతుంది.


3. నాగచతుర్డీ వ్రతం కార్తీక మాసం చతుర్థి నాడు నాగారాధన కావించడం వల్ల సర్పభయం, దోషాలు నివారింపబడతాయి. సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం సిద్ధిస్తుంది. పుట్టలలో పాలు పోసి, నాగదేవతలను పూజించి, చలిమిడి నివేదన చేసి, ఆ రోజంతా ఉపవాస దీక్ష వహించి మర్నాడు బ్రాహ్మణునికి దానాలు సమర్పించాలి. బంధుమిత్రులతో కలిసి భుజించాలి. ఈ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వరుని క్షేత్రదర్శనం విశేష ఫలప్రదం.


కార్తీక మాసలో చేయవలసిన దానాలు


1. దీపదానం దీపదానం ఎంతో పుణ్యప్రదమైనది. కంచు లేక మట్టి ప్రమిదలలో నెయ్యి పోసి, శుభ్రమైన పత్తితో వత్తిని చేసి దీపాన్ని వెలిగించాలి. దక్షిణ, తాంబూలాలతో సద్భాహ్మణునికి దానం చేయాలి. దానం చేసేటప్పుడు - 6 "సర్వపాపహరం దీపం, సర్వసంపత్తి భావహం దీపదానం ప్రదాస్వామి, శాంతిరస్తు సదామమ" అనే శ్లోకాన్ని చదువుతూ సమర్పించాలి. కార్తీకమాసంలో చేసే దీపదానం వల్ల ఇహపర సౌఖ్యాలు, సర్వశుభాలు, మనశ్శాంతి లభిస్తాయి. అనంతమైన పుణ్యం లభ్యమౌతుంది. గుడులలో ప్రమిదలలో దీపాలు వెలిగించి వరుసలుగా పెట్టి వాటిని పూజించటం శుభప్రదం. కొడిగడుతున్న దీపాలను ఎగదోయడం కూడా పుణ్యప్రదం. . కార్తీక పురాణంలో తమకే తెలియకుండా కామవాంఛతో గుడిలో చేరిన పాపాత్ములైన స్త్రీ పురుషులు వెలుతురు కోసం దీపాన్ని వెలిగించినంత మాత్రాన వారి పాపాలు పరిహారమై సద్దతులు పొందిన కథ చెప్పబడింది. ఆ రోజు సోమవారం కావడం, దీపం ఉంచిన తావు శివలింగం సమీపం కావడం కాకతాళీయమే అయినా వాళ్ళకు అనంతమైన పుణ్యం లభించింది. అదేవిధంగా ఆరిపోతున్న దీపాన్ని ఎగద్రోసిన విలువకు మానవజన్మ లభిస్తుంది. ఈ విధంగా కార్తీక మాసంలో దీపారాధన, దీపదాన మహత్యాల వలన కలిగే శుభ ఫలాలు లెక్కించడానికి శక్యం కావు. ఎక్కువ ఖర్చు లేకుండానే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే దీపదానం సర్వులూ ఆచరించి పునీతులు కావడానికి కార్తీకమాసంలో మాత్రమే సాధ్యమౌతుంది.


2. సాలగ్రామ దానం విష్ణు లేక శివ సాలగ్రామాలను సద్భాహ్మణునికి దానం చేయడం శుభప్రదం. శక్తి ఉండి, పెద్దలు చెప్పినా వినకుండా సాలగ్రామ దానాన్ని నిర్లక్ష్యం చేసి, చేయని కారణంగా ధనికుడైన వైశ్యుడొకడు నరకప్రాప్తి పొంది చివరకు బాల్య వితంతువుగా జన్మించి కాలం గడుపుతూ ఉత్తమమైన బ్రాహ్మణుడు సాలగ్రామ శిలాదానం చేయడం వల్ల పాప విముక్తురాలౌతుంది.


3. సాలంకృత కన్యాదానం - కుమార్తెను సాలంకృతంగా కన్యాదానం కార్తీకమాసంలో కావించే తల్లితండ్రులు ధన్యులు. వారికి అనంతమైన పుణ్యం లభిస్తుంది. అలాకాక కన్యను అమ్ముకోవడం మహాపాపం. ధనం కోసం ఆ విధంగా చేసి తనతోపాటు తన పూర్వీకులకు కూడా నరకప్రాప్తి కలిగించిన సువీరుడనే రాజు వృత్తాంతం కార్తీకపురాణంలో తెలుపబడింది. బీద బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనం కావించడం, పురాణ కథలను పఠించి ఇతరులకు చెప్పడం, విద్యాదానం కావించడం వంటి సత్కర్మలు చేయాలి. అన్నదానం, గోదానం కావించడం అత్యంత పుణ్యప్రదమైన కార్యాలు. గోదానంలో ఉభయముఖ గోదానం (అప్పుడే ప్రసవిస్తున్న ఆవుని) మరింత పుణ్యప్రదం. వృషభాన్ని పూజించి గోవుతో కలపడం కూడా పుణ్యప్రదంగా భావించబడుతోంది. అలాగే ఉసిరికాయల దానం చేయడం మహాపుణ్యప్రదం.


తులసీ కళ్యాణం కార్తీకమాసంలో తులసీ కళ్యాణం జరపడం విశేష పుణ్యప్రదం. కార్తీక మాసంలో శుక్ల ద్వాదశినాడు తులసీ కళ్యాణం జరపడం శుభప్రదం. తులసీదేవి జన్మించినది కార్తీక పౌర్ణమినాడు. లక్ష్మీదేవి అంశ అయిన తులసిమొక్క వివాహం మహావిష్ణు స్వరూపమైన అశ్వత్థ వృక్షంతో జరపడం సంప్రదాయం (ఉసిరికొమ్మ, చెరుకుగడలను కూడా అశ్వత వృక్షానికి మారుగా వాడుతుంటారు కొన్ని ప్రాంతాలలో). తులసీ కళ్యాణం కన్నులారూ సి-4 "బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ పుష్పపారానందినీచ తులసీ కృష్ణజీవన్" అనే నామాష్టకంతో పూజిస్తే తులసీదేవి " అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ప్రమిదలలో దీపం ఉంచడం ఎంతో శుభప్రదం. -


మనో జనాలు కార్తీకమాసంలో కుటుంబ సమేతంగా దగ్గరలో ఉన్న వన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సత్యనారాయణ స్వామి పటానికి పూజ చేసి, ప్రసాదాలు అందరూ కలిసి తినడం, ఎంతో ఉల్లాసాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఉసిరిక లేక మామిడి తోపులు వనభోజనాలకు ఉత్తమమైనవి. ఉసిరిక ఫలాలు దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి దానం చేయడం వల్ల సర్వసుఖాలు, శుభాలు సంప్రాప్తమవుతాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కార్తీకమాసం మాహాత్మ్యం చెప్పశక్యం కానిది. కార్తీకమాసంలో తెలిసి, తెలియక చేసిన సత్కార్యాలు శుభఫలాలను అనుగ్రహిస్తాయి.సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదించే కార్తీకమాసంలో సద్భావనతో భక్తిమార్గంలో నడిచి అనంతమైన పుణ్యాన్ని ఆర్జించుకోవడానికి సర్వులూ ప్రయత్నించాలి.