దొరుకునా ఇటువంటి భాగ్యం?

               దొరుకునా ఇటువంటి భాగ్యం?


తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు. ఆయనే కృతయుగములో నారసింహుడు. త్రేతాయుగములో శ్రీ రాముడు. మరియు ద్వాపరములో శ్రీ కృష్ణుడుగ జన్మించి దుష్టశిక్షణ, భక్తరక్షణ గావించిన మహానుభావుడు. మన ఈ కలియుగ ప్రజలను ఉద్దరించుటకైశ్రీ వేంకటేశ్వరుడిగా తిరుమల కొండపై వెలసిన సాక్షాతశ్రీ కృష్ణుడు. ఈయనే ఈ సృష్టికి మూలం. మనం జన్మించినా, జీవించినా, ఏదైనా ఒక కార్యం సాధించినా, మరణించినా, చివరకు గాలి పీలాలన్నా ఆయన దయలేనిది ఏదీ జరగదు. మనమే కాదు, ఆయన ఆజ్ఞ లేనిదే సృష్టిలో అణువు కూడా కదలదు. అలాంటి దేవ దేవుడైన తిరుమటీ వేంకటేశ్వరునికి సేవ చేసే భాగ్యం నా అదృష్టంగా భావించుకొనుచున్నాను. స్వామివారు ప్రసాదించిన ఈ సేవను 2002 సంవత్సరములో ప్రారంభించి ఇప్పటివరకు 17 సంవత్సరములు నిర్వహించుటలో ఎంతో ఆనందాన్ని అనుభవించుచున్నాము. ప్రతి సంవత్సరము శ్రీ వారికి 7 కోట్ల జప సమర్పణ సందర్జముగా నిర్వహించు "నమో వేంకటేశాయ' రథయాత్ర అనుభూతి అత్యంత మధురంగా ఉంటుంది. దీనిలో అంతర్జాగంగా ఉన్న ఒక్కొక్క ఘట్టం ఎంతో మధురంగా, ఆసక్తిగా ఉంటుంది. తిరుమల వారిని 25 రోజులు హైదరాబాద్ నగర పుర వీధులతో పాటు హైదరాబాద్ నుండి తిరుపతి వరకు వివిధ ప్రాంతములలో తిప్పే క్రమంలో ఎంతోమంది స్వామివారి భక్తుల ఇండ్ల వద్దకు స్వామివారి ప్రతినిథిగా వెళ్ళడం, ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా స్వామివారిని సేవిస్తుంటే, వారు అనుభవించే ఆనందాన్ని చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. కొందరు మామూలుగా సేవిస్తే, మరికొందరు పట్టరాని ఆనందంతో గంతులేస్తూ ఉంటారు. టపాకాయలు కాలుస్తూ ఉంటారు. మిఠాయిలు, వివిధ రకాల ఫలహారాలు పంచిపెడుతూంటారుశ్రీ వారిని వారి ఇంటి వద్దకు తీసుకు వచ్చినందుకు నాకు ఎన్నో కృతజ్ఞతలను తెలుపుతుంటారు. కోలాటాలు, పాటలు, నృత్యాలతో స్వామివారిని ఆనందింప చేస్తారు. రకరకాల పూలమాలలతో, వస్తాలతో స్వామివారిని అలంకరించి ప్రార్ధిస్తారు. ఎంతో ఆనందిస్తారు. "నా ఇంటికి వచ్చారా స్వామి", "నన్ను కరుణించారా స్వామి" అంటూ ఆనంద బాష్పాలు కన్నుల వెంట రాలుచుండగా, గగుర్పాటుతో వారు పలికే మాటలు ఎంతో ముద్దేస్తుంది. ఇంకా చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి తిరుపతి వరకు సాగే యాత్ర మరింత ఆనందాన్నిస్తుంది. ప్రతి ఊరిలో మమ్ములను స్వామివారి ప్రతినిథులుగా భావించి వారు పెట్టే భోజనము అమృతమయంగా ఉంటుంది. సాక్షాత్ స్వామివారికే భోజనము పెట్టుచున్నామన్న వారి భావన మాకు మహదానందాన్నిస్తుంది. చివరికి తిరుపతికి చేరి వారి కోరికలను తీర్చుమని ప్రార్థిస్తూ అందరికీశ్రీ వారి కృపను ప్రసాదించుమని ప్రార్ధించే భాగ్యాన్ని పొందుట నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనడం సరికాదు. ఇది కేవలశ్రీ వేంకటేశ్వరుని ప్రసాదం మాత్రమే అని నేను గట్టిగా భావించుచున్నాను. భగవంతునికి, భక్తునికి మధ్య ఉండడమే కాక, ఎంతోమంది భక్తులకశ్రీ వారి సేవాభాగ్యాన్ని ప్రసాదించుట కూడా జరుగుచున్నది. ఒక ప్రాంతానికి రథంతో వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాలలో వారే స్వామివారిని ఇంటింటికి తీసుకువెళ్ళి ఆనందించెదరు. కొంతమందికి స్వామివారి సేవాభాగ్యాన్ని ప్రసాదించిన వారము అగుచున్నాము. ఇలా గత 17 సంవత్సరముల నుండి ఆయన సేవలో, ఆయన భక్తుల సేవలో గడుపుట నిజంగా ఎంతో భాగ్యశ్రీ వేంకటేశ్వరుడు స్వయంగా ప్రసాదించిన ఈ సేవ కొరకై ఆయనకు జన్మ జన్మల వరకు ఋణపడి ఉంటాం. "నమో వేంకటేశాయ'.


 వినా వేంకటేశం న నాథో న నాథః | సదా వేంకటేశం స్మరామి స్మరామి||


                                                     శ్రీ వేంకటేశ్వర పాదసేవకుడు పుల్లగూర్ల సాయిరెడ్డి                                                                                                                   (గోవిందదాసు)