శ్రీ విష్ణుమహాపురాణం


చతుర్థాంశము - రెండవ అధ్యాయము శ్రీ పరాశరుడు చెబుతున్నాడు. రైవతుడైన కకుద్మినలుబది బ్రహ్మలోకం నుండి తిరిగి వచ్చేలోపుగా, పుణ్యజనులని పిలువబడే రాక్షసులు ఈతని నగరమైన కుశస్థలిని నాశనం చేశారు. ఈతని నూరుగురు సోదరులు రాక్షసులకు భయపడి దిక్కులకు పరిగెత్తారు. ఆ వంశములోని క్షత్రియులంతా అన్ని దిక్కులలో చేరారు. వృష్ణునకు వారిష్టకుడను క్షత్రియుడు కలిగినాడు. నాభాగుని పుత్రుడు నాభాగుడైనాడు. ఆతని పుత్రుడు అంబరీషుడు. అంబరీషునకు విరూపుడు, విరూపునకు పృషదశ్వుడు, ఆతనికి రథతరుడు ఇట్లా వంశక్రమం. రథతరుని గూర్చి శ్లోకమిది.


    ఇతరుల గూర్చియు ఈ క్షత్రియులంతా అంగీరసులనబడతారు. రథతరులలోని శ్రే షులంతా క్షాత్ర తేజస్సంపన్నులు. బ్రాహ్మణ జాతివారు అని. తుమ్మినపుడు మనువు యొక్క నాసిక నుండి ఇక్ష్వాకువు అని పుత్రుడు కల్గినాడు. ఆతని నూర్గురు పుత్రులలో వికుక్షి, నిమి, దండుడు అను ఈ ముగ్గురు పుత్రులు ప్రధానమైనవారు. శకుని మొదలుగా గలవారు ఏబది మంది పుత్రులు ఉత్తరాపథాన్ని రక్షించేవారైనారు. కకుద్మినలుబది ఎనిమిది మంది పుత్రులు దక్షిణాపథానికి రక్షకులైనారు. ఆ ఇక్ష్వాకువు అష్టకా శ్రాద్దాన్ని చేయదలచి శ్రాద్దానికి కావలసిన మాంసాన్ని తెమ్మని వికుక్షికి చెప్పాడు. అతడు అట్లాగే అని అనుజ్ఞ పొందిధనుర్బాణాలుధరించిఅడవికి వెళ్ళి, అనేకమృగాలనుచంపి అలసిపోయి ఆకలి ఏర్పడి వికుక్షి ఒక కుందేలును భక్షించాడు. మిగిలిన మాంసాన్ని తెచ్చి తండ్రికిచ్చాడు. ఇక్ష్వాకుల ఆచార్యుడు వసిష్ఠుడు ఆ మాంసాన్ని ప్రోక్షించేందుకు వచ్చి అన్నాడిట్లా - అపవిత్రమైన ఈ మాంసం తగదు. దుర్మార్గుడైన నీ పుత్రుడు ఈ మాంసాన్ని దూషితం చేశాడు. ఈతడు ఈ కుందేటి మాంసాన్ని తిన్నాడు. అప్పుడు వికుక్షిని శశాదుడు - అని. కుందేలు మాంసం తిన్నవాడా అని ఆ పేరుగల ఆతనిని తండ్రి విడిచిపెట్టాడు. తండ్రి మరణించిన తరువాత ఈతడు ఈ భూమినంతా ధర్మప్రకారంగా పరిపాలించాడు. శశాదునకు పురంజయుడని పుత్రుడు కల్లినాడు. ఆతని గూర్చి ఇదొక మాట | తాయుగంలో పూర్వం దేవతలకుఅసురులకుభయంకరయుద్ధం జరిగింది. అందులోబలవంతులైన రాక్షసులు దేవతలను ఓడించారు. వారు విష్ణువునారాధించారు. ఆ విష్ణువు ప్రసన్నుడై, ఆద్యంతములు లేని, అఖిల జగత్తుల యందు ఆసక్తుడైన నారాయణుడు దేవతలతో అన్నాడు. మీకేం కావాలో నాకు తెలిసింది. అందుకు కావలసింది వినండి | శశాదుని పుత్రుడైన పురంజయుడను రాజర్షి క్షత్రియతే షుని శరీరంలో నేను అంశగా అవతరించి ఆ అసురులనందరినీ సంహరిస్తాను. మీరు, పురంజయుడు అసురులను చంపేందుకు ప్రయత్నించండి అని. దీనిని విని భగవంతుడైన విష్ణువుకు నమస్కరించి దేవతలు పురంజయుని దరికి వచ్చి అతనితో ఇట్లా చూపులు అన్నారు. ఓ క్షత్రియతే షా! మేము మా క్షత్రియ శత్రువులను చంపదలిచాము. మేము ప్రార్థిస్తున్నాము. నీవు మాకు సహాయం చేయాలి. మా ఈ కోరికను నీవు తిరస్కరించవద్దు అని అనగానే పురంజయుడన్నాడు - త్రైలోక్యనాథుడైన ఇంద్రుని భుజములపై నేను అధివసించి, మీ శత్రువులతో పోరాడుతాను. అటైతే సహాయం చేస్తాను అని అనగా విని ఇంద్రుడు, దేవతలు అంతా సరేనన్నారు. పిదప వృషరూప ధారియైన (ఎద్దు) ఇంద్రుని ఊపురంపై అధివసించి, చాలా కోపంతో, చరాచరములకు గురువైన అచ్యుతుని తేజస్సుతో నిండి, దేవాసుర సంగ్రామంలో అసురులందరినీ వధించాడు. ఎద్దు మూపురంపై కూర్చుని రాజు, రాక్షసబలాన్ని వధించాడు. అందువల్ల ఈతనికి కకుత్స్థుడు అనే పేరు వచ్చింది. ఈతని పుత్రుడు అనేనుడు. ఈతని పుత్రుడు పృథువు. ఈతని పుత్రుడు విష్టరాశ్వుడు. ఆతనికి చంద్రవంశీయుడైన యవనాశ్వుడు జన్మించాడు. ఆతని పుత్రుడు శావస్తి. ఆతడు శావస్తి నగరాన్ని నిర్మించాడు. ఆతనికి బృహదశ్వుడు, అతనికి కువలయాశ్వుడు.


              ఈ కువలయాశ్వుడు ఉదకమహర్షిని బాధించే దుందు అనే అసురుణ్ణి, విష్ణు తేజస్సుతో పూర్ణుడై, ఇరువది యొక్క వేల కొడుకులతో కూడి సంహరించి దుందుమారుడనే పేరు పొందాడు. అతని పుత్రులంతా దుందువు యొక్క ముఖం నుండి వెలువడిన నిశ్శ్వాస అగ్నితో తత్తరపడి నశించారు. కుమారులలో దృఢశ్వ, చంద్రాశ్వ, కపిలాశ్వులను ముగ్గురు మాత్రం మిగిలారు.దృఢశ్వునకుహర్యశ్వుడు, అతనికి నీకుంభుడు, అతనికి అమితాశ్వుడు, అతనికి కృశాశ్వుడు, వానికి ప్రసేనజిత్తు, ఆతనికి యువనాశ్వుడు. అతనికి సంతానం లేదు. అతడు చాలా దుఃఖించగా, మునుల ఆశ్రమంలో ఉండగా, వారికి దయ కలిగి సంతానం కలగాలని ఇష్టి చేశారు. ఆ ఇష్టిలో, మధ్యరాత్రిలో మంత్రపూరిత జలంతో నిండిన కలశాన్ని వేది. మధ్యలో ఉంచి ఆ మునులు నిద్రించారు. వారు నిద్రించగా, బాగా దప్పిక గొన్న ఆ రాజు, ఆశ్రమంలోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న ఆ ఋషులను లేపలేదు. ఆ కలశంలోని అధికమైన శక్తి గల జలాన్ని త్రాగాడు. మేల్కొన్న రుషులు ఈ మంత్రపూరిత జలాన్ని ఎవరు త్రాగారు? అని అడిగారు. ఆ జలం త్రాగినట్లైతే రాజైన యవనాశ్వుని భార్య మహాబల పరాక్రమవంతుడైన పుత్రుని కంటుంది అని అనగా, ఆరాజు తెలియక నేనే ఆ జలాన్ని త్రాగానని చెప్పాడు. యవనాశ్వునకుగర్భమైనది. అది పెరిగింది. కాలం నిండగా కుడి బొటవ్రేలితో కడుపు చీల్చుకొని ఆ పిండం బయటపడింది. ఆ రాజు మరణించాడు. పుట్టిన ఈ పిల్లవాడు ఎవరిని ధరించి (ఆధారంగా) జీవిస్తాడని ఆ మునులడిగారు. ఇంద్రుడు వచ్చి ఈతడు నన్ను ధరిస్తాడని చెప్పాడు. అందుకే అతని పేరు మాంధాత. ఈ పిల్లవాని నోటిలో ఇంద్రుడు తన చూపులు నుంచాడు. దానిని ఆ పిల్లవాడు చప్పరించి జీవించాడు. ఆవే లు అమృతాన్ని ఇచ్చేది. ఒక్కరోజులోనే పెరిగాడు. ఆ మాంధాత చక్రవర్తి ఏడు దీవుల భూమండలాన్ని పరిపాలించాడు. అతని గూర్చిన స్తుతి ఇది - సూర్యుడు ఉదయించి, అస్తమించేంత ప్రదేశం గల ఈ భూమండలమంతా యౌవనాశ్వుడైన మాంధాత భూమి అని అన్నారు.


  మాంధాత శతబిందువు కూతురు బిందుమతిని వివాహమాడాడు. ఆమెకు పురుకుత్సుడు, అంబరీషుడు, ముచికుందుడు అను ముగ్గురు పుత్రులు, ఏబదిమంది కుమార్తెలు కల్గినారు. ఈమధ్యలో బహ్వృచుడైన (వేదభాగం) సౌభరి మహర్షి నీటిలో పన్నెండు సంవత్సరాలున్నాడు. ఆ నీటిలో సంమదుడు అని పేరుగల బాగా సంతానం గల పెద్ద చేపరాజు ఉండేది. ఆతనికి పుత్రులు, పౌత్రులు, దౌహిత్రులు ఆతని చుట్టూ, ముందు, వెనక, ప్రక్కల, రెక్కలు, తోక, తల పైన తిరుగుతూ ఆ రాజుతోనే ఆసంతానమురాత్రింబగళ్ళు సంచరిస్తూ ఆనందిస్తూ ఉండేవి. ఆ మీన రాజు సంతానపు స్పర్శతో ఆనందం ఉప్పొంగిపోగా, అనేక రకాలుగా ఆబచూస్తుండగా ఆపుత్ర, పౌత్ర, దౌహిత్రాదులతో కూడి ప్రతితో బాగా ఆడుకునేవాడు. ఆనందించేవాడు. ఆ నీటిలో ఉన్న సౌభరి, ఏకాగ్రంగా సమాధిని వదలి, ప్రతిరోజు ఆ చేపయొక్క తనవాళ్ళేన పుత్ర, పౌత్ర, దౌహిత్రాదులతో కూడి ఆనందించటామా చి, ఈ ఋషి ఆలోచించాడు.


అహో! ఈ మీనరాజు ధన్యుడు. ఇలాంటి కోరతగని మరొక యోనిని (శరీరాన్ని పొంది, తనవారైన పుత్ర పౌత్ర, దౌహిత్రాదులతో కూడి ఆనందిస్తూ ఉండాలనే కోరికను నాకు కల్గిస్తున్నది. నేను కూడా ఇలాంటి పుత్రాదులతో కూడి సుకుమారంగారమిస్తూ ఉండాలని కాంక్షిస్తూ ఆఋషినీటిలోపలి నుండి బయటికి వచ్చి సంతానం కావాలని కాంక్షించి కన్య కొరకు మాంధాత రాజును చేరాడు. ఋషి రాకను తెలుసుకొని ఆ రాజు లేచి అర్ఘ్య పాద్యాదులతో పూజించి కూర్చోబెట్టాడు. రాజుతో సౌభరి ఋషి అన్నాడు. రాజా! కన్యను పొందదలచుకున్నాను. నాకు నీ కన్యను ఇవ్వు. నా కోరికను భంగపరచకు. పనిమీద వచ్చినవారి కోరికలను కకుత్స్థ వంశంలోని వారు కోరిక నెరవేర్చకుండా పంపరు. భూమి మీద ఎందరో రాజులున్నారు. వారి సంతానం ఉన్నారు. కాని యాచకుల కోరికలను తీర్చటంలో వ్రతంగాగల వారిలో ప్రశస్థమైనది మీ కులము. నీకు ఏబదిమంది కూతుర్లు ఉన్నారు. అందులో ఒక కన్యను నాకు ఇవ్వు. నా ప్రార్ధన భంగమౌతుందో ఏమో అనే భయంతో ఉన్నాను. అందువల్ల నేను చాలా దుఃఖంతో ఉన్నాను అని సౌభరి అన్నాడు. పరాశరుడు చెబుతున్నాడు - ఋషి మాటను విని ఆ రాజు ముసలితనంతో ముడుతలు పడ్డ శరీరంగల ఋషిని చూచి జవాబు చెప్పటానికి జంకి, శాపమిస్తాడని భయపడితలదించుకొని ఉన్నాడు చాలాసేపు. సౌభరి అన్నాడు - ఓ రాజా! ఎందుకు చింతిస్తున్నావు? నేనేమీ వినరాని మాట అనలేదు కదా. కన్యను అనగానే ఎవరికో ఒకరికి ఇవ్వాలి. దానితోనే కన్యాదానంతోనే కృతార్థత. మేము పొందరానిదా కన్య అని. పరాశరుడు అంటున్నాడు - ఆ మహర్షి శాపానికి భయపడి, వినయంగా ఈ రాజు ఆ ఋషితో అన్నాడు - మావంశాచారమిది. అమ్మాయి ఎవరిని ఇష్టపడితే, మంచి వంశం వాడైన వరునకు ఆ కన్యనిస్తాము. మీ కోరికమా మనస్సునకు అందరానంతగా ఉంది. ఎట్లాగో మీరు యాచించటం జరిగింది. ఇట్లుంటే ఏం చేయాలో తెలియటంలేదు. అదే ఆలోచిస్తున్నాను అని రాజనగా మహర్షి అనుకున్నాడు. నా మాట కాదనడానికి రాజుది ఇదొక ఎత్తు. వీడు ముసలివాడు. స్త్రీలకు అయిష్టుడు. అందులో కన్యలకు అయిష్టుడని చెప్పాలా? అని ఆలోచించిరాజు ఈమాట అన్నాడని సౌభరి తలచి, ఇట్లా చేస్తానని మాంధాతతో అన్నాడు. | అట్లా అయితే మేం ప్రవేశించటానికి ఆజ్ఞ ఇవ్వండి. అంతఃపురం కావలి వాడుంటే నన్ను కన్యాంతఃపురానికి పంపండి. ఏ అమ్మాయైనా నన్ను వరించవచ్చు. అప్పుడే భార్యగా స్వీకరిస్తాను. లేనట్లైతే కాలం వెళ్ళబుచ్చటం ఆపేద్దాం.


| అట్లా అయితే మేం ప్రవేశించటానికి ఆజ్ఞ ఇవ్వండి. అంతఃపురం కావలి వాడుంటే నన్ను కన్యాంతఃపురానికి పంపండి. ఏ అమ్మాయైనా నన్ను వరించవచ్చు. అప్పుడే భార్యగా స్వీకరిస్తాను. లేనట్లైతే కాలం వెళ్ళబుచ్చటం ఆపేద్దాం. పిదపమాంధాతముని శాపమిస్తాడని భయపడి అంతఃపురపు కావలివాడిని ఆజ్ఞాపించాడు. వానితో ఋషి అంతఃపుర ప్రవేశం చేశాడు. వెంటనే ఋషి తన రూపాన్ని సిద్ధ గంధర్వులందరికన్నా అందమైన రూపం కలవానిగా మార్చుకున్నాడు. సౌభరిని ప్రవేశపెట్టి కావలివాడు ఆ అమ్మాయిలతో అన్నాడు. మీ తండ్రిగారైన రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ బ్రహ్మర్షి నా దగ్గరకు కన్యనివ్వమని వచ్చాడు. నేనన్నాను - మా కన్యలలో ఎవరైనా మిమ్మల్ని వరిస్తే ఆ అమ్మాయి ఇష్టప్రకారం ఇస్తాను అని. దానిని వారు విని ఆ కన్యలందరూ అనురాగంతో ఆనందంతో ఆడ ఏనుగులు మగ ఏనుగు నాయకుణ్ణి ఆశ్రయించినట్లు ఆ ఋషిని నేనంటే నేనని ముందుగా వరించి ఇట్లన్నారు. ఓ చెల్లెలా! నేను ఈతనిని వరిస్తాను అంటే, మరొకతె నేను ఈతనిని వరిస్తాను. ఈతడు నీకు తగినవాడు కాదు అని. మరొకతె దైవం నాకోసమే ఈతనిని భర్తగా చేశాడు. నేను ఈతని కోసం సృష్టింపబడ్డాను. ఇక నువ్వూరుకో అని. మరొకతె నేను ఈతణ్ణి మొదట వరించాను అని ఇంట్లోకి ప్రవేశిస్తూనే నేను వరించాను, దీన్ని పాడు చేస్తావా అని నేనంటే నేనని రాచకన్యలు అతని కొరకు చాలా తగాదా పడ్డారు. ఎప్పుడైతే మునిని ఆ కన్యలు హృదయపూర్వకంగా వరించారో, అప్పుడు ఆ కావలి రాజునకు వినయంగా ఇక్కడి వృత్తాంతాన్ని చెప్పాడు (అందరూ వరిస్తున్నారని).


పరాశరుడు అంటున్నాడు - దానిని విని రాజు ఇదేమిటి, ఇదేమిటి, ఇదెట్లా జరిగింది? అయ్యో, అయ్యో నేను ఏం చేయాలి? నేనేమన్నాను అప్పుడు అని వ్యాకులపడి (చింతించి) ఇష్టం లేకపోయినా ఎట్లాగో రాజు అంగీకరించాడు. తగినట్లుగా వివాహం చేశాడు. ఆమహర్షి ఆకన్యలతో తన ఆశ్రమానికి చేరాడు. అక్కడ ఋషి అన్ని రకాల శిల్పాలను చేసే మరొక సృష్టికర్తలాగా ఉన్న విశ్వకర్మను పిలిచి ఆ కన్యలందరికీ వసతి ఏర్పాట్లు చేయించాడు. వికసించిన తామరపూలు గల కొలనులు, కలహంసలు, లేళ్ళు మొదలగు మధురంగా కూసే పక్షులు, జంతువులు గల తోటలలోని కొనులు, విశాలమైన, దిండ్లుగల చక్కని దుప్పట్లతో గల శయ్యలతో కూడిన మేడలు మొదలైనవి ఏర్పాటు చేయమని చెప్పాడు. ఆతడు అట్లే చేశాడు. రకరకాలైన శిల్ప విశేషములతో నిర్మించి విశ్వకర్మ, ఏర్పరచాడు. ఆ తరువాత ఋషిసౌభరి ఆ ఇళ్ళలో ఎడతెగని ఆనందరూపమైన కుంద అను పేరుగల నిధిని ఏర్పరచాడు. అట్లాగే ఎడతెగని భక్ష్య భోజ్య లేహ్యములు మొదలైన అనుభవింప తగిన వానితో, వచ్చేవారికి తగినట్లు (కన్యలకు), భృత్యులు మొదలైన వారిని రాత్రింబగళ్ళు అన్ని ఇళ్ళలో ఆ రాచకన్యలు భుజింపచేశారు. ఒకసారి ఆ రాజుబిడ్డల మీది మకొద్దీ వాళ్ళు సుఖంగా ఉన్నారా లేక దుఃఖిస్తున్నారా అని తెలుసుకోదలచి ఆ ఋషి ఆశ్రమానికి వచ్చి ప్రకాశించే కిరణముల సమూహంతో మనోహరమైన స్పటికములతో నిర్మింపబడిన మేడల వరుసను, అందమైన తోటలు, నీటి వనరులు గలవానిమా చాడు.


  ఒక భవనంలోకి ప్రవేశించి, తన కూతురును కౌగిలించుకొని, ఆమె కూర్చోమనగానే కూర్చుని కూతురి మీది మవల్ల కళ్ళలో ఆనంద బాష్పాలు రాగా అడిగాడు. ఓ బిడ్డా! ఇక్కడ నీకు సుఖంగా ఉందా? లేక ఇబ్బందిగా ఉన్నదా? మహర్షి నీమీద మగా ఉన్నాడా లేక నిన్ను మరిచాడా? ఎట్లా ఉన్నదని అడుగగా అతనితో కూతురు ఇట్లా అన్నది. నాన్నా ఈ భవనం చాలా బాగున్నది. ఇక్కడ ఈ ఉద్యానవనం బాగున్నది. ఈ పక్షుల కిలకిలా రావాలు, ఈ వికసించిన పద్మములు గల కొలనులు, మనస్సునకు నచ్చిన భక్ష్య, భోజ్య, అనులేపన, వస్త్ర భూషణాదులు, ఈ భోగాలు, మృదువైన పడకలు అన్నీ బాగున్నాయి. నాగృహస్థ జీవితం అన్ని సంపదలతో నిండి ఉన్నది. ఐనా పుట్టిన స్థలాన్ని ఎవరు మరుస్తారు? నీ దయ వల్ల ఇదంతా చాలా బాగున్నది. కాని నాకు ఒక్కటి మాత్రం బాధను కల్గిస్తున్నది. ఏమంటే ఈ మహర్షి నా మీది మతో నన్ను విడిచి వెళ్ళటం లేదు. నా మీథే తితో నా దగ్గరుండి మిగిలిన అక్కలు చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు. అందువల్ల సోదరీమణులు చాలా దుఃఖిస్తుంటారు. అదే నాకు దుఃఖముగా ఉన్నది అని తెలిపింది. రాజు రెండవ భవనంలోకి వెళ్ళాడు. తన కూతురును దగ్గరకు తీసుకొని కూర్చుని బాగున్నావా, సుఖంగా ఉన్నావా అని అడిగాడు. ఆమెకూడా ఈ అనుభవం అంతా బాగా చెప్పింది.నామీది మతో నా ప్రక్కన ఉంటే ఇతర సోదరీమణుల పరిస్థితి ఎట్లున్నదో అని ముందు కూతురు చెప్పినట్లే చెప్పింది. అన్ని భవనాలలో ప్రవేశించి అందరినీ అలాగే అడిగాడు. అందరూ మొదటి అమ్మాయి చెప్పినట్లుగానే సమాధానం చెప్పారు. ఆనందం, ఆశ్చర్యం నిండిన గుండెతో ఒంటరిగా ఉన్న సౌభరిని సమీపించి మహర్షితో గౌరవింపబడి ఇట్లా అడిగాడు. ఓ భగవన్, మహరీ! మీ యొక్క ఈ గొప్ప తపస్సిద్ధి ప్రభావాచూచాను. ఇట్లాంటి ఐశ్వర్యం ఎవరి దగ్గరా మే * డలేదు. ఇదంతా మీ తపః ఫలము అని మహర్షిని పూజించి, అక్కడే కొన్నాళ్ళు ఉండి భోగాలనుభవించాడు. తిరిగి తన రాజ్యానికి వచ్చాడు. కొంతకాలానికి రుషికి ఆ భార్యల యందు నూట ఏబది మంది పుత్రులు కలిగారు. రోజు రోజుకు వారి యందు మ పెరిగి మమత్వం పెరిగింది. నా పిల్లలు తియ్యగా మాట్లాడుతారు. నడుస్తారు. వయస్సు కలవాళ్ళవుతారు. పెళ్ళాడుతారు. వాహ స్తాను. వారికి పిల్లలు కలుగుతారు. నా మనవమ స్తాను అని ఊహించుకోసాగాడు.


అయ్యో! నా మోహమెంత పెరిగింది? నా కోరికలకు అంతం లేదు. పదివేలు లేదా లక్ష సంవత్సరాలైనా తెగవు. కోరికలు తీరినకొద్దీ కొత్త కొత్త కోరికలు పుడుతున్నాయి. పిల్లలు యుక్త వయస్కులైనారు. పెళ్ళాలతో కూడినారు. సంతానం కలిగింది. పిల్లలమా చాను.ఇంకావారిసంతానపాడటానికి ఇంకానా అంతరాత్మకోరుకుంటున్నది. వారిసంతానామాడాలనుకుంటే దాని తరువాత మరో కోరిక కలగవచ్చును. అది నెరవేరినా మరో కోరిక, ఈ కోరికలు పుట్టకుండా ఉండటం వీలవుతుందా? చావు వచ్చేవరకు కూడా ఈ కోరికలకు అంతులేదు. నాకిది ఇప్పటికి అర్ధమైంది. కోరికల మీద ఆసక్తి ఉంటే ఈ మనస్సుకు పరమాత్మతో సంగతి (కలయిక) కలుగదు. యోగ సమాదిలో నీటిలో ఉండే చేపతో సహవాసం చేసిననాడే వెంటనే నశించింది. ఈ సహవాసం వల్లే ఈ పెళ్ళిళ్ళు వగైరా జరిగాయి. ఈ సంసారం వల్లనే నాకీవానికి మమకారం అధికమైంది. ఒక శరీరంలో జన్మించడమే దుఃఖం. ఈ ఒక్క శరీరము ఇప్పుడు ఏబది శరీరాలైంది. అనేకమంది రాకుమార్తెలను వివాహమాడటం వలన ఈ దుఃఖం ఇంకా ఎక్కువైంది. నా సంతానం, వాళ్ళపిల్లలు, మళ్ళీ మళ్ళీ వాళ్ళు వాళ్ళు వివాహమాడటం, ఇదంతా విస్తరించుతోంది. సంసారమనేది (పరిగ్రహము = భార్య;) భార్య అనేది మమత్వాదులకు మారుపేరు. నీళ్ళలో ఉండి చేసిన తపస్సు, దానికి అంతరాయమే ఈ సంసార వృద్ది. చేప సహవాసం వల్ల నాకు సంతానాదులపై కోరిక కల్గింది. దానితో నా తపస్సు దొంగిలింపబడింది. యతులకు సహవాసం లేకుండుటే ముక్తికి దారి. సహవాసం వల్ల అనేక దోషాలు కల్లుతాయి. సంగమముతో యోగారూఢుడైన యోగి కూడ అథః పతితుడౌతాడు. అల్పబుద్దుల గురించి చెప్పాల్సిన పనిలేదు. నా కొరకు భార్య అనే మొసలితో పట్టుబడాలనే బుద్ధితో నేను తిరుగుతున్నాను. ఎప్పుడైతే తిరిగి ఏదోషాలు లేకుండా జనుల దుఃఖూ చి నేను దుఃఖం కలవాణ్ణి కానో అప్పుడు అందరికీ రక్షణను ఇచ్చే, రూపం తెలియరాని అణువు కన్నా అణువైన పెద్ద ప్రమాణము గల తెలుపు, నలుపు రంగులు గల ఈశ్వరులకు ఈశ్వరుడైన వానిని విష్ణువును తమస్సుతోనే ఆరాధిస్తాను. సమస్త తేజస్సంపన్నుడైన, సర్వస్వరూపుడైన అవ్యక్తుడు, విస్పష్టమైన శరీరం గల అనంతుని యందు ఏ దోషాలు లేని నా చిత్తము నిశ్చలముగా నిత్యము నిలువనీ. దానితో తిరిగి పుట్టుక రాకపోనీ. అన్ని భూతముల కన్న అమలుడైన అనంతుడైన సర్వేశ్వరుని కన్న, ఆది మధ్యలు లేనివాని కన్న మరొకటి లేదో అట్టివానిని గురువులందరికీ పరమగురువైన వానిని, విష్ణువును ఆశ్రయిస్తాను అని మహర్షి భావించాడు.


పరాశరుడు చెబుతున్నాడు - అని తన ఆత్మను ఆత్మతో కలిపి (తనకు తానే చెప్పుకొని) ఈ సౌభరి, పుత్రులను, వారి భార్యలను అన్నిటినీ వదలి తన భార్యలతో కూడి వనానికి వెళ్ళాడు. అక్కడ కూడ ప్రతిరోజు వైఖానసులు ఎట్లా ఉండాలో అట్లా ఉంటూ, అన్ని పాపాలను పోగొట్టుకొని, హృదయ పరిపక్వత నొంది, తనలో నిత్యాగ్నులను ఆరోపించుకుని భిక్షుడైనాడు. కర్మ కలాపాన్నంతటినీ వదిలి, తన మనస్సును పరమాత్మ యందుంచి, అనంతుడు, అజుడు, అనాది నిధనుడు (చావు పుట్టుకలు లేని) అవికారి యైన మరణాది ధర్మాన్ని (నిత్యమైన దానిని) పొందాడు. పరమైన, అంతము లేని పరులైనవారు పొందే అచ్యుతుని స్థానాన్ని పొందాడు అని మాంధాత కుమార్తెల సంబంధం వల్ల సౌభరి కథ చెప్పాను అని. ఈ సౌభరి చరితాన్ని ఎవడు స్మరిస్తాడో, చదువుతాడో, చదివిస్తాడో, వింటాడో, వినిపిస్తాడో, ధరిస్తాడో, హృదయంలో ధరింపచేస్తాడో, వ్రాస్తాడో, వ్రాయిస్తాడో, నేర్పుతాడో, బోధిస్తాడో, ఉపదేశిస్తాడో నాకీవానికి ఆరు జన్మల వరకు దుస్సంతతి కలుగదు. అసద్ధర్మము ఏర్పడదు (బుద్ది). వాక్కు మనస్సులు చెడు మార్గంలో వెళ్ళవు. అనేక కారణాలున్నా వాటిపై మమత కల్గదు.


శ్రీ విష్ణుమహాపురాణంలో చతుర్థాంశలో రెండవ అధ్యాయము సమాప్తము