శ్రీ వేంకటేశ శరణాగతి దీక్ష


స్వామీ! నీ వలన ఇష్ట ఫలములను పొంది తృప్తి చెందు నీ భక్తులనయా చి ఇతరులు కూడా నీ దాసులగుటకై త్వరపడుచున్నారు. మా కోర్కెలను నీవు వేగముగ తీర్చుచున్నావను అసూయతో, తాము కూడా నీ అనుగ్రహమును పొందుటకై దేవతలు సైతము నరజన్మనెత్తుటకు తహతహలాడుతున్నారు. | సనక సనందనాది మహర్షులు, అగస్త్య వసిష్ణాది ఋక్షీ షులు, వాయుదేవుడు, అంజని వంటి మహితాత్ములు నిన్ను పొందుటకై నీ శరణుజొచ్చిరి. శ్రీ వేంకటేశా! గురుని ఆజ్ఞపై నీ కొండచేరి నిన్ను తలచి తపమాచరించిన ఫలముగా దశరథునికి పుత్రునిగా రామునివై అవతరించి మమ్ము తరింపచేసితివి. స్వామీ! "ఎవ్వరు నీ పాదపద్మములపై మనస్సును ఉంచి, నీ నామ రూపములను శ్లాఘింహ , నీ దివ్య లీలా విశేషములను మా , గానము చేయా , ధ్యానము చేయా దాసులుగా నిలిచెదరో వారికి నీ పరమపద ప్రాప్తి తథ్యమ"ని బ్రహ్మ చేసిన స్తోత్రము మాకు అవశ్యము ఆచరణీయము. శ్రీ నివాసా! మాకు సద్బుద్ధినీ, వివేకమునూ ప్రసాదించుము. దుస్సంగము నుండి మమ్మురక్షింపుము.


శ్రీ వేంకటేశా! నీ ఇచ్ఛకు విరుద్ధము గాని ఇచ్చను మాకు ప్రసాదింపుము. నీకు ఇష్టము కానిది మాకునూ అనిష్టమగునట్లు మమ్ము దీవించుము. నీవు తప్ప మమ్ము కాచువారు లేరు. నీ యెడల దైన్యత, నీ కొరకు సమర్పణ, నీ యెడల నిరంతర ప్రార్ధన, నీవారితో నిత్యము నెయ్యము - మాకు ఎడతెగని బంధమై నిలుచునట్లు మమ్మనుగ్రహించుము. స్వామీ! మాకు ఇష్టలాభమును, అనిష్టనాశనమును కల్గించేదుకే నీవు శంఖ చక్రములను ధరించితివి. అందరికీ నీ పాదద్వయమే శరణమని ఒకచేతూ చవు , నిన్ను శరణు జొచ్చినవారికి ఈ సంసార సాగరము మోకాలి లోతేయని మరో కచేత తెలుపుతూ నిలుచునశ్రీ వేంకటేశా! నీ నామస్మరణమే మాకు రక్ష. రాజ్యభ్రష్టుడైనశంఖణచక్రవర్తి ఆరునెలలునీకొండపైనిష్ఠతో తపమాచరించినందుకుఫలముగా అతనికి నీ దివ్యదర్శనమును, రాజ్యప్రాప్తిని అనుగ్రహించితివి. ఆశ్రితవత్సలా, నీ దయను ఎన్నివిధముల కొనియాడగలము? . | "వేంకటాచలపతీ! అని నోరార నిన్ను పిలిచిన చాలును. మా పాతకములన్నియు పటాపంచలగును. నాలుగు వేదములు చదివినవారు కూడా నిన్ను భక్తితో కొలుచువారికి సాటి రారు కదా! పరమ పావనుడవైన నీ సాహచర్యము కోరి శంకరుడు నీ కొండ దిగువన నిన్ను ధ్యానిస నిలిచె, చతుర్ముఖ బ్రహ్మ సమస్త దేవతలతో కలిసి నీ కొండపై నీకపీ తికరముగ నీకు మహోత్సవము జరిపి. నాటి బ్రహ్మూత్సవము నేటికినీ మమ్ము బ్రోచెడి దివ్యోత్సవమే. | వరాల రాయుడవైన ఓ వేంకటేశా! కరుడూ పుటలో సాటి లేని మేటి స్వామివి నీవు. నీ కొండపై రంగదాసుడు చేసిన చిన్నిసేవకు మురిసి, తొండమాన్ చక్రవర్తిగా మరుజన్మనిచ్చి తరియింపచేసితివి. నీ భక్తప్రియత్వమునకు లేరు వేరెవరు సాటిలేరు. ఈ కలియుగమ్మున మమ్ము కాచుటకై పద్మావతీదేవిని కళ్యాణమాడి ఆకాశరాజుకు అల్లుడవైతివి. నీ కొండపై కొలువు తీరుటకు గాను, తొండమానునికి చెప్పి మూడు ప్రాకారములతో, రెండు గోపురములతో, ఏడు ద్వారములతో "ఆనందనిలయము"ను అమర్చుకొంటివి. తొండమానునికి రక్షగా శంఖు చక్రములనిచ్చిన నీ వాత్సల్యమునకివే మా శతకోటి వందనములు.


| భక్తసులభుడవైన నీ అనుగ్రహమునకు పరవశించి, అది అంతయు తన గొప్పగా తలచి, తనంత భక్తుడు నీకు లేడని అహంకరించె ఆతొండమానుండు. బంగారు, తులసి ఆకులతోడ అతను చేసిన పూజను తిరస్కరించి, మట్టి తులసిని నీవు మతో స్వీకరించితివి. కడు పేదవాడైన కుమ్మరి భీముండు కుండలు చేయుచు నిన్ను తలచి నీకర్పించిన మట్టి తులసియే బంగారు తులసికన్ననీకు బపట్ర తియని తొండమానునికి తేల్చి చెప్పితివి. |_బుద్దివచ్చిన ప్రభువు చుచుండగనే కుమ్మరి భక్తుని ఇంట కూడు కుడిచి, పరమ పదమునకతని భార్యా సమేతముగా పంపినావు. నాటినుండి నీవు "తోమని పళ్ళాలవాడివై" ఎల్లలోకములకునీ సౌలభ్య గుణమును చాటుచుంటివి. | రాజు, పేద అను తారతమ్యమూడక, నిష్కల్మషముగ నిన్ను మొక్కిన వారే నీకు ప్రియులని చాటి చెప్పితీ వేంకటేశా! నీకుశరణు! శరణు!! | బ్రహ్మాది దేవతలను మొదలుకొని కుమ్మరి భీముని వరకు తరింపచేసినశ్రీ వేంకటేశా! మమ్ము బ్రోచుటకై ఈ కొండపై నిలిచిన నీ మాతిశయమునకివే మా శతకోటి ప్రణామాలు.


శ్రీవేంకటేశ శరణాగతి - 3 తిరుమల నంబి నిష్ట! శ్రీ వేంకటాద్రి యందు అర్చావతారమున దివ్యమంగళ విగ్రహముతో మమ్ము తరింపచేయుటకై అవతరించిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా ! నీకు శరణు! ఓ నివాసా! నీ పాదముల యందు మా భక్తి స్థిరముగా ఉండునట్లు అనుగ్రహించుము. ఓ అలమేలు మంగపతీ! వేంకటరమణా! ఈ జగత్ కుటుంబమును పోషించుచున్న తండ్రివి నీవు. నీవే మాకు తల్లివి. గురుడవు, సఖుడవు, సోదరుడవు, పాలకుడవు. సమస్తమూ నీవె. మాకు ముందు, వెనక, ప్రక్క, పైన, క్రింద, లోపల, బయట అన్నివైపులా నిలిచి మమ్ముకాపాడుము. శ్రీ మన్నారాయణా! మేము నీ దాసులము. నీతో నిత్య సంబంధము కలవారమై నీ పైననే ఆధారపడి జీవించునట్లు మమ్ము ఆశీర్వదింపుము. ఆశ్రిత వత్సలా! అభయప్రదాతా! నిన్ను చేరి కొలుచు తీరెట్టిదో తెలుపు భక్తవరేణ్యుల గాథలు సదా మా నాలుకలపై నడయాడు శక్తిని మాకు ప్రసాదింపుము. నీశ్రీ రంగక్షేత్రమున నీ భక్తులకెల్ల పెద్ద దిక్కుగ నిలచిన యామునాచార్యులు నీపై గల మాతిశయముతో తన శిష్యుడు తిరుమలనంబితో కలిసి నీ కైంకర్యసేవలో పాల్గొని తరించిన విధము ఎల్లవారలకూస్పూర్తిదాయకము..


గురువాజ్ఞపై ఏడుకొండలపై నిలిచిన నీకు కైంకర్యము చేయు వ్రతదీక్ష చేపట్టి విద్వాంసుడైన ఆతిరుమలనంబి.నీ కొండపైనున్న దుర్భరమైనచలినంబిని ఇసుమంతైననుచలింపచేయలేకపోయె. భయంకరమైన కాలసర్పాలు, కీటకములు, క్రూరమృగములు ఆ భక్తుని భయపెట్టలేకపోయె. నీ కీర్తనలె ఆహారముగ, నీ సేవయే ఊపిరిగా నంబి నడత నీ తి కలిగించే. పుష్ప ప్రియుడవైన నీకు పూలమాలలు కట్టి, నీ వైభవమును చాటు పాటలు పాడునతడు. అపర భగీరథుండై పాపనాశనము నుండి నీకు అభిషేక గంగను తెచ్చునతడు. నిష్టగా ఏండ్ల తరబడి నీకు వెట్టియై ఏమరపాటు లేక నిత్యము నిన్ను సేవించుచున్న తిరుమలనంబి భక్తి తత్పరతను మాకు చాటుటక వేంకటేశా! నీవు బోయవైతివి కదా! పాపనాశనము నుండి ఎప్పటివలె నీకు నీరు తెచ్చుచున్న నంబిని బోయరూపమున నీవు అడ్డగించితివి. నీరడిగిన నిన్ను నిరాకరించి, నీ గుణగానము చేయుచు ముందుకు నడిచే ఆ నంబి. అలనాడు వెన్నదొంగపై గొల్లభామల కుండలకు చేసిన సత్కారము కడు చతురతతో నీవు నంబి కుండకు చేసితివి. "మందభాగ్యుడా! ఎంత పని చేసితివి? భగవదపచారము నీకు తగునా" యని నంబి నిన్ను నిగ్గదీసే. కొంటెనవ్వు నవ్వి, శరాఘాతంబుతో ఆకాశగంగను సృష్టించి 'అదియే నీ స్వామికి తగిన నీర'ని నంబితో పలికి మాయమైతివి. అంతటితో ఆగక, నీవు అర్చకుని ఆవహించి, నంబిభక్తిని చాటి ఆకాశగంగను నీకు ఉదకముగ ప్రకటించుకొంటివి. ప్రతి ఏటా నీవు జరిపించుకొను "ఆకాశగంగ తీర్ణోత్సవము" తిరుమలనంబిపై నీకున్న మ ఫలితమే గదా! 'తాతా'యని నీచేత పిలిపించుకొన్న తిరుమలనంబిదే అదృష్టము. రామానుజునకుశ్రీ మద్రామాయణ రహస్యములు బోధింప నంబి ఒక సంవత్సర కాలము ప్రతిదినము కొండ దిగువకు పోయివచ్చె. నీ సేవ అనంతరము నంబి కొండదిగి శిష్యునకు చెప్పిన అర్థము చెప్పకుండా 18 మార్లు రామాయణ రహస్యార్థములను రంగరించి పె.. | మధ్యాహ్న సమయమున నీ సేవకు దూరమైతినన్న నంబి చింతను పారద్రోలుటకై వారి అధ్యయన స్థలమునందే నీ దివ్య పాద' చిహ్నములను మాకు భక్తి ప్రవృద్ధి దాయకములగునట్లుగా దర్శింపచేసితివి.


ఓ లక్ష్మీరమణా! జీవితాంతము నీ సేవతోనే తరించిన ఆ తిరుమలనంబిపై నీవు పిన అనుగ్రహ దృష్టిని మాపైన కూడా ప్రసరింపచేయుము. ఓ గోవిందా! అజ్ఞానముతో, అలసత్వముతో, మూర్ఖతతో, అవివేకముతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములతో విచ్చలవిడిగా చపలత్వముతో సంచరించుమా అంతఃకరణములను నీ స్వాధీనము చేసుకొనుము. మా చెడ్డ తలంపులను నాశనము చేసి, నీ ధ్యానము నందు ఏమరుపాటు లేనివిధముగ మమ్ముదీవింపుము. స్వామీ! నీవు జ్ఞానానంద స్వరూపుడవు. మా దోషములను మన్నించి నిన్ను చేరు దాదపి కాపాడుము. "గోవిందా! గోవిందా" యని నీ గుణగానము చేయు మనస్సును మాకు అందజేయుము.