.శ్రీ వేంకటేశ్వర స్తుతి


పరమపురుషా! నే దుర్జనుండనని ఎవ్వరు మరుగుపడ విన్నపము సేయుదురో యిప్పుడే నా నేరములు నేన చెప్పుకొని మండాడుకొని యెద నది యెట్లంటేని నేజేసిన పాపములు ననుం జుట్టుకొనియేని నీ నామోచ్చారణంబు సేసి తప్పించుకొని యెద నీ చేతం గల్పితంబులైన విషయంబులు బాలింపవచ్చెనేని నా మదిలో నీ పాదంబులు దలంచి మఱుంగున దాగెదను పురాకృత కర్మంబులనుభవింపవలయునని పట్టుకొనియేని నీ వాడనని బలమింద్రోసెదను యమకింకరులు నా తెరువు వచ్చిరేని నా భుజంబులనీ శంఖ చక్రలాంఛనంబుడూ పివెఱపించెదను సంసార పాశంబులు నన్ను దగిలినేని నీ కథలు విని పరాకు సేసుకొని యెదను నీ మాయనన్ను ముంచుకొనెనేని నీ దాసులకుం జెప్పి నీకు విన్నపంబు సేయించెద నివియపరాధంబులని చిత్తంబునం చిట్లకు (జిట్టరు?శ్రీ వేంకటేశ్వరా ! మటియును..


తాత్పర్యం : పరమపురుషా! నేను చెడ్డవాణ్ణని, ఎవరైనా చాటుగా నీకు తెలియజేస్తారో ఏమో! ఇప్పుడే నేను నా దోషాలను నీకు చెప్పి నిన్ను వేడుకుంటాను. నేను చేసిన పాపాలు నన్ను చుట్టుకున్నట్లయితే నీ నామాన్ని జపించి పాపాల నుండి తప్పించుకుంటాను. నీవు నన్ను రక్షించే ఏర్పాట్లను చేస్తే, శ్రీ పాదాలకు నాలోనేనమస్కరించి శరణు పొందుతాను. పూర్వజన్మలో చేసిన కర్మలు - అంటే సంచిత కర్మలు - నన్ను పట్టుకున్నట్లయితే నీ భక్తుడను అని చెప్పి తోసేస్తాను. యమభటులు నా దగ్గరికి వచ్చినట్లయితే నా శంఖ చక్ర ముద్రలమా పి భయపెట్టుతాను. సంసార బంధాలు నన్ను అంటుకున్నట్లయితే - నీ కథలు విని, వాటిని మరచిపోతాను. నీ మాయ నన్ను ముంచేసినట్లయితే నీ దాసులకు నా స్థితిని చెప్పి, వారిచే నీకు విజ్ఞప్తి చేయిస్తానుశ్రీ వేంకటేశ్వరా ! ఇవన్నీ అపరాధాలని మనస్సులో కోపించకు


                                                                                    వ్యాఖ్యానం: డా|| తిరుమశ్రీ నివాసాచార్య