ఇంద్రుని కినుక


అదివే పల్లె. నంద యశోదలుశ్రీ కృష్ణుని పెంచుకుంటూ, బాలకృష్ణుని ఆటపాటలనయా స్తున్న వారి ఆనందాలకు అవధుల్లేవు. గోపాలుర పరిస్థితి కూడా అంతే.త్రే పల్లెలో పెరుగుతున్న కన్నయ్య తమ ఇండ్లలో కూడా అడుగులు వేసుకుంటూ వచ్చి గోపికలను కూడా ఆనంద డోలికల్లో ఊగిస్తున్నాడువ్రే పల్లెవాసులు బాలకృష్ణుని తోడిదే లోకంగా జీవిస్తున్నారువే పల్లె గోపాలకులు ప్రతి ఏటా ఇంద్రునికి పూజ చేస్తారు. తగిన సమయంలో తమ పల్లెలో వానలు చక్కగా కురవాలి. పంటలు పండాలి. చెట్లు అభివృద్ధి చెందాలి. పశువులు ఆరోగ్య సంపదతో వర్ధిల్లాలి అంటూ ఇంద్రుడికి పూజ చేస్తారు ఏటేటా. ఇంద్రుడు వారి పూజకుసంతసించి వారి పాడి పంటలను కాపాడుతూ వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఈ విధంగా ప్రతి ఏటా ఇంద్రోత్సవం జరుపుకుంటూ ఉంటారు


వ్రే పల్లె గోపాలురు. ప్రతిసారీ జరుపుకునే ఇంద్రపూజను ఆ సంవత్సరం కూడా జరుపుకోవటానికి సన్నద్ధమయ్యారు. గోపాలకులు. ఈసారి కృష్ణుడు ఇంద్రోత్సవం చేయొద్దన్నాడు. ఇంద్రునికి బదులు గోవర్ధనగిరిని పూజ చేయమన్నాడు. గోపాలకులు అట్లే ఇంద్రునికి పూజ ఆపి గోవర్ధనగిరిని పూజించారు. ఇంద్రునికి చాలా కోపం వచ్చింది. తన సేవకులను గోపబాలురకు తనకు పూజ చేయమని చెప్పమని పంపాడువే పల్లెకు. ఇంద్రదూతలువే పల్లెకు వచ్చి తమ ప్రభువు తనకు పూజ చేయమని, గోవర్ధనగిరికి చేయవద్దని చెప్పమన్నాడని చెప్పారు. తమ రాజుగారి మాట వినకపోతే చాలా దుష్ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. అయినా గోపాలురు వినకుండా గోవర్ధన పర్వతానికే పూజలు చేస్తామని చెప్పమన్నాడుశ్రీ కృష్ణుడు అని చెప్పారు. అందుకు కోపం వచ్చి ఇంద్రుడి సేవకులు వెళ్ళి ఇంద్రుడికి గోపాలురులు చెప్పినదంతా చెప్పారు. మహేంద్రుడికి చాలా కోపం వచ్చింది. త్రే పల్లె మీద భయంకరమైన వర్షాన్ని కురిపించమని మేఘాలను ఆదేశించాడు. మేఘాలు వర్షిస్తున్నాయి ఆ పల్లెలో.


సీ|| దిక్కరిణీ బృంద మొక్కటయీనిన | పిల్లలు దివిఁ బ్రసరిల్లె ననఁగ గోత్రాచలంబులు చిత్రవాతాహతి | వెసఁ బెల్లగిలి మీద వెలసెననఁగఁ బాతాళమున నున్న బంధుర ధ్వాంతముల్ | వెడలి భానుని మ్రింగ నడరే ననఁగ నిలనాలు చెఱఁగుల జలధులు నలిరేఁగి | కడళుల నభమెక్కఁగడఁగెననఁగ నొప్పి యద్దుర స్తూల పయోధరములు దెసల కడపటం బొడమియాకసము మూసి మెఱుఁగు జోతుకూడికి మిక్కుటముగఁ నొదవేఁ బిడుగులు రాలును నుప్పతిల్లే!


| ఇంద్రుని ఆజ్ఞతో మేఘాలు వర్షిస్తున్నాయి. దట్టమైన మేఘాలు దిక్కుల చిట్టచివర పుట్టి ఆకాశాన్ని కప్పివేశాయి. ఇది దిక్కులనే ఆడ ఏనుగుల గుంపు ఒక్కసారిగా 'కనిన' పిల్లలు ఆకాశమంతా వ్యాపించినట్లుగా ఉన్నది. కులపర్వతాలు అయిన మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాధం, వింధ్యం, పారియాతం తీవ్రమైన తాకిడి వల్ల పెల్లగిలిపోయి ఆకాశంలో వెలిసినట్లుగా ఉంది. పాతాళంలో ఉన్న దట్టమైన చీకట్లు సూర్యుణ్ణి మింగటానికి వచ్చినట్లుగా ఉంది. భూమికి నాలుగు వైపులా ఉన్న సముద్రాలు అలలతో ఆకాశం మీదికి ఎక్కుతున్నట్లుగా ఉంది. ఆకాశం నిండా మెరుపులు పుట్టాయి. పిడుగులూ, రాళ్ళూ పుట్టాయి. ఆ మబ్బుల గుంపు నుండి జడివానా, వడగళ్ళూ పుట్టాయి. అవి తీవ్రమైన గాలులతో కలిసి దట్టంగా పెరిగి బలపడి ఆకాశమూ, భూమీ మధ్య అంతరం ఏమాత్రమూ లేకుండా పిడుగులూ, రాళ్ళూ పుట్టాయి.


ఆ మబ్బుల గుంపు నుండి జడివానా, వడగళ్ళూ పుట్టాయిఅవి తీవ్రమైన గాలులతో కలిసి దట్టంగా పెరిగి బలపడి ఆకాశమూ, భూమీ మధ్య అంతరం ఏమాత్రమూ లేకుండా నిండుగా విజృంభించాయి. |


మ|| ఇది కల్పాంతమొయిమ్మహోగ్రసలిలం బేకార్లవాకారమై పొదజ చెనొయింతలోనజగముల్ పోఁజేసెనోధాతయే య్యది దిక్కెక్కడ సొత్తుయెవ్విధమునం, బ్రాణంబు రక్షించుకోవచ్చెరువుగ లోదవున్ దైవమయంచుగోపనివహం బుద్వేగమొందెన్మదిన్


ఇది ప్రళయ కాలమా! ఈ మహోగ్రమైన నీరంతా ఒకే సముద్రముగా మారి పొంగాలనుకుంటున్నదా? బ్రహ్మ ఇంతటితో లోకాలన్నీ నాశనం చేయ తలచాడా? ఏది దిక్కు? ఎక్కడికి పోవాలి? ఎట్లా ప్రాణాలు రక్షించుకోవాలి? అని గోపకుల గుంపు మనసులో వ్యాకులత పొందింది.


మ.ప. భువనైన ప్రభుఁడైన యింద్రునకుసంపూజ్యంబుగాఁ జేయును త్సవమే నరుఁడనే హరింప ననుత్సాహంబుతోఁ బూజగా న్నవిహీనాత్ముని మేము సైపమనుచున్ శర్రాణ్ణి గోవర్ధనా ద్రి వెసంట్రొక్కెడు నాఁగఁ జుట్టుకొని యథే కించే జీమూతముల్


| లోకాలన్నిటికీ ప్రభువు ఇంద్రుడు. ఆయనకు గౌరవముగా చేసే ఉత్సవము ఇది. దీన్ని హరించే అర్హత నాకుందా? అని ఆలోచించకుండా సంతోషంగా గోవర్ధనగిరి పూజ చేయించుకున్నాడు. ఇటువంటి హీనుణ్ణి మేం సహించం అంటూ ఇంద్రుని ఆజ్ఞతో గోవర్ధన పర్వతాన్ని అణచి వేస్తున్నాయా అన్నట్లుగా మబ్బులు ఆవరించుకుని విజృంభించాయి. పశువుల కోసం పన్నిన వలగా విజృంభించిన వాన జంతు సంతతినంతా నశింపచేసింది. అంతటితో తృప్తి చెందక సమస్త ప్రాణులకూ బాధ కలిగిస్తూ చెలరేగింది ఆ వాన.


ప. కులిశనిపాతదాహమునఁ గొన్ని నశింపఁబ్రచండవాయువుల్ బలువిద్రే యఁ బెల్లగిలి భగ్నములై చెడఁగొన్ని వెల్లువల్ బలియుటఁ బీడితంబు లయిపాడరఁ గొన్ని యశేష భూరుషా వళులకుఁ దీవ్ర దుఃఖదశ వచ్చే నెటిం దదరణ్య భూములన్


ఆసమయమున పిడుగులు పడి కాలి కొన్ని చెట్లు నశించాయి. ప్రచండమైన గాలులు బలంగా తాకడం వల్ల భూమినుండి పెళ్ళగిల్లి విరిగి కొన్ని చెట్లు నశించాయి. నీటి ప్రవాహవేగం చేత కొన్ని చెట్లు నశించాయి. ఈ విధంగా ఆ అరణ్య భూముల్లో అనంతమైన వృక్షరాశికి గొప్ప దుఃఖస్థితి కలిగింది. ఆ వాన అంతటితో ఆగిపోకుండా యింకా తీవ్రమైంది.


ప. నిడుజడి దాఁకియెందుఁ జననేరకయాఁకలిఁగ్రుస్సి చెట్టుపల్ సడలఁ గులాయ మధ్యమున శాఖలసందున నిల్వలేకయు గడువుగఁ బల్మజుం జఱచుగాడ్పునఁదూలివనంబుపక్షులె య్యడఁబడి చచ్చి తేలెఁ గడు నేపెసలారు పొలంపు వెల్లువన్


అంతటితో వాన విడువకుండా కురుస్తోంది. ఆ అడవిలోని పక్షులు ఎక్కడికీ వెళ్ళలేక ఆకలితో కృశించి రెక్కల జారగా గూళ్ళలోను, చెట్ల కొమ్మల సందుల్లోనూ నిలువలేక, పలుమార్లు చాలా బలంగా తాకుతున్న గాలి దెబ్బకు తూలిపోయి ఎక్కడ చూస్తే అక్కడ చచ్చిపడి నీటిప్రవాహంలో తేలుతున్నాయి.


గిరికుహర స్థితంబులగు కేసరులున్ జడిఁ బేర్చునప్పయో ధరములగర్ణలం బేగడి దందడి నున్నవి యున్న చోనయ రక్షించుకోవచ్చెరువుగ గుండియల్పగిలి చేష్టిత మేమియు లేకయుండెన ప్పరుసని వాననన్యమృగపజులు మగుట చెప్ప నేఁటికిన్


జడివానలో చెలరేగిన మేఘ గర్జనకు భయపడి ఆశ్చర్యకరంగా కొండగుహల్లోని సింహాలు కూడా గుండెలు పగిలి కదలకుండా ఎక్కడివక్కడ నిలబడి పోయాయి. ఆ భయంకరమైన వానలో తక్కిన జంతువులు నశించాయని చెప్పడం ఎందుకు? అలాంటి జడివానకు గోకులమంతా అతలాకుతలమైంది. పశు పక్ష్యాదులు, జంతు జాలమంతా నశించిపోతోంది. ఆ అతివృష్టికి పైరులన్నీ నీటిలో మునిగాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రీ పల్లె వాసులంతా ఆకలిదప్పులతో, కంటినిండా నిద్ర లేక అల్లాడిపోతున్నారు. చలిగాలులకి పసిబిడ్డలు ఏడుస్తున్నారు. సూర్యుని ముఖోసి ఎన్నాళ్ళయిందో అన్నట్లున్నారు ఆటే పల్లె వాసులు. ఈ వాన తగ్గే మార్గమే లేదా? మేమెలా బతకాలి? ఆకలి తీరే దారే లేదా? ఏమిటీ అకాల వాన? అంటూ ప్రశ్నించుకుంటున్నారు వారి వారి ఇండ్లలోని గోప గోపికలు. ఈ అతివృష్టికి కారణం ఇంద్రునికి ఉత్సవం చేయనందుకే అని వారికి బోధపడింది. తమ దైవం తప్ప తమకు దిక్కు లేదనుకుంటూ మార్గం ఆలోచిస్తున్నారు. గోపికలు ఆకలితో అలమటిస్తూ ఈ జడివాన తగ్గే మార్గమే లేదా అనుకుంటున్నారు. ఇంద్రుడి ఆజ్ఞతో మేఘాలు ఇరువది | ఒక్కరోజు వర్షించాయి. ఆ వర్షమునకువే పల్లె గోపాలురు తాళలేక ఇక మనకు మన కృష్ణుడు తప్ప మనల్ని కాపాడేవారు లేరనుకుని కృష్ణుని శరణు వేడసాగారు ఇలా -


శ్రీ తరుణీ హృదయ స్థిత! పాతక హర! సర్వలోకపావన! భువనా తీత గుణాశ్రయ! యతివి ఖ్యాత సురార్చితపదాబ్ద! కంసవిదారీ!


పాతకములను హరించేవాడా! సర్వలోక శరణ్యా! దేవతలచే పూజింపబడేవాడా! సకల సుగుణ సంపన్నా! గోపికా హృదయ నివాసా! కంసాంతకా! కృష్ణా! మమ్ము గావవే! దీనావస్థలో ఉన్నాము పరమేశా! అంటూ ఇంకా వేడుకుంటున్నారీ విధంగా


ప. జలజభవాదిదేవమునిసన్నుత తీర్ధపదాంబుజాత! ని ర్మల నవరత్న నూపురవిరాజిత! కౌస్తుభ భూషణాంగ!యు జ్వలతులసీకురంగమదనాసనవాసిత దివ్యదేహశ్రీ నిలయశరీర! కృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా! |


| బ్రహ్మదేవుడు, దేవతలు, మునులు మొదలైనవారిచే కీర్తింపబడినవాడా కౌస్తుభము మొదలైనవి ధరించినవాడాతులసీమాల ధరించిన దివ్యదేహము గలవాడా! లక్ష్మీదేవికి హృదయస్తానమైన శరీరము గలవాడా! భూదేవిని ధరించినవాడా! సూర్యచంద్రులను నేత్రములుగా గల ఓకృష్ణామమ్ము రక్షింపవే అంటూ ఇక తమ ప్రాణములు నిలువలేవని ఆశలు విడిచి చివరిగాకృష్ణస్వామికి దండంబులు పెడుతున్నారు గోపవాసులు.


సీ. దండంబు యోగీంద్రమండల నుతునకు దండంబు శార్ఙ కోదండునకును దండంబు మండిత కుండలద్వయునకు దండంబు నిష్ఠురభండునకును దండంబు మత్తవేషండునకు దండంబు రాక్షస ఖండునకు దండంబుపూర్ణేందుమండల ముఖునకు దండంబు తేజః ప్రచండునకును తే. దండమద్భుతపుణ్య ప్రధానునకును దండముత్తమవైకుంఠధామునకును దండమాశ్రిత రక్షణ తత్పరునకు దండ మురుభోగి నాయకతలునకును! పరమపురుష! దుఃఖభంజన! పరమేశ భక్తవరద! కృష్ణ! భయవిదూర జలరుహాక్ష! నిన్ను శరణంబు వేడెద | మభయమిచ్చి కావుమయ్య మమ్ము!


పరమపురుషా! కృష్ణా! పరమేశా! భక్తవరదా! దండం యోగీంద్ర మండలస్తుతా! దండంబు వేదండ రక్షకా! దండంబు రాక్షసాంతకా! వైకుంఠధామా! దండంబు ఆశ్రిత రక్షకా దండంబు! శేషశయనా! నీకు దండంబు దండంబు అద్భుత పుణ్యప్రధానా! పూర్ణేందు చంద్రముఖుడా నీకు దండంబు. యశోదాత్మజా! నీకు దండంబు! దేవకీ నందనా మమ్ముగావవే! నీవే దిక్కు నీ దిక్కు దక్క వేరే దిక్కు లేదు మాకు. దిక్కు లేకున్న మాకు నీవే దిక్కుకృష్ణా! అంటూ వేడుకున్నారు గోకులాంగనలు, గోపాలకులు.


అంత కృష్ణుడు గోపాలకుల మొర విన్నాడు. ఏడేండ్ల కన్నయ్య గోవర్ధనగిరిని ఎత్తి ఒక వేలిపై గొడుగువలె పట్టాడు. రా తల్లీ! రమ్ము తండ్రీవ్రతలు గోపకులు రండు రండు ఈ ఛత్రము కిందకు రండు అంటూ పిలిచాడు. అంత అందరూ గోవర్ధనగిరి కిందకు వచ్చారు. ఈ విధంగా ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు కృష్ణుడు గోవర్ధనగిరిని ఆపాడు. గోపవాసులు కృష్ణుని సన్నిధిలో భయము మరచి హాయిగా ఉన్నారు. అంత గిరిభేది (ఇంద్రుడు) విసిగి వేసారి కృష్ణ చరితంబులు విని వెఱఁగుపడి విఫల మనోరథుండై మేఘంబుల మరలించుకొని చనియె. అంత ఆకాశము విద్యోతమాన ఖద్యోత మండలంబగుట విని (ఆకాశము సూర్యునితో ప్రకాశవంతమయినది) గోపాలకులు సంతసించారువే పల్లెవాసులారా! మీరు మీ మీ నిజస్థానములరిగి సుఖజీవనము సాగించుడు అనిశ్రీ కృష్ణుడు పలికెను.త్రే పల్లెవాసులు తమ తమ స్థావరముల కేగుచు నందుడితో ఇలా అంటున్నారు. ఓ నందా! గోపవల్లభా! నీ కొడుకు చేసే పనులు మానవులకు శక్యమా! నీ కుమారుడు మాధవుడు! మనల్ని కాపాడాడు అంటూ కృతజ్ఞతలు చెప్పారు. ఇంద్రుడు తమ్ముడి మహిమలు విని తమ్మునిపై పల్లె వాసులపై కినుక వీడాడు. కృష్ణుని అమరావతికి గొనిపోయి సకల మర్యాదలు చేశాడు..