కృష్ణావతారం పరిసమాపి 0
మోక్షదాయకం శ్రీ మద్భాగవతం
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్ దేవీం సరస్వతీం వ్యాస తతో జయ ముదీరయేత్ |
బలరాముడు సముద్రతీరంలోనే యోగం పట్టాడు. తన భౌతిక దేహాన్ని త్యజించాడు. ఎప్పుడయితే బలరాముని భౌతికదేహం చలనం లేకుండా పడిపోయిందో ఇక అప్పుడు తాను కూడా అవతారాన్ని చాలించాలనుకున్నాడు కృష్ణుడు. మెల్లగా నడచివచ్చి, ఓ రావిచెట్టు కింద కుడితొడపై ఎడమకాలు పెట్టుకుని పవళించాడు. రోకలిని పొడిచేసి సముద్రంలో కలిపినప్పుడు ఆఖర్లో చిన్నముక్క మిగిలిపోయింది. పొడి చేసేందుకు అందలేదది. దానిని సముద్రంలోకి విసిరేశారు యాదవులు. నీళ్ళలో వచ్చిపడిన ఆ ముసలం ముక్కను ఓ చేప ఆహారం అనుకుని మింగింది. ఆ చేప బోయవాని వలలో చిక్కింది. బోయ కోసినప్పుడు ఆ చేప కడుపులో ఉన్న ఇనుప ముక్కచూ సి సూదిగా ఉండడంతో బాణానికి పనికివస్తుందని దాచాడు దాన్ని. తర్వాత బాణానికి ములికిని చేశాడు. ఇప్పుడు ఆ బాణాన్ని పట్టుకుని వేటకు వచ్చాడు ఆ బోయ. రావిచెట్టుకింద అరుణారుణ కాంతులతో పద్మచిహ్నాలతో ఉన్న కృష్ణుని పాదాన్ని ఏదోమృగముఖం అని తలచాడు. బాణాన్ని గచరి సివదిలాడు. వచ్చి కృష్ణుని పాదానికి గుచ్చుకుంది. పరుగున వచ్చు. శాడు బోయా స్తే అక్కడ ఉన్నది మృగం కాదు. సాక్షాతశ్రీ కృష్ణుడు. చేసిన అపరాధానికి చేతులు జోడించి నమస్కరించాడు. కన్నీరు పెట్టుకుని క్షమించమన్నాడు. ఇందులో నీ తప్పు ఎంతమాత్రం లేదు. నేను ఏది కావాలనుకున్నానో అదే జరిగింది. నీవు నిమిత్తమాత్రుడవు అన్నాడు కృష్ణుడు. బోయని ఆశీర్వదించి అతనికి స్వర్గప్రాప్తి అనుగ్రహించాడు. ఓ బోయ బాణంతో కృష్ణుడు ఆఖరికి అవతారాన్ని చాలించాడు. ఈ బోయ గతజన్మలో వాలి అని, కాదు వాలి పుత్రుడు అంగదుడు అని కొందరు అంటారు. రామావతారంలో రాముడువాలిని చెట్టుచాటుగా కొట్టి చంపాడు. దాని ఫలితమే కృష్ణావతారంలో అనుభవించాడంటారు. బాణం దెబ్బకి చనిపోయిన కృష్ణుని దేహం కొంతకాలానికి కొయ్యగా మారిపోయిందని, అదే ఈనాటి పుణ్యక్షేత్రం పూరీలోని జగన్నాథుని విగ్రహమని మరి కొందరు అంటారు. కొన్ని గ్రంథాలు ఈ మాటల్ని సమర్థిస్తున్నాయి కూడా. ఇవన్నీ అలా ఉంచితే....
ప్రభాస తీర్థానికి కృష్ణుణ్ణి రథం మీద తీసుకువచ్చిన రథసారథి దారుకుడు, కృష్ణుని కోసం వెదుకుతూ వచ్చాడు. గాయాలపాలై రావిచెట్టు కింద ఉన్న కృష్ణుడ్డూ శాడు. కన్నీరు మున్నీరుగా విలపించాడు. అతన్ని ఓదార్చాడు కృష్ణుడు. తన నిర్యాణవార్త ద్వారకలో అందరికీ చెప్పమన్నాడు. స్త్రీ, బాల, వృద్దులందరినీ అర్జునుణ్ణి ఆశ్రయించి, ఇంద్రప్రస్థంలో జీవించమన్నాడు. ఇది తన మాటగా చెప్పమన్నాడు కృష్ణుడు. సరేనన్నాడు దారుకుడు. అతనూ స్తుండగానే కృష్ణునిలోని దివ్యతేజస్సు ఆకాశానికి ఎగిసిపోయింది. ఆయన దివ్యరథమూ, గుర్రాలూ, గరుడధ్వజం, శంఖ చక్రాది ఆయధాలూ - అన్నీ కృష్ణతేజస్సును అనుసరించి వెళ్ళిపోయాయి. కృష్ణావతారం ముగిసింది.