అతి వ్యా మోహం అనర్థదాయకం

అతి వ్యా మోహం అనర్థదాయకం



  • భగవంతుడు ఇతర జీవరాశుల మాదిరిగా మానవులను కూడా ఈ భూమిపై జన్మింపచేశాడు. కాని ఏ జీవికీ లేని బుద్ధిని మానవునికి ప్రసాదించి, ఇతర జీవరాశుల నుంచి వేరు చేసి అన్నిటిలోకి ఉత్తమ స్థానాన్ని కల్గించాడు. పైగా మానవునికి తాను జీవించి ఉన్న సమయమందే భగవంతుణ్ణి పొందే శక్తి సామర్థ్యాలను కల్గించాడు. ఇంతటి మహోన్నత శక్తి కలిగిన మానవుడు తనకున్న శక్తిని దుర్వినియోగం చేయుచు ఈ మానవ జన్మను దురుపయోగం చేయకూడదు. నేడు మనము ఈ విషయాన్ని పూర్తిగా మరచి మన కుటుంబము, బంధువులు, నేను, నాది అంటూ తుచ్చమైన విషయాలపైన ఎక్కువ సమయాన్ని వెచ్చించి జీవితాన్ని నాశనము చేసుకొనుచున్నాము. ఈ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాడన్న విషయాన్ని కూడా మైకంలో పడిన మానవుడు తెలుసుకోలేకపోవుచున్నాడు. పూర్తి సమయాన్ని తన స్వార ప్రయోజనాలకే వినియోగించుచున్నాడు. ప్రతి వ్యక్తికీ కుటుంబము మరియు సంపాదన అవసరమే కాని అది మితిమీరకూడదు. దానిని ఒక హద్దులో పెట్టుకోవాలి. లోకంలో ధనవంతులకే అన్ని మర్యాదలు దొరుకునని, అందరూ ఆదరించుదురని భ్రమించి నీతి నియమాలు వదలి డబ్బు సంపాదనే ముఖ్యంగా ఎంచుకొని జీవిత విలువలను పాడు చేసుకొనరాదు. జీవితంలో దేనిపైనా వ్యామోహం పనికిరాదు. డబు, పరపతి, ఇతరుల నుండి గౌరవము పొందాలనే ఆశ మంచిది కాదు. చివరికి తనపైన, తన కుటుంబ సభ్యులపైన కూడ అతిప్రే మ మంచిది కాదంటారు. నశించే వేటిపైనా కూడా అతి వ్యామోహము చెందకూడదంటారు. శాశ్వతుడైన భగవంతుణే అధికంగాప్రే మించాలి. మనకు అత్యంత ఇష్టుడు ఆయనే అయి ఉండాలి. అప్పుడే మనము పొందిన ఈ జన్మ సార్థకమవుతుంది. మనము అల్పులము, శక్తిహీనులము కాబట్టి లౌకికమైన, వ్యవహారికమైన విషయాల పట్ల ఆసక్తిని వదులుకోలేకపోయినచో ప్రతిరోజు అభ్యాసపూర్వకంగా ఈ లౌకిక ఆసక్తుల నుండి బయటపడాలి. లేదా తగిన శక్తిని ప్రసాదించమనిశ్రీ హరిని వేడుకోవాలి. ఆయన మన ప్రయత్నాన్ని మన్నించును. హరిని పొందుటకు అడ్డువచ్చే అన్ని ఆటంకాలను దూరము చేయును. లౌకిక విషయాలపైన అతి వ్యా మోహము ఎప్పటికీ మంచిది కాదు. చివరికి కుటుంబ సభ్యులపైన కూడా అతి వ్యామోహము మంచిది కాదంటారు.

  • పూర్వము దశరథునికి తన పెద్ద కుమారుడైన రామునిపైన అతి వ్యామోహము ఉండేది. అతడు లేనిదే తోచేది కాదు. ఎప్పుడూ రాముని చెంతనే ఉండాలనే కోరిక అతనికి ఎక్కువగా ఉండేది. కాని చివరికి రాముడు ఆయనకు దూరమైనాడు. ఆ వ్యధతోనే దశరథుడు మరణించాడు. కైకేయి కూడా రాముడంటే ఎంతో ఇష్టంగా ఉండేది. తన సొంత కొడుకైన భరతుని కంటే ఆమెకు రాముడే ఎక్కువ ఇష్టం. కాని విధి వక్రించి రామునిపై అసూయ పెరిగేలా చేసింది. చివరకు లోకం చీ అన్నది. అసహ్యించుకున్నది. పురాణాలే కాకుండా మన నిత్యజీవితమును నిశితంగా పరిశీలించితే ప్రతివారి జీవితంలోనూ ఇదే అనుభూతి దొరుకుతుంది. దీనిని మనము గ్రహించాలి. జీవితానికి అన్వయించుకోవాలి. మన జీవితం బంగారం లాగా వెలిగిపోవాలంటే లౌకికమైన, వ్యావహారికమైన విషయాల పట్ల అతిగా స్పందించకూడదు. మరియు నశ్వరమైన విషయాల పట్ల అతిగా వ్యామోహం చెందకూడదు. ఎంతటి వస్తువైనా, ఎవ్వరినైనా, ఎంతటి ఆస్తినైనా భగవంతుని తరువాతే విలువనివ్వాలి. మనకు అందరికంటే దగ్గరివాడు, ఆత్మీయుడు, కేవలము శ్రీ వేంకటేశ్వరుడేనని గుర్తించాలి. సదాశ్రీ వేంకటేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండాలి. ఆయనే మనందరికీ రక్ష.


 వినా వేంకటేశం న నాథో న నాథః | సదా వేంకటేశం స్మరామి స్మరామి||


                                                                         శ్రీ వేంకటేశ్వర పాదసేవకుడు


                                                                         


Editor, Publisher, Printer and owned by Pullagurla Sai Reddy. Published at H.No.1-1-53, Street No:1, Habsiguda, Hyderabad-500007. Printed at: Sai Tirumala Printers, H.No:1-8-556/2, Chikkadpally, Hyderabad-500020. Editor: Pullagurla Saireddy. Cell : 93482 12354, Ph:040-27175050; E.mails: srivenkatesham@gmail.com, namo_venkateshaya@yahoo.com