శ్రీవారి కథలు 


శ్రీవారి కథలు                                 ధారావాహిక


                                                                   


31. కరవీరపురాధి దేవత కోసం..


కొండంత ఆశతో ఏడుకొండలు దిగి మహాలక్ష్మి కోసం కరవీరపురానికి చేరుకున్నాడు శ్రీనివాసుడు. ఆ నగరాన్ని చూడగానే ఆయనకి అమితమైన ఆశ్చర్యం కలిగింది. ఆ నగర నిర్మాణం అద్భుతం. పరమాద్భుతం అనిపించింది. ఇంత గొప్ప నగరంలో మహాలక్ష్మి నివసిస్తోందా అనుకున్నాడు శ్రీనివాసుడు. ఆ నగరాన్ని చూస్తుంటే ఆయన చూపు అలాగే నిలిచిపోయింది. తండోపతండాలుగా భక్తులు కరవీరపురాన్ని సందర్శించటానికి వస్తున్నారు. వాళ్ళతో వీధులన్నీ క్రిక్కిరిసిపోయాయి. అమ్మవారిని సందర్శించి తమ కోరికలు తీర్చుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు భక్తులు.


"అయ్యా! అయ్యా! మిమ్మయీ స్తుంటే ఈ నగరానికి కొత్తగా వచ్చినట్లు అనిపిస్తోంది. అవునా?" అడిగాడు ఒక భక్తుడు. "ఆఁ... ఆఁ.... అవును! అవును! ఈ నగరానికి కొత్తవాణ్ణి!" తడబడుతూ అన్నాడు నివాసుడు. "ఇలా ఆశ్చర్యంతో ఇక్కడే నిలబడితే లాభం లేదు. ముందుకి సాగితే ఇంతకంటే అద్భుతాలిచూ డవచ్చు. అమ్మవారి మందిరాన్ల స్తే కళ్ళు తిరిగిపోతాయి. మీరు అమ్మవారి భక్తులా? కాకపోతే ఇక్కడికి రారుగా.. ఒక్కమాట..." ఆగి అటూ ఇటూ కళ్ళు చికిలియా శాడు ఆ భక్తుడు.


"చెప్పూ..." అన్నాడు లోగొంతుకతో నివాసుడు. "అయ్యా! ఆ చెవిని ఇటు పారెయ్యండి!" అన్నాడు భక్తుడు. వెంటనే తన చెవిని అతని నోటికి దగ్గరగా పెట్టాడు నివాసుడు. - "అమ్మవారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించటానికి దానవ గూఢచారులు నగరంలో తిరుగుతుంటారు. భయం భయంగా రహస్యంగా సంచరిస్తూ ఉంటారు. అనుక్షణం మహాలక్ష్మి వాళ్ళని కనిపెడుతూ భస్మం చేస్తూ ఉంటుంది. అర్థమయిందా?" అన్నాడు భక్తుడు. " "అలాగా!" అన్నాడుశ్రీ నివాసుడు.


ఆ భక్తుడు తోటి భక్తులతో కలిసి వెళ్ళిపోయాడు. నివాసునికి అడుగు ముందుకి పడటం లేదు. అడుగడుగునా ఆశ్చర్యమే. అడుగడుగునా అద్భుతమే. అడుగడుగునా అపూర్వమే. అడుగడుగునా ఆనందమే. బ్రహ్మానందమే. ఆ నగర వైభవాన్ని దర్శించటానికి ఆయనకి రెండు కళ్ళూ చాలటం లేదు. "ఔరా! ఏం వైభవం... ఎలాంటి పట్టణం... ఇందులో మహాలక్ష్మి కొలువై ఉందా? వేంకటాచలంలో ఎక్కడో కొండల్లో కోనల్లో తిరిగాను... చిరిగిన మాసిన బట్టలు... చెదిరిన జుట్టు... ఆకలి దప్పులు... ఆ నేనెక్కడ నివాసముంటానికి తగిన తావు దొరక్క పెద్ద పుట్టలో తల దాచుకున్న నేనెక్కడ? ఒక గోవు కరుణించి వచ్చి ఇచ్చిన పాలతో కడుపు నింపుకున్న నేనెక్కడ? నా నగలూ... నా వస్తాలూ ఇక్కడ ఎవరికీ విశేషంగా కనిపించటం లేదు. నన్ను ఒక సామాన్య వ్యక్తిగా అందరమూ స్తున్నారు. పాదచారిని... అంతా విధివిలాసం" మనసులో మథనపడుతూ అంటూ స్తూ వీధుల్లో తిరుగుతున్నాడశ్రీ నివాసుడు. "ఏంటయ్యా! పెళ్ళి నడకలు నడుస్తూ అడ్డం వస్తున్నావు? ఒక పక్కగా నడు స్వామీ! ఈ పట్టణంలో ఇయా డాల్సిన విశేషాలు చాలానే ఉన్నాయి. త్వరగా నడు!" అంటూ వేగంగా నడుస్తూ ముందుకి సాగిపోతున్నారు పాదచారులు. "అలాగే.... అలాగే... మీరు వెళ్ళండి... వెళ్ళండి" అంటూ పక్కకి వెళ్ళాడు నివాసుడు. పాదచారులు వెళ్ళిపోయారు.


ఆ నగరంలో ఏ మూలూ సినా ఎత్తయిన బంగారు గోపురాలు... ఆ గోపురాల మీద బంగారు శిఖరాలు... వజ్రాలు పొదిగిన వివిధ ప్రాకారాలు... మణిమయ మందిరాలు... నవరత్నమంటపాలు.శ్రీ నివాసునికి కనువిందు చేస్తున్నాయి. విశాలంగా తీర్చిదిద్దిన పురవీధులు... మనోహరంగా పెంచిన పూలతోటలు... ఆ తోటల నిండా పరిమళిస్తున్న మల్లెలు... మొల్లలు... మందారాలు... సంపెంగలు... సన్నజాజులు... మొగలి...మాలతి...పారిజాతాలు... అన్నార్తులతో నిండిపోతున్న నిరతాన్నదాన సత్రాలు... నిరంతర వేదఘోషలు... పురాణ ప్రవచనాలభూ స్తూ... వింటూ... నడుస్తున్నాడు నివాసుడు. ఆయన క్రమంగా నగరం నడిబొడ్డుకి చేరుకున్నాడు. అక్కడ ముందుగా ఎత్తయిన లోహ ప్రాకారం కనిపించింది. ఆ ప్రాకారాన్ని దాటితే వరసగా కంచు ప్రాకారం... సీసంతో నిర్మించిన ప్రాకారం... రాగి ప్రాకారం... ఇత్తడి ప్రాకారం... రజత ప్రాకారం... సువర్ణ ప్రకారం... పుష్యరాగ ప్రాకారం... పద్మరాగ ప్రాకారం... గోమేధిక ప్రాకారం... వజ్ర ప్రాకారం... వైడూర్య ప్రాకారం... ఇంద్రనీల ప్రాకారం... ముత్యాల ప్రాకారం... మరకత ప్రాకారం... ప్రవాళ ప్రాకారం... మొదలైన పదహారు ప్రాకారాల్ని దాటి లోపలికి ఆయన అడుగుపెట్టాడు.


ప్రతి ప్రాకారానికి ఎత్తయిన రాజగోపురం ఉంది. ఆ రాజగోపురానికి ప్రవేశద్వారం ఉంది. ఆ ద్వారం దగ్గర దివ్యాయుధాల్ని ధరించిన రక్షకభటులు రాత్రింబగళ్ళు కాపలా కాస్తున్నారు. వారికి అండగా రథ... గజ... తురగ బలాలు ఉన్నాయి. ప్రాకారానికి ప్రాకారానికి నడుమ పూలతోటలు పళ్ళతోటలు ఉన్నాయి. ఈ అన్నీ దాటితే అక్కడ రత్నకాంతులతో ధగధగాయమానంగా వెలుగుతున్న మహాలక్ష్మీ మందిరాన్ని సందర్శించాడు శ్రీ నివాసుడు. అదే చింతామణి గృహం. ఆ మందిరం మధ్యభాగంలోకి అడుగుపెట్టాడు ఆయన. అక్కడ ఎదురుగా నవరత్న ఖచిత సింహాసనం కనిపించింది. విశాలమయిన... ఎత్తయిన ఆ సింహాసనం మీద మహాలక్ష్మి ఆసీనురాలయింది. ఆమెకు ఇరువైపులా కాళీ, సరస్వతీ వింజామరలు వీస్తున్నారు. ఆ జగన్మాతని... ఆ పరబ్రహ్మ స్వరూపిణిని... ఆ బ్రహ్మానంద దాయినిని... ఆ ముక్తి ప్రదాయినిని... తిలకించి పులకించిపోతున్నారు భక్తులు. తమ కోరికలన్నీ తీర్చుకుని పరమానందంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆమె ప్రసన్న దృష్టి తమపై ప్రసరించాలని ఆర్తితో ఎదురూ స్తున్నారు. "అమ్మా! తల్లీ! నీ దివ్యదర్శనంతో మా జన్మధన్యమయింది!" అని పరవశించిపోతున్నారు.


"అపార కరుణామృత వర్షిణీ!చూపుని క్షణకాలం మాపై ప్రసరించవా!" అని దీనంగా వేడుకుంటున్నారు. "నీ సేవాభాగ్యం లభించింది. ఈ జన్మకిది చాలు తల్లీ!" అని యోగులు... మహరులు ప్రార్థిస్తున్నారు. దేవతలు వచ్చి పరిపరి విధాలుగా కీర్తిస్తున్నారు. "మహాలక్ష్మీ! మాసౌభాగ్యాన్ని కాపాడు తల్లీ!" అని పుణ్యస్త్రీలు కోరుకుంటున్నారు. అందరినూ స్తూ నిశ్చేష్టుడై నిలబడ్డాడుశ్రీ నివాసుడు. ఆయనకి మహాలక్ష్మి కనిపించటం లేదు. "మహాలక్ష్మికి ఇంకా నాపై కోపం తగ్గలేదు. అందుకే ఆమె నాకు దర్శనమివ్వటం లేదు. అందరికీ దర్శనమిస్తూ కోరిన కోరికల్ని తీరుస్తూ ఆనందాన్ని పంచిపెడుతోంది. నాకు మాత్రం ఆమె కనిపించటం లేదు. ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్థం కావటం లేదు..." అని ఆయన మనసులోనే మధనపడుతున్నాడు. దివ్యతేజస్సుతో విరాజిల్లుతునశ్రీ నివాసుని తేరిపార సి "ఎవరో ఈ మహానుభావుడు! ఈయన సాధారణ వ్యక్తిలా కనిపించటం లేదు. అమ్మవారిని దర్శించిన వాళ్ళందరూ తృప్తితో ఆనందంతో తిరిగి వెడుతున్నారు. కానీ.... ఈయన మాత్రం ఏదో దిగులుతో... బాధతో ఇక్కడే ఉన్నాడు. ఇంకా ఈయనకి అమ్మవారి దర్శనం కాలేదనుకుంటాను!" అని మనసులోనే భావించాడు ఒక భక్తుడు. అతను మెల్లగ• నివాసుని సమీపించాడు. "అయ్యా! తమరు..." అడిగాడు భక్తుడు. "మహాలక్ష్మి దర్శనం కోసం వచ్చాను" చెప్పాడు నివాసుడు. "ఇంకా దర్శనం కాలేదా?" అడిగాడు భక్తుడు. "కాలేదు" అన్నాడశ్రీ నివాసుడు. "అయ్యో ! మీ ప్రారబ్దం!" అన్నాడు జాలిగా భక్తుడు. "ఊ...." అన్నాడశ్రీ నివాసుడు. "నిర్మలమైన మనసుతో అమ్మవారిని ధ్యానించండి" అన్నాడు భక్తుడు. "అలాగే!" అన్నాడు నివాసుడు. "అమ్మ... తప్పకుండా కరుణిస్తుంది" అంటూ భక్తుడు వెళ్ళిపోయాడు. "మహాలక్ష్మిని వెంటబెట్టుకుని వేంకటాచలానికి వెళ్ళాలని వచ్చాను. కానీ... ఆమె దర్శనమే దుర్లభమయిపోయింది. ఏది ఏమైనా ఆమె లేకుండా వేంకటాచలానికి వెళ్ళను. ఆమె కనిపించేంత వరకు ఇక్కడే ఉంటాను" నిర్ణయించుకున్నాడు శ్రీ నివాసుడు. మహాలక్ష్మి హఠాత్తుగా మాయమవడంతో భక్తులందరూ కలవరపడ్డారు. కలత చెందారు. ఆర్తితో దుఃఖించారు. ఆ సమయంలో దేవతలూ... మునులూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయనకి కరవీరపురంలోని పరిస్థితిని వివరించారు దేవతలు. వారి వెంట వచ్చాడు అగస్త్యుడు. ఆయన సూచనతో దేవశిల్పి పర్యవేక్షణలో మహాలక్ష్మి విగ్రహాన్ని తీర్చిదిద్దారు శిల్పులు. దేవశిల్పి కోరిక ప్రకారు నివాసుడు ఆ విగ్రహాన్ని చూ శాడు. అచ్చం మహాలక్ష్మి లాగానే ఉందని అన్నాడు శ్రీ నివాసుడు. - శుభముహూర్తంలో ఆ విగ్రహాన్ని చింతామణి గృహంలో ప్రతిష్ఠించాడు అగస్త్య మహర్షి. అక్కడే మహాలక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ• నివాసుడు కఠోరమైన తపస్సుని ఆరంభించాడు. చింతామణి గృహంలో వైదికంగా పూజలు అమ్మవారికి సాగుతున్నాయి. భక్తులు దర్శించుకుంటున్నారు. పదేళ్ళు గడిచాయి. అయినా మహాలక్ష్మి కరుణించలేదు. ఆమెను ఎలా ప్రసన్నురాలిని చేసుకోవాలో శ్రీ నివాసునికి తోచటం లేదు. చింతామణి గృహంలోంచి బయటికొచ్చి ప్రవాళ ప్రాకారంలో పారిజాత వృక్షం క్రింద కూర్చున్నాడు నివాసుడు. ఆయన మీద పారిజాతం పువ్వులు రాలుతున్నాయి. మృదువయిన పరిమళాలు అక్కడంతా వ్యాపిస్తున్నాయి.