నమో వేంకటేశాయ రథయాత్ర

నమో వేంకటేశాయ రథయాత్రశ్రీ వేంకటేశ్వర మహామంత్ర పీఠ వ్యవస్థాపకులైన పుల్లగూర్ల సాయిరెడ్డిగారు(గోవిందదాసు)తలపెట్టిన నమోవేంకటేశాయ' రథయాత్ర 29-7-2019 నాడు ప్రారంభించబడినది. సాయిరెడ్డిగారశ్రీ వేంకటేశ్వర స్వామివారికి అసలైన భక్తులు. వారు నిజంగానే గోవిందదాసులు. వారి దృష్టి ఎప్పుడూ భగవత్సేవపైనే ఉండటం అందుకు ప్రబల తార్కాణం. గత 16 సంవత్సరాల నుంచి ఈ రథయాత్రను నిర్వహించటం, అశేష భక్తులనథీ వారి అనుగ్రహానికి పాత్రులను చేయటానికి సంకల్పించి, ఇంటింటికీ స్వామివారి రథాన్ని తీసుకొని వెళ్లి వారినందరినీ ఆనంద పరవశులను చేయటం సాయిరెడ్డి గారి దీక్షకు ప్రత్యక్ష సాక్ష్యాలనే చెప్పాలి. 'ఓం నమో వేంకటేశాయ' జపపుస్తకాలను సిద్ధంచేసి,వందలాది భక్తులచేతఆపుస్తకాలలో 'ఓం నమో వేంకటేశాయ' దివ్య మహామంత్రాన్ని లిఖింపచేసి ప్రతి సంవత్సరం 7 కోట్ల జపాన్నిశ్రీ వారి పాదపద్మాలకు సమర్పిస్తున్నారంటే - అది వారి అనన్యమైన భక్తితత్పరతకు నిదర్శనం కాక మరేమిటి?


ఇక ఈ సంవత్సరం 17వ పర్యాయంగా రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర ఇంటి నెం. 1-1-53, వీధి నెం.1, హబ్సీగూడ, హైదరాబాద్-07 నుంచి ప్రారంభమై హైదరాబాద్లోని అనేక కాలనీలలో, వివిధ ప్రదేశాలలో భక్తులను ఆకట్టుకొంటూ కొనసాగడమేకాశ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య దర్శనాన్ని ప్రసాదించట మరచిపోలేని, మరపురాని సంఘటనగానే నిల్చిపోతుంది. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలలో కూడా రథాన్ని నడిపించి ఆయా ప్రజలను సంతుష్టపరచడం రథయాత్రలోని విశేషం. ఊరూరూ తిరిగి చివరకు స్వామివారి సన్నిధానమైన తిరుపతికి రథం చేరుకోవటంలో గల ఆంతర్యం 7 కోట్ల లిఖిత జపానిశ్రీ వారి పాదపద్మాలకు సమర్పించడమేదానికనువైన దినం గోకులాష్టమే.


| ఇంత సుందరమైన, భక్తికి ప్రతీక అయిన రథయాత్ర నిర్విఘ్నంగా సఫలీకృతం కావడానికి ఏడుకొండల దేవరకు ఏడు రోజులుగా సహస్ర నామార్చన చేసి 2019 సంవత్సరం జులై 29వ తేదీన సాయం సమయాన 6 గం||లకుశ్రీశ్రీశ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామివారిచే పూజాదులు నిర్వహింపజేసి వారి అనుగ్రహాన్ని పొందగల్గడమే కారణం. సభా కార్యక్రమానికి ముందు గాయనీమణులు భక్తిగీతాలను ఆలపించి సభ్యులను ముగ్ధుల్ని చేశారు. భగవంతుని మీద భక్తునికుండవలసని ప్రగాఢ విశ్వాసాన్ని కథల రూపంలో స్పష్టం చేశాటీశ్రీశ్రీ జీయర్ స్వామిగారు.నేటిమానవుడుతన నిరంతర అవిశ్రాంత జీవనసరళిలో దేవుని స్మరించలేకపోతున్నాడని, అది సరైనది కాదని, రోజు మొత్తంలో ఏ ఒక్క క్షణమైనా దేవుని తలచుకొని తీరాలని, ఏకాగ్ర చిత్తాన్ని అలవరచుకోవాలని, అదే మనల్ని అనుక్షణం కాపాడుతుందని సోదాహరణగా వివరించారు స్వామీజీ తమ అనుగ్రహభాషణంలో, సెల్ ఫోన్లో గంటల తరబడి ఛాట్ చేయడం కన్నా కొంచెం సేపు భగవంతుని స్మరించడాన్ని కర్తవ్యంగా భావించాలని శ్రోతలకందరికీ పిలుపునిచ్చారు. గురువుగారి అనుగ్రహ భాషణం సభ్యులనందరినీ ఆనంద పరవశుల్ని చేసింది.


తరవాత దివ్యరమణి మాతాజి-తాము స్థాపించిన సంస్థల గురించి, ఆయా సంస్థలు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి తెలియజెప్పారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యం చేపట్టి పునీతులు కావాలని ఉద్బోధించారు.


సమావేశానికి అధ్యక్షత వహించిన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి సంవత్సరం నిర్వహింపబడుతున్న మహోన్నతమైన 'నమో వేంకటేశాయ రథయాత్ర' గురించిన వివిధ అంశాలు మనోహరంగా వర్ణించి సభాసదులనందరినీ భక్తిభావనలో నిమగ్నులను చేశారు. భక్తితత్త్వాన్ని విపులీకరిస్తూ పరమాత్మలో ఐక్యం కావటానికి భక్తిని మించిన ఉత్తమ మార్గం మరొకటి లేదని ఉద్ఘాటించాడు.


డా. కృష్ణకుమారి నవవిధ భక్తులను- కీర్తనల రూపంలో గానం చేసి వాటి వైశిష్ట్యాన్ని విశదీకరించారు. భక్తిలోని మాధుర్యాన్ని కంఠమాధుర్యంతో జోడించి తనలోని ప్రత్యేకతను చెరటి పించారు.


డా. లలితావాణి 'రథ' శబ్దాన్ని వ్యాఖ్యానించి, మానవ శరీరాన్ని రథంతో పోల్చి ఉపనిషత్ వాక్యాలను ఉదహరిస్తూ 'రథయాత్ర' అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందడమే అని స్పష్టం చేశారు. పరమాత్ముడైనటీ వేంకటేశ్వర స్వామిని చేరుకోవడమే జీవుని లక్ష్యమని తెలియజేయడమే ఈ రథయాత్ర పరమోద్దశమని స్పష్టం చేశారు.


ఆధ్యాత్మిక కార్యక్రమానంతరం ప్రసాద వితరణ జరిగింది. _30-7-2019 ఉదయం నుంచి ప్రారంభమైన రథయాత్ర 23-8-2019 (కృష్ణాష్టమి) నాటికి తిరుపతికి చేరింది. ఎస్.వి. డైరీ ఫారం ఆవరణలోశ్రీ వేంకటేశ్వర స్వామివారిని జపహోమాదులతో అర్చించిశ్రీ వేంకటేశ్వర దివ్య మహామంత్ర' స్థూపములో జప పుస్తకాలనన్నిటిని సమర్పించి శరణాగతులు కావడం వల్ల భక్తులతోపాటుశ్రీ సాయిరెడ్డి దంపతులు ధన్యులైనారు.