సత్యవాక్య పరిపాలన


సత్యవాక్య పరిపాలన                                   - చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి


పునర్వితం పునర్మితం పునర్మహీం ఏకత్సర్వం పునర్లభ్యం నశరీరం పునః పునః


అన్నారు జగద్గురు శంకరాచార్యులవారు. అంటే డబ్బు పోతే మళ్ళీ దొరుకుతుంది. లేదా సంపాదించుకోవచ్చు. ఒక మిత్రుడు దూరమయిపోతే మరొకడు దొరుకుతాడు. సర్వం పోగొట్టుకున్నా ఏదో మార్గంలో కష్టపడి సంపాదించుకోవచ్చు. కాని మానవ శరీరం కోల్పోయామంటే మళ్ళీ లభ్యమవడం మన చేతుల్లో లేదు. దైవానుగ్రహం ఉండాలి. అందుకని ఈ శరీరం ఉన్నప్పుడే నీవు చేయాల్సిన మంచి పనులు అనగా సత్కర్మలు చేసి మోక్షాన్ని పొందు అని ఆ మహానుభావుడు మనందరకు ఉద్బోధించాడు.


మన పంచేంద్రియాల్లో నాలుక ఒకటి. ఇది చేసే పని మాట్లాడడం. మాట్లాడడంలో రెండు రకాలున్నాయి. ఒకటి సత్యం పలకడం, రెండవది అసత్యం పలకడం. మృదువుగా మాట్లాడడం, మనకవసరమయినంత వరకు మాటాడడం మంచిది. కఠినంగా మాట్లాడడం, అనవసరంగా వాదనలు పెంచుకోవడం వల్ల పదిమందితో విరోధం తెచ్చుకోవడం తప్ప ప్రయోజనం శూన్యం. అందులో నిత్యము సత్యాన్నే పలకడం అసిధారా వ్రతం వంటిది. సత్యవాక్పరిపాలన చాలా కష్టం. సత్యం యొక్క ప్రాశస్త్యం గురించి ఈ చిన్న శ్లోకంలో చెప్పారు. సత్యాన్నాస్తి పరోధర్మ: సత్యానా వాయుర్వతి


సత్యాన్నాస్తి పరోధర్మ: సత్యానా వాయుర్వతి సత్యానా విద్యోదోచలే దివి సత్యాం వాచా ప్రతిష్టః సర్వేసత్యం సంప్రతిష్టితామ్ తన్మాం సత్యాం పరమం వదతి


సత్యాన్ని మించిన ధర్మం లేదు. సూర్యచంద్రులున్నంత వరకు సత్యవాక్య పరిపాలకుడు చిరంజీవి. పధ్నాలుగు లోకాల్లోను అతన్ని గురించి చెప్పుకుంటారు. "సత్యంవద, ధర్మంచర" అని ఆర్యోక్తి. సత్యం వర్ధిల్లాలి. ధర్మం రక్షింపబడాలి. తమ సత్యవాక్పరిపాలనా వ్రతం కోసం పురాణాల్లో ఎంతోమంది మహానుభావులు తమ రాజ్యాల్ని, పదవుల్ని వదులుకుని అష్టకష్టాలు పడ్డారు. అలాంటివారిలో ముందు అందరికి జ్ఞాపకం వచ్చేది సత్యహరిశ్చంద్రుడే అనడంలో ఏ సందేహం లేదు. ఆయన తన సత్యవాక్పరిపాలన కోసం సర్వస్వం త్యజించి తన భార్య చంద్రమతిని అమ్ముకున్నాడు. లోహితాస్యుడు మరణించినా తన ధర్మాన్ని తప్పలేదు. చివరకు తను ఒక ఛండాలుడి వద్ద కాటికాపరిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. అతని సత్యవాక్పరిపాలనకు సంతుష్టుడయిన విశ్వామిత్రుడు అతను కోల్పోయిన రాజ్యాన్ని, వైభవాన్ని తిరిగి అనుగ్రహించాడు. అందుకే ఆచంద్ర తారార్కం అతని కీర్తి వర్ధిల్లుతోంది.


తలలో నాలుకలా మసలుకోవాలి అని పెద్దలు అంటారు. ఏమాత్రం అది అజాగ్రత్తగా ఉన్నా 32పళ్ళలో ఏదో ఒకదాని క్రింది నలిగిపోతుంది. మాట ఉచ్చరించడానికి నాలిక అత్యవసరం. అది లేనిదే మాటరాదు. వాక్కుకు అధిదేవత సరస్వతి.మనమాట ఎంత పవిత్రంగా సత్యాన్ని పలుకుతూ ఉంటే జనులు మనల్ని అంత గౌరవిస్తారు. త్రికరణ శుద్ధితో మాట్లాడాలి అంటే మనసా, వాచా, కర్మణా చెప్పమని అర్థం. అవి పరిశుద్ధంగా ఉంటే మన నోటివెంట సత్యమే సదా వెలువడుతుంది. ఒక అబద్దం ఆడితే దాన్నికప్పి పెట్టుకోవడానికి 100 అబద్దాలు ఆడాలి. అకారణంగా అసత్యాలు చెప్పడం, అనవసరంగా దుర్భాషలాడడం, ఒకరిమీద నేరాలు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. వారిని బాధ పెట్టడం తప్ప.


రామకృష్ణ పరమహంస తన శిష్యులతో అనేవారు. అలా చేయడం వల్ల మన నాలికతో వాళ్ళ పాపాలు శుద్ధి చేసి వాళ్ళ పాపాలు పోగొట్టినట్టయితే అవి మనకు సంక్రమిస్తాయని. అసత్యదోషం అంత బలమయింది. చిన్నప్పుడు మనం చదువుకున్న ఆవు, పులి కథ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక పెద్దపులి అడవిలో మేత మేయడానికి వచ్చిన ఆవును మింగేస్తాననడం, అప్పుడు ఆవు పులిని తన దూడకు పాలిచ్చి, తిరిగి వచ్చి తనకు ఆహారమవుతాననడం, అతి కష్టం మీద దానికి పులి ఒప్పుకుని ఆవును పంపడం జరుగుతుంది. గోమాత ఇంటికి వెళ్ళి తన ముద్దుల మూటకు పాలిచ్చి ఎన్నో నీతులు చెప్పి, తిరిగి అన్నమాట ప్రకారం తిరిగి వచ్చి పులి ఎదురుగా నిలబడి మింగమంటుంది. దానికి ఆ చారల మెకం ఆనందించి సంతోషంగా నీ బిడ్డతో హాయిగా ఉండమని కారడవిలోకి మాయమవుతుంది.


అలాగే మరొక చిన్నకథ. ఒక అడవిలో ఒక వేటకాడు వేటాడుతూ ఉండగా ఒక అందమైన లేడి గరిక మేస్తూ కనపడింది. విల్లు ఎక్కుపెట్టి దానిపై బాణం వేయబోగా, అది తప్పించుకుని వచ్చి వేటగాడి కాళ్ళమీద పడి కన్నీరు కారుస్తూ, "ఓ బోయవాడా! నాకు ఈ మధ్యనే మూడు పిల్లలు కలిగాయి. వాటికి పాలిచ్చి, వాటిని నా భర్త దుప్పికి అప్పగించి, తిరిగి వచ్చి నీకాహారమవుతానని వేటగాడి కాళ్ళమీద పడి వేడుకుంది. "అందుకు నాకు చాలా ఆకలిగా ఉంది" అని మళ్ళీ విల్లు ఎక్కుపెట్టాడు. అందుకు ఆ హరిణం మళ్ళీ ప్రాధేయపడగా ఏ కళనున్నాడో బోయవాడు అంగీకరించాడు. అప్పుడు ఆ శబరం తన నివాసానికి వెళ్ళి పిల్లలకు పాలిచ్చి, భర్త దుప్పితో విషయం చెప్పి తిరిగి వేటకాడి వద్దకు ప్రయాణమైంది. అందుకు జింక, నేను మన పిల్లలతో నీ సత్యవాక్పరిపాలన కోసం వచ్చి ఆహారమవుతామని అన్నీ కలిసి అడవిలో వేటకాడి వద్దకు వచ్చాయి.


ఆ హరిణ కుటుంబమంతా బోయవాడి వద్దకు వచ్చి వానికెదురుగా నిలబడి "ఓయీ బోయరాజా! నీవు ఎంతో ఆకలితో ఉన్నావు. అతిథి ఆకలి తీర్చడం గృహస్థు ధర్మం . అతిథి దేవోభవ అని ఆర్యోక్తి. మమ్మల్ని చంపి భుజించి నీ కుటుంబం ఆకలి కూడా తీర్చుకో" అని వేటగాడిని వేడుకున్నాయి.


చూ ఆ కురంగ కుటుంబం యొక్క సత్యవాక్పరిపాలనా విధానం సి ఆ నిషాదుడు ఆశ్చర్యంతో "ఓ సత్యనిరతి పాలన మృగ కుటుంబమా! మానవుడనయిన నేను మిమ్మల్ని చంపాలనుకునే యోచనకు సిగ్గుపడుతున్నాను. ఈరోజు నుండి అడవిలో వేటమాని, జీవహింస చేయకుండా కృషీవలుడనై శాకాహారిగా నేను, నా కుటుంబం బతుకుతాం" అని శపథం చేసి విల్లంబులు విరిచి ఎటో వెళ్ళిపోయాడు. సత్యవాక్పరిపాలన అంత గొప్పది.


దుష్యంతోపాఖ్యానంలో శకుంతల తన కుమారుడు భరతుని తీసుకువచ్చి నిండు కొలువులో ఉన్న దుష్యంతుని సన్నిధికి తీసుకువచ్చి, "ఓ రాజా! ఈ బాలుడు నీ కుమారుడు భరతుడు. కణ్వాశ్రమంలో మనకు జరిగిన గాంధర్వ వివాహ మఫలం. స్వీకరించు" అని అతనికి అప్పగించబోతే చక్రవర్తి అధికార మదంతో అందరి ఎదురుకుండా తన సూనుడు కాదని అసత్యమాడుతాడు. అందుకు ఆమె దుఃఖిస్తూ, "ఓ చక్రవర్తీ! నీవు ఈ దేశపు మహారాజువి. అసత్యం ఆడరాదు. సత్యాన్ని పలకాలి. నిజం చెప్పడంలో ఉన్న గొప్పతనం చెబుతున్నాను విను.


నుత జలపూరితంబులగు నూతులుకంటె సూ నృతవత ఒక బావి మేలు! మరి బావులు మారిటకంటే ఒక క్రతువు మేలు! తత్కతు శతంబుకంటె ఒక సత్పుండు మేలు! తరి పుత్ర శతంబు కంటే ఒక సూనృత వాక్కు మేలు ఎయో డగన్


100 మంచి నీటి బావులు కన్నా ఒక దిగుడుబావి మేలు. అట్టి దిగుడు బావులు నూరింటి కంటె ఒక యాగం చేయుట మంచిది. అటువంటి నూరు యజ్ఞాలు చేయుట ఒక సత్పుత్రుడికి తండ్రి అవడం మంచిది. ఆ పుత్ర శతం కన్న ఒక సత్యవాక్కు పలకడం వల్ల ఉత్తమ గతులు కలుగుతాయి" అని పలికింది. ఆ అమృతవాక్కులు వినగానే దుష్యంతునికి ఆకాశవాణి పలుకులతో గతం జ్ఞాపకం వచ్చి భార్యాబిడ్డలను స్వీకరిస్తాడు. - చూ శారుకదా! సత్యం యొక్క మహత్యం! అందుకే అందరూ దయచేసి సత్యం పలకండి. పలికించండి. తద్వారా వాగ్గేవి అనుగ్రహం పొందండి.