శ్రీ వేంకటేశుని నామం 

శ్రీ వేంకటేశుని నామం                                                  |||| || డా||  పేకేటి గీత ||| ||||



                "ఔషధం చింతయేద్విష్ణుభొ జనేచ జనార్ధనయే శయనే పద్మనాభంచ వివాహేచ ప్రజాపతిం || యుద్దే చక్రధరం దేవం, ప్రవాసీమ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే, శ్రీధర ప్రియసx || దుస్స్వప్నే స్మరగోవిందం, సంకటే మధుసూదనం కాననే నారసింహంచ, పావకీ జలశాయినం || జలమధ్యే వరాహంచ, పర్వతే రఘునందనం గమనే వామనం చైవ, సర్వకాలేషు మాధవం || షో డశైతాని నామాని, ప్రాతరుత్థాయ యః పత్ సర్వపాపవినిర్ముక్తో, విల్ల. కేమహీయతే ||


                       సర్పాల్లో ఆదిశేషుడు, పక్షుల్లో గరుత్మంతుడు, దేవతల్లో విష్ణుమూర్తి, వర్ణాలలో బ్రాహ్మణుని మాదిరి పర్వతాలలో శ్రీ వేంకటాద్రి శ్రీ ష్ఠమైనదని శాస్త్ర వచనం. శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని కన్నా, విన్నా సప్త పాపముల నుండి విముక్తులౌతారువిష్ణు సాయుజ్యాన్ని పొందుతారు. కృతయుగంలో పది సంవత్సరాలు పుణ్యం చేస్తేతే తాయుగంలో ఆ పుణ్యాన్ని మానవుడు ఒక్క సంవత్సరంలోనే పొందుతాడు. ద్వాపర యుగంలో చేసిన పుణ్యం దానికి కోటిరెట్లు అధికంగాశ్రీ వేంకటేశుని దర్శించడం వల్ల పొందగల్గుతారు. ఆ స్వామిలో దేవతలు, మహరులు, సకల పుణ్యాత్ములూ ఉన్నారు. ఎన్ని దానధర్మములు చేసినా, జప తపాలు చేసినా, యజ్ఞ యాగాలు చేసినా, దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరుని నామాన్ని స్మరించని వారి జన్మ వ్యర్థమే. కళ్ళున్న గ్రుడ్డివారే. కాశీదర్శనం కన్నా, ప్రయాగలో స్నానం కన్నాశ్రీ నివాసుని దర్శనం మాత్రానే కోటిరెట్లు పుణ్యాన్ని గడిస్తారని సకల వేదాలూ ఘోషిస్తున్నాయి. చైత్రమాసముతో సమానమైన మాసముకలియుగంతో సమానమైన యుగము, వేదముతో తుల్యమైన శాస్త్రము, గంగతో సమానమైన తీర్థము, జలదానంతో సమానమైన దానము, కృషితో సమానమైన ధర్మము, ధర్మానికి సమానమైన స్నేహితుడు, సత్యవాక్యముతో సమానమైన కీర్తి, వేంకటాద్రితో సమానమైన స్థానము లోకంలో లేనేలేవు. 


శ్రీ వేంకటపతి అతి సుందరుడు, సహృదయుడు. గోవిందా! అంటే ఓయ్ అని పలికే స్వామి. అందుకే మన వేంకటాద్రి క్షేత్రం, అమృతమయమైన క్షేత్రం. పుణ్యం చేసిన కోటిరెట్లు. పాపం చేసినా అంతే. విష్ణుశక్తి దీపించే పుణ్యశైలం, ఆ దివ్య మంగళరూపం, హరించును పాతకాలు. భక్తజనోద్దరణకై వేంకటపతి అయినాడు. దివినుండి భువికి దిగివచ్చిన విభుడు. దర్శనమాత్రాన్నే దూరమగు సంకటములు. దీనజనోద్దరణకై దైవమై వెలశాడు ఆ దేవదేవుడు. నిన్నటి రోజు చరిత్ర, రేపటి రోజు ఒక మిస్టరీ, ఈరోజు ఒక వరం. వర్తమానకాలం చాలా ముఖ్యమైనది. ఏదైనా సాధించాలంటే ఇప్పుడే, ఇక్కడే ప్రయత్నించాలి. కాలం బంగారం లాంటిది. అది మానవుని జీవితంలో ముడిపడి ఉంది. మెలకువగా నున్న మానవుడు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనలో ప్రతి ఒక్కరికీ భగవంతుడిచ్చిన ఆ ముఖ్య కాలం ఉంది. వృధా చేసిన కాలం మళ్ళీ రాదు. కాలాన్ని స్వామి చింతనలో గడిపే వారి అదృష్టమే అదృష్టం. సమస్త విద్యలలో కెల్ల వేదవిద్య, మంత్రాలలో ఓంకారంగా, పర్వతాల్లో శ్రీ వేంకటాచలం ప్రశస్తమైనది. ఎంతో మహిమాన్వితమైనది. ఈ వైకుంఠనాథుని సేవించి, తరించడానికి మాకు శరీరాలు లేవే అంటూ దిగులు పడుతుంటారట దేవతలు. అందుకే మానవజన్మ ఎంతో ఉత్కృష్టమైనది. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం భగవంతుని గూర్చి తెల్సుకొని, పూజించడమే. మానవుడు ఎండమావుల వంటి ఈ మిధ్యా సంపదలన్నీ నిజములేయని భ్రమించి, రోగభూయిష్టమైన శరీరము పట్ల విరక్తుడు గాక, కామాగ్నిలో ఎల్లప్పుడూ దహించుకునిపోతున్నాడు. ఇంద్రియ సుఖములోనే మునిగిపోతూ, ఈ సంసార సాగరాన్ని ఈదలేక, దాటలేక బాధపడుతున్నాడు. దేవాదిదేవా! కోరికలతోను, హర్షశోకములతోడను, కలుషితమైన చిత్తము యందు ధ్యానమవదు. షడ్రుచులు తినమరిగిన నాలుక, నీ యొక్క దివ్య లీలా వర్ణములను చేయుటకు ఇచ్చగించదు. నీ యొక్క దివ్య మోహనాకృతి యందు దృష్టి నిలుపదు. నీ మధుర గానములను, గాథలను వినగోరదు. దుర్గంధములకు అలవాటుపడిన నాసికలు విష్ణుపూజల సుగంధములతో తృప్తి చెందునా? ఈ విధంగా ఇంద్రియముల చేత చిక్కుపడి, ఇతర ప్రాణుల యందు స్వ, పర భేదములచూ చూ జనన మరణ చక్రబందీలై, సంసార వైతరణీ పంకిలములో మునిగియున్న లోకాలను ఉద్దరించుట, సృష్టి, స్థితి, లయ కారకుడైన నీకే తగియున్నది. కర్తవ్యముతో నీ సేవకులమైన మా యందు ప్రియభక్తులను ఉద్దరించుము.


సర్వేశ్వరా! నీ గుణ స్తోత్రములను చేయలేని మూఢులముమమ్ములను ఆశీర్వదించి, నీ చళ్లు పులు మాపై ప్రసరింపచేసిమమ్ముధర్మమార్గములో నడిపించు భారము నీదే తండ్రీ! ఓ ప్రభూసర్వప్రాణి కోట్ల హృదయ పద్మమధ్యమున నివసించి ప్రకాశించు పీవే సర్వమునూ ఎరుగుదువు కదా! నిన్ను అనంతశక్తిచే కొలిచే భాగ్యాన్ని ప్రసాదించు. సృష్టిలోని అన్ని జన్మలలోనూ, ధర్మార్థాచరణ యోగ్యమైన మానవజన్మ అతి దుర్లభము. అందునా పురుషజన్మ ఇంకనూ దుర్లభము. అది వంద సంవత్సరముల పరిమితితో లభించును. దానిలో సగభాగమున రాత్రి యందునిద్రాది వ్యవహారాలలో నిరర్ధకమై గడచిపోవును. మిగిలిన యాభై వర్షములలో బాల్య కిశోరాది లీలలో గడిస్తే మిగిలిన 30 సంవత్సరాలు ఇంద్రియముల చేత పట్టుబడి, కామక్రోధ లోభమద మోహమత్సరములను పాశములచే కట్టుబడి,విడుచుటకు శక్తిలేకతృష్ణకు లోనై, సేవక, వాణిజ్య, చౌర్య కర్మలలో ప్రాణి దేనినైనా లెక్కచేయకుండా సంభోగ, సౌందర్య, చాతుర్య విధులతో, భార్యా బిడ్డల, అన్నతమ్ముల, మ మమతలనూ పు తల్లితండ్రులుబంధువులు, ధన కనక వస్తు వాహనాది, గృహసంపదలను పొంది పంటలను, వంశపారంపర్యంగా వచ్చు ఆస్తులను విడువలేక అంధకూపంలో ప్రవేశించి బయటపడలేకున్నాడు. కావునకౌమార దశలోనే సజ్జనశ్రేష్ఠుడై పరమ భాగవత ధర్మాలను అనుసరిస్తే సుఖములు కాలానుసారముగా లభించును. వృధాగా కోరికలను తీర్చుకొనుటకు ప్రయాసపడి ఆయువును వ్యర్ధము చేసుకొనరాదు. హరిభజన వలన మోక్షము సిద్ధించును. విష్ణువు సర్వభూతాంతరాత్ముడు. ప్రియుడు, ముముక్షువైన మానవునకు దేహావసాన పర్యంతం "నారాయణ" చరణారవింద సేవయే కర్తవ్యము. సంసారపు చిక్కులో ఇరుక్కుని, రక్త రజస్సులతో నున్న యోనులలో పడి, గర్భాది యవస్థలలో దేహమును ధరించి పుడుతుంటారు. కర్మతంత్రులై వందలాది జన్మలు ఎత్తినా, ఈ సంసారపు అంతమును జారలేరు. దీనిలో కీర్తి లేదు, ప్రతిష్ట అంతకన్నా లేదు. ఈ జగతిలో పుట్టి పుట్టి, చచ్చి చచ్చి కొట్టుకోవడం కంటే, చావు పుట్టుకలు లేని మార్గాన్ని వెదకుకొనుతై యస్కరము. సర్వభూతాత్మకుడు, కాలాతీత త్రిగుణాతీతుడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామియునైన భగవంతుడు, పరమాత్మ కేవలము అనుభవైకవేద్యుడు. ఆయనకు రూప, గుణాలు ఉండవు. కానీ తన మాయాశక్తిచే అనేక రూపాలలో గోచరిస్తుంటాడు. అందుచేత మనం అసురభావాన్ని విడిచి, సర్వభూతములందు దయ, సుహృద్భావములను కల్గి యుండుట మన కర్తవ్యము. అప్పుడే శ్రీ హరి సంతసించును. అపుడుమనకు లభించనిదేదియు ఉండదు.


మనం కోరకుండానే జ్ఞానముదయించును. ఈ తత్త్వమును మొదట నారాయణుడు నారదునకు, పిమ్మట మునులకు బోధించెను. హరిభక్తుల పాదరజము యొక్క పవిత్ర మహత్యమును, నారాయణ తత్త్వమును ఏకాంత భక్తులు, సర్వసంగ పరిత్యాగులు, పరతత్త్వజ్ఞులు మాత్రమే తెల్సుకొనగలరు. దేహమునకే గానీ, షడ్భావ వికారములు ఆత్మకు లేవు. ఆత్మ నిత్యుడు. క్షయము లేనివాడు. శుద్ధుడు, త్రజ్ఞుడు, ఆకాశాది పంచభూతములకు ఆశ్రయుడు. స్వప్రకాశకుడు. సృష్టి హేతువు. సర్వవ్యాపకుడు. నిస్సంగుడు. పరిపూర్ణుడు. ఏకము ఐనవాడు. కార్యాకారణములను తెలుసుకొన్న నేర్పరి బ్రహ్మభావమును పొందును.


మూల ప్రకృతి, అహంకారములు, పంచతన్మాత్రలు ఇవి అష్ట ప్రకృతులు.సత్త్వరజస్తమములు ప్రకృతి యొక్క త్రిగుణములనియు, వాక్పాణి పాద యూపస్థలను కర్మేంద్రియములనియు, శ్రవణ నయన రసన త్వక్ ఘ్రాణములు జ్ఞానేంద్రియములనియు, మనస్సు, మహీ సలి తేజః గగన వాయువులు స్థూలభూతములు. ఇవన్నీ 16 వికారాలని కపిలాది పూర్వాచారులు చెప్పారు. ఈ 27 తత్త్వాలతో సాక్షిగా ఆత్మ ఉండును. గురు శుశ్రూష, సర్వసమర్పణ, సజ్జన సాంగత్యము, హరికథాసక్తి, వాసుదేవుని యందు మ, నామకీర్తన, వైకుంఠ చరణ కమల ధ్యానము మున్నగు వైరాగ్య సాధనములైన భాగవత ధర్మములపై ఇష్టులై, కామ క్రోధాదులను జయించి భక్తితో సేవిస్తుంటే వైకుంఠుని యందు గతి సిద్ధించును. శ్రీ హరి చరణ కమలముల నామ ధ్యానముచే ధన్యత చెందెదరు.