SHREE MAHA BHAGAVATHAMU



సజ్జనులను సంరక్షించావు. ఇక వైకుంఠనగరానికి వేంచేయమని ప్రార్థించటానికే మేమందరం వచ్చాము" అని బ్రహ్మాది దేవతలు పలుకగానే వారి మాటలను అంగీకరించిశ్రీ కృష్ణుడు తప్పక వస్తానని వారిని సంతోషపరిచాడు. "దేవతలారా! కాకపోతే ఒక్కమాట. యాదవులకు అన్యోన్య వైరాన్ని కల్పించి, వారినందరినీ హతం చేసి, భూభారాన్ని అణచివేసి వెంటనే వైకుంఠానికి వస్తాను. మీరు మీ మీ లోకాలకు సంతోషంగా వెళ్ళండి"అనీకృష్ణుడు చెప్పగానే బ్రహ్మాదులందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. | శంకరుడు, బ్రహ్మదేవుడు, సురలు వెళ్ళిపోయిన కొద్ది రోజులకుద్వారకానగరంలోఅనేకమైనఅపశకునాలువాటిల్లడం చూసినశ్రీ కృష్ణుడు యాదవుల నందరినీ పిలిచి ఉత్పాతాల గురించి చెబుతూ వారు చేయవలసిన పనిని నిర్దేశించాడు. "యాదవులారా! మీరీ విషయాలనన్నిటినీ గమనించారా? బంగారు మేడలలో పగటిపూట - కాకులూ, గుడ్లగూబలూ అనేక రకాలుగా, చెడుకలగబోతోందని సూచిస్తున్నట్లు ఏడుస్తున్నాయి. గుఱ్ఱల తోకలయందు అగ్నిజ్వాలలు చెలరేగుతున్నాయి. రాత్రిపూట చిలుకలు, గోరువంకలు వికృత స్వరాలతో పెద్దగా అరుస్తున్నాయి. ఈ వింత వినండి. ఒక జంతువుకు మరో జాతికి చెందిన జంతువు పుడుతోంది. పౌరుల గృహాలలో ఉల్కలు ఉదయిస్తున్నాయి. సూర్యబింబానికి ఆవిరిరంగు క్రమ్ముతోంది. ఇటువంటి చెడులు ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. కనుక మీరెవరూ ఇక ద్వారకలో ఉండవద్దు. నా మాట విని మీరంతా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ద్వారకను వదలి ప్రభాస తీర్ధానికి వెళ్ళి అక్కడ ఉండండి"అశ్రీ కృష్ణుడు ఆనతీయగానే యాదవులు తమ తమ చతురంగ బలాలతో, భార్యాపుత్రులతో, బంధుమిత్రులతో, ప్రభాస తీర్ధానికి వెళ్ళిపోయారు. కాశ్రీ కృష్ణునికి ప్రియభక్తుడు, జ్ఞాని అయిన ఉద్ధవుడు భవిష్యత్తును తన మనస్సులో ఊహించుకొని -శ్రీ కృష్ణా! లక్ష్మీనాథాశ్రీ హరీ! దీనజనరక్షకా! మాకు నీవే కదయ్యా దిక్కు! దేవా! నీవు యాదవులందరినీ నశింపచేసి వెళ్ళిపోతే మేమే విధంగా బ్రతకగలం చెప్పు. తండ్రీ! నీతో కలిసి స్నానపానాలు చేశామే! కలిసి భోజనాలు చేశామే! నీతోటే పడుకొని ముచ్చట్లు చెప్పుకొన్నామే! ఈ విషయాలన్నీ ఎలా మరచిపోగలం? నీవు లేకుండా ఎలా జీవించగలం?" అని బాధా తపుడైనాడు.


శ్రీకృష్ణుడు ఉద్ద నికి పరమార్థాన్ని ఉపదేశించటం:


అప్పుడట్రీ కృష్ణుడు ఉద్దవుమా సి "ఉద్దవా! నీవు వేదన చెందకు. బ్రహ్మ మొదలైన దేవతలు వచ్చి ప్రార్థించటం వల్ల దుష్టజన నాశనం చేసి, భూభారాన్ని పోగొట్టాను. ఒక విషయం చెబుతాను విను. నేటినుంచి యాదవులకు దుర్దశ ప్రారంభమవుతోంది. నేటి ఏడవ రోజున సముద్రుడు ద్వారకా నగరాన్ని మొత్తం ముంచివేస్తాడు. ప్రభాస తీర్థంలో ఉన్నా యాదవులందరూ నశించక తప్పదు. ఆ తరవాత కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలో మనుషులందరు ధర్మహీనులుగా, అన్యాయపరులుగా, మందమతులుగా, ఆచార రహితులుగా, క్రోధోన్మత్తులుగా, అల్పాయుష్కులుగా, రోగపీడితులుగా, నాస్తికులుగా జీవిస్తారు. వారు ఏ పని ఆరంభించినా, వారికా ఫలం దక్కదు. పైగా వారు ఒకరినొకరు మెచ్చుకోకుండా, సఖ్యత లేకుండా వైరదృష్టితో ఉంటారు. కాబట్టి ఉద్దవా! నీకు ఒకటే చెబుతాను. మిత్రులని, బంధువులని ఎవరిపట్లా మానుబంధాన్ని పెంచుకోకు. త్రుంచివేయి. ఇంద్రియ సౌఖ్యాల పట్ల మోహం వదిలేయి. భూమండలంలో ఉన్న పుణ్యతీర్థాలలో స్నానం చేసి పవిత్రాత్ముడివి కా. మనస్సుకు, వాక్కుకు, కంటికి, చెవికి, నాసికకు మెప్పు కలిగించే వస్తువులన్నీ నశింపచేసేవే అని తెలుసుకో. పురుషుడు వివిధ పదార్ధాలను, ధనాదులను ఆర్జించి కామ మోహాలకు లోనై తనలోని గుణదోషాలతో కొట్టుకుపోతుంటాడు. కాబట్టి ఉద్దవా! మావటీడు మదపుటేనుగును బంధించే విధంగా నీవు ఇంద్రియాలను, మనోవికారాలను అదుపులో పెట్టుకోవాలి. భార్యాపుత్రులన్నా, ధనమన్నా ఆసక్తి కలిగి ఉండకు. సుఖదుఃఖాలు ఎప్పుడు వాటిల్లినా వాటిని ఒక్క సమంగా భావించి ప్రవర్తించాలి.


విశ్వమంతా పరమాత్మ చేతనే అధిష్టించబడినదని గ్రహించు. మాయ ఆత్మకు వశమై ఉంటుందని తెలుసుకో. జ్ఞానవంతుడవై, విజ్ఞానవంతుడవై ఆత్మానుభవంతో సంతృప్తి చెందు. విశ్వాన్ని నన్నుగా భావించి నడుచుకో" అని పరమార్థాన్ని విపులంగా బోధించాడశ్రీ కృష్ణుని పలుకులు విన్న ఉద్ధవుడు భయభక్తులతో వినమ్రుడై ఆ భగవానుడికి నమస్కరించాడు. పరమాత్ముని చూసి "మహాత్మా! సన్యసించినవారి నియమ నిష్టలు చాలా జటిలమైనవి. ఆ జీవితం చాలా కష్టసాధ్యమైనది. పామరులు సన్యాస లక్షణాలను అవలంబించలేరు. సంసారంలో మునిగి తేలేవారు నీ మాయ చేత భ్రాంతులై కొట్టుమిట్టాడుతుంటారే! అటువంటి సాంసారికులు సంసార సముద్రాన్ని ఎలా దాటగలరు? ఎలా ముక్తి పొందగలరు? నేను నీ పాదసేవకుడను. నా మీద దయతో నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి నన్ను కృతార్ధుణ్ణి చేయమని ప్రార్థిస్తున్నాను. చివరకు బ్రహ్మాది దేవతలు కూడా బాహ్య విషయాల పట్ల భ్రాంతితో తిరుగుతుంటారే! నీ భక్తులైన పరమ భాగవతులు మాత్రమే ఆ మాయను నిరసించగలుగుతారు. దేవా! గృహిణులకు గాని, గృహస్థులకు గాని, యతులకుగానినీనామస్మరణ ఒక్కటేమోక్షాన్ని ప్రసాదించే దివ్య మార్గం. పరమాత్మా! నీ పాద పద్మాలను ఆశ్రయించి నిన్ను శరణు వేడుతున్నాను. నాపైన కరుణ వహించు" అని పాదాక్రాంతుడైన ఉద్దవుని మీద కృపతోశ్రీ కృష్ణుడు అతడే విధంగా ప్రవర్తించాలో తెలియజెప్పాడు. "ఉద్ధవా! ఆత్మకు ఆత్మే గురువని అర్థం చేసుకో. చెడు మార్గాలలో పయనించక, సన్మార్గ వర్తనతో పరమపదమైన నా నివాస స్థానానికి చేరుకో. సర్వశక్తి సంపన్నుడనైన నన్ను సాంఖ్యయోగులు పరమ పురుషుడనని భావించి ధ్యానిస్తుంటారు. మరొక విషయం. ఒక కాలు, రెండు కాళ్ళు, మూడు కాళ్ళు, నాలుగు కాళ్ళు కల జీవ సమూహంలోను, అసలు కాళ్ళు లేని జీవరాశిలోను రెండు కాళ్ళతో నడిచే నరులు ఉత్తములు. ఆ మనుష్యులలో నిరంతరం ధ్యానముద్రలో నిలిచే యోగీశ్వరులు ఉత్తమోత్తములు. వారిలో అనుమానంతో కొట్టుమిట్టాడేవారు నన్ను తెలుసుకోలేరు. నేను సత్త్వగుణం చేత తెలియబడేవాడిని. తమ మనః పద్మాలలో జీవాత్మను పరమాత్మను ఒకటిగా భావించి, శంఖ చక్రాది వివిధాయుధాలతో ప్రకాశించేవాడిగా నన్ను స్థిరంగా నిల్పుకొని ధ్యానించేవారు పరమయోగీంద్రులు. వారే పరమ జ్ఞానులు. నీకు ఒక ఇతిహాసం కూడా చెప్పి పరమార్థాన్ని బోధపరుస్తాను విను" అని కృష్ణుడు ఇంకా చెప్పసాగాడు.


అవధూత - యదు సంవాదము: "మిత్రమా! ఒకనాడు యదురాజు వద్దకు ఒక యోగి వచ్చాడు. ఆయోగీంద్రుడు తన యోగశక్తి చేత అన్ని దిక్కులలోను "మహారాజా! ఇరవై నలుగురు జ్ఞానమూర్తులు నాకు గురువులై, జ్ఞానబోధ చేశారు. వారి బోధనల వల్లనే నేను విజ్ఞానినైనాను" అని యోగి చెప్పడంతో తన మనసులో ఉన్న ప్రశ్నలను ఆయన ముందు పెట్టాడు యదువు. "మహాత్మా! నా సందేహాన్ని మీరే తీర్చగలరు. శరీరధారి లోభ మోహాది అరిషడ్వర్గాన్ని వీడి భగవంతుడైన జనార్ధనుని ఏవిధంగా చేరుకోగలుగుతాడు? వివరంగా చెప్పండి. ధన్యుడి నౌతాను" యదువు వేసిన ప్రశ్నలకు సునాయాసంగా సమాధానాలు చెప్పసాగాడు - విజ్ఞాన నిధి అయిన యోగి పుంగవుడు. "మహారాజా! దేహి కర్మల నుంచి విముక్తుడు కావాలంటే ఏమేం చేయాలో చెబుతాను. శ్రద్దగా విని, ఆచరించు.


"పరధన పరదార పరదూషణాదుల పరవస్తు చింత తా పరిహరించి ముదిమిచే రోగములుదయింపకటమున్న తనువు చంచలతను తగులకుండ చలతచే పొదలకయటమున్న - శ్లేష్మంబు గళమున చేరకుండ శక్తియుక్తుల మది సన్నగిల్లకమున్న | భక్తిభావనచేత ప్రాథుడగుచు దైత్యభంజను దివ్యపాదారవింద భజన నిజభక్తి భావన ప్రాజ్ఞుడగుచు అవ్యయానందమును బొందు ననుదినంబు అతడు కర్మవిముక్తుడౌ ననఘచరిత!"


"పాపరహితుడవైన యదు మహారాజా! ఇతరుల ధనం కోసం, పరుల భార్య కోసం వెంపర్లాడకూడదు. ఇతరులను ఎప్పుడూ దూషించరాదు. అదేవిధంగా ఇతరులకు చెందిన వస్తువుల నపహరించి దోషి కాకూడదు. ఇంకో ముఖ్య విషయం చెబుతాను విను. వార్ధక్యం ముదిరి, శరీరమంతటా రోగాలు నిండకముందు, తనువుకు వణుకు రాకముందు, బుద్ధి చంచలించక ముందు, శ్లేష్మం గొంతులో పేరుకోకముందు, శక్తి క్షీణించకముందు, మనసులో భావనలు సన్నగిల్లకముందు, జీవి నిశ్చల భక్తితో దృఢమనస్కుడు కావాలి. దేనికీ భయపడకూడదు. దేనివల్ల బాధ చెందరాదు. అయితే, చేయవలసిందేమిటంటే - క్రూరాత్ములైన రాక్షసులను మట్టుపెట్టినశ్రీ మన్నారాయణుని పాదారవిందాలను సేవించాలి. ఆయన నామాన్ని అనుక్షణం స్మరించాలి. ఆయనను ఎల్లవేళలా అర్చించాలి. ఆయన పూజలో మేను మరవాలి. ఆ విధంగా పరమాత్ముడైశ్రీ మహావిష్ణువును భజిస్తూ సహజమైన భక్తిభావనతో ఉంటే, యుక్తాయుక్త విచక్షణాజ్ఞాన సంపన్నుడై ఆ వ్యక్తి ప్రతినిత్యం అవ్యయమైన మహదానందాన్ని పొందుతాడు. అటువంటివాడు పూర్వజన్మల నుంచి వచ్చిన పాపకర్మల నుంచి విముక్తుడై, ఈ జన్మలో పరమాత్ముని కరుణకు పాత్రుడై, మోక్షాన్ని పొందుతాడు.


| యదురాజా! ఈషణత్రయంలో (ధనేషణ, దారేషణ, శ్రీ షణ) కూరుకుపోయి, మానవుడు మమకారాలను తెంచుకోలేక, భయంకరమైన - వారి వియోగం వల్ల కలిగే దుఃఖంతో తెలివిమాలినవాడౌతాడు. సంసార బంధనాలలో చిక్కుకుపోయి నీతిని, వివేకాన్ని కోల్పోయి, మనోవేదనకు తట్టుకోలేక మగపావురంలాగా ప్రాణాలు వదులుతాడు. ఈ మగ పావురం కథ ఏమిటని అడుగుతావేమో చెబుతాను విను. ఒక మహారణ్యంలో కపోతం ఒకటి తన భార్యతోటి, సంతానం తోటి నివాసాన్ని ఏర్పరచుకొని సుఖ సంతోషాలతో జీవిస్తుండేది. రోజు రోజుకు సంతానం వృద్ధి చెందసాగింది. ఆ మగపావురం సంతోషానికి అంతేలేదు. తన కుటుంబమే చాలా గొప్పదని మురిసిపోయేది. అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆ పావురాల నివాసం వద్దకు ఒక బోయవాడు వచ్చాడు. పావురాలమూసి, సమయం కనిపెట్టి వల విసిరాడు. విధివశాత్తు ఆడపావురం, వారి పిల్లలు ఆ వలలో చిక్కుకు పోయి అవస్థల పాలయ్యారు. ఆ దృశచూసిన మగపావురం- వాటిపైన దానికున్న అనురాగాతిశయం చేత, వాటి బాధలకు తట్టుకోలేక, ధైర్యం కోల్పోయి, అది కూడా కావాలని ఆ వలలోకి దూరిపోయింది. భార్యాబిడ్డల్ని రక్షించటానికి విశ్వప్రయత్నం చేసింది. కాని లాభం లేకపోయింది. దుఃఖంతో కృశించి, కృశించి ప్రాణాలు పోగొట్టుకుంది. కాబట్టి యదురాజా! దేనిమీదా, ఎవరిమీదా, ఎవరికీ మోహం తగదు. అది ప్రాణాంతకమే అవుతుంది గాని ప్రాణరక్షణ చేయదు. అందుచేత యోగులైన వారు నిరంతరం హరిధ్యానపరులుగా వర్తిస్తారేగాని, మోహపరవశులుగా కాలాన్ని వృధా చేయరు. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడత, తుమ్మెదలేడి, తాబేలు, ముంగిస, లకుముకి బాణాలు తయారు చేసేవాడు, పాముమొదలైన వాటి ప్రవృత్తులను, వారి జాగ్రత్తగా మెలగుతుంటారు" అ కృష్ణుడు తన కుతూహలాన్ని బయటపెట్టాడు.


| శ్రీ కృష్ణపరమాత్మా! నీవు చెప్పిన జంతుజాలం గురించి, మానవుల గురించి, జీవాల గురించి విపులంగా తెలుసుకోవాలనిపిస్తోంది. చెప్పుదేవా!" అని వినయంగా అడిగిన ఉద్దవుచూ సి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు కృష్ణుడు. "ఉద్ధవా! ఒక్కొక్కదానినుంచి ఒక్కొక్కసుగుణాన్ని నేర్చుకోవాలి. పంచభూతాలను తీసుకో - భూమి వల్ల ఓర్పును నేర్చుకోవాలి. వాయువు వల్ల పరోపకారాన్ని, ఆకాశం వల్ల కాలం సృష్టించిన గుణాలతో సాంగత్యం లేకపోవటాన్ని, నీటివల్ల శుచిత్వాన్ని, అగ్నివల్ల నిర్మలత్వాన్ని తెలుసుకోవాలి. సూర్యచంద్రుల నుంచి సర్వసమానతను గ్రహించాలి. పావురం వల్ల భార్యాపుత్రుల పట్ల ఎటువంటి స్నేహానురాగాలుండాలో ఆకళింపు చేసుకోవాలి. కొండచిలువ వల్ల దొరికిన ఆహారాన్ని మాత్రమే అందుకోవాలనే గుణాన్ని అర్థం చేసుకోవాలి. సముద్రం నుంచి ఉత్సాహ రోషాలను ఆత్మీయం చేసుకోవాలి. ఇక మిడత వల్ల శక్తికి తగ్గ పనిని మాత్రమే చేయాలనే విషయాన్ని, తుమ్మెద వల్ల సారాన్ని మాత్రమే పొందాలని, ఏనుగు వల్ల స్త్రీ పట్ల విముఖతను, తేనెటీగ వల్ల సంగ్రహణ గుణాన్ని, లేడివల్ల ఆలోచనా లక్షణాన్ని, తాబేలు వల్ల జిహ్వ చాపల్యాన్ని, ముంగిస వల్ల లభ్యమైన దానితో తృప్తిని పొందాలని, లకుముకి పిట్ట వల్ల మోహాన్ని త్యజించాలని, బాలుని వల్ల సంతోష గుణాన్ని, కుమార్తె వల్ల సంగమాన్ని వదలి వెయ్యటాన్ని, బాణాకారుని నుంచి ఏకాగ్రతను, పామువల్లపరుల గృహాలలో నివసించడాన్ని, సాలెపురుగు నుంచి భవబంధాలలో చిక్కుపడకుండా ఉండటాన్ని, కందిరీగ వల్ల లక్ష్యానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ప్రతి _జీవిలోనూ ఏదో ఒక సద్గుణముంటుంది. ఆ సద్గుణాన్ని నేర్చుకుని అవలంబించేవారు నాకు సమీపస్తులౌతారు. అంతేకాక కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు శత్రువులను జయించాలి. వార్ధక్యం రాకుండా, చావు లేకుండా వాయువును వశం చేసుకోవాలి. శరీరం పవిత్రంగా ఉండటానికి యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అనే ఆరు కర్మలు ఆచరిస్తూ, పట్టణాలలో, గ్రామాలలో, నగరాలలో నివసించకుండా కొండలలో, అడవులలో నివాసం ఏర్పరచుకోవాలి. ప్రాణాలు నిలబెట్టుకోవటానికి కావలసిన కొద్ది ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సంతోష దుఃఖాల రెండింటిని ఒక్క సమంగా భావించి అనుభవించాలి. లోభ మోహాలను వర్షించాలి. ఇంద్రియాలను జయించి, భగవంతుడనైన నన్ను తప్ప ఇంక దేని గురించి ఆలోచించకుండా ఉండాలి. ఆత్మనిష్టతో ఆవిధంగా జీవితాన్ని గడుపుతూ పవిత్రాంతఃకరణంతో నన్ను ధ్యానించే యోగి అచిరకాలంలోనే నన్ను చేరుకోగలుగుతాడు. నాలోనే ఉండిపోతాడు".


"మోహితుడై వసు కాంక్షా వాహినిలో చిక్కి క్రూరవశుడౌ మనుజుం డూ హాపోహ లెఱుంగక దేహము నలగంగ చేయు దీనత నెపుడున్" - 100ప - ఏ.స్కం - భాగవతము


||"మానవుడు మోహరుణానికి వశుడై, ధనకాంక్ష అనే ప్రవాహంలో చిక్కుకుపోయి క్రౌర్యవర్తనుడౌతాడు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకోక దీనుడై శరీరాన్ని పాడు చేసుకొంటాడు. దీనికొక పూర్వ కథ ఉంది. చెబుతాను విను. మిథిలా నగరంలో 'పింగళ' అనే ఒక వేశ్య ఉండేది. ఆమెవల్ల కొంతజ్ఞానం తెలుసుకొన్నాను. ఆమె తన ప్రియసఖుని ధనం మీద ఉండే అపేక్ష కొద్దీ వదిలివేసి ధనమిచ్చే వాడితో తిరగసాగింది. తెల్లవార్లూ నూతన ప్రియుడితో విహరించటం వల్ల, నిద్రలేక అనారోగ్యం పాలైంది. డబ్బు మీద ఉండే ఆశతో తిరిగి తిరిగి అలసిపోయింది. తనకు సుఖాన్నిచ్చేవాడు, తన మంచిని కోరేవాడు - నిజంగా భర్తె అనే నిశ్చయానికి వచ్చింది. ఆ నారాయణునే ఈవిధంగా అనుకుంటే మోక్షాన్ని పొందవచ్చు గదా అని ఆలోచించింది. తన శయన మందిరాన్ని, సకల సిరులను వద్దనుకొంది. పరమాత్ముని పాదపద్మాలను నమ్ముకొని, మెరుపు వంటి శరీరాన్ని నమ్ముకోరాదని భావించి భగవంతునిపైనే మనసు లగ్నం చేసుకొని అనునిత్యం దైవనామ జపంతో మోక్షాన్ని పొందింది. ఈ దేహం ఎప్పుడూ శాశ్వతమైనది కాదు. ఎప్పుడు నశిస్తుందో తెలియదు. మోహాన్నిత్రే పచివేసి మహర్షులు, సిద్దులు ప్రయాణించే మార్గంలో ప్రయాణించాలని, తలచి, ఇంటినుంచి బయటపడి పరమాత్ముని కొలిచే, మానవుడు మోక్ష సంపద నందుకొంటాడు. దీనికి మరో పుణ్యకథ ఉంది విను. "కనకావతి" అనే పట్టణంలో ఒక బ్రాహ్మణ కన్య ఉంది. ఆ కన్య రత్నాలు పొదిగిన కంకణాలు ధరించి అందరికీ ఆనందాన్ని సమకూర్చేది. ఒకనాడామె ఇంటికి బంధువులు వచ్చారు. వారికి భోజనం సమకూర్చడానికామె వడ్లు దంచసాగింది. అప్పుడామె చేతులకున్న కంకణాలు పెద్దగా చప్పుడు చేశాయి. ఆ చప్పుడు వినలేక ఒక్కగాజుమాత్రమే చేతికి ఉంచుకుని మిగిలిన గాజులు తీసి ప్రక్కన పెట్టి పనిలో నిమగ్నురాలైంది. అందుచేత ఏమాత్రం తత్తట పడకుండా భగవంతుని పైన ఏకాగ్రంగా మనస్సు నిల్పితే ప్రసన్నత ఏర్పడుతుంది. ఏకాగ్రచిత్తంతో భగవంతుని తలచే నరులు తప్పక ముక్తిని పొందుతారు..


| | పశు | ఉద్దవా! అవిద్య, విద్య - రెండూ నా మాయే అని తెలుసుకో. పశు మార్గాలలో కాకుండా యోగీశ్వరుల లాగా సుఖాన్ని కోరక ప్రవర్తించే వాళ్ళు ముక్తులౌతారు. సర్వం విష్ణుమాయే అని గ్రహించు" అని కృష్ణుడు చెప్పగా విని "అయితే నీ రూపం ఎలా చూడవచ్చు" అని అడిగాడు ఉద్దవుడు..


| "ఉద్దవా! జాగ్రత్తగా విను. భక్తి పట్ల ఆసక్తి కలిగి, దయా స్వభావంతో, అసత్యాలు పలకక, మితభాషణుడై తాను చేసే సమస్త కర్మలను నాకు అర్పిస్తూ చేస్తే - అతడు భాగవతుడని, నిజమైన భక్తుడని చెప్పబడతాడు. మరొక విషయం. నా జన్మ గురించి, నా లీలల గురించి, నా కథలను వింటూ నన్ను సేవించే భగవద్భక్తులను తమ ఇంటికి తీసుకువెళ్ళి, వారిని సత్కరించి, పూజించి, స్నాన, భోజన, శయనాలతో సంతృప్తి పఱచిన వాడిని కూడా భాగవతుడనే చెబుతారు. జీవితాంతం ఇటువంటి సత్పవర్తనతో జీవించేవాడు మరణానంతరం నా రూపంతో వైకుంఠంలో సంతృప్తిగా ఉంటాడు. అంటే సారూప్యముక్తిని పొందుతాడన్న మాట! శాస్త్రాచారాలతో నిమిత్తం లేకుండా శుకుడు, సనకుడు మొదలైన యోగీశ్వరులు; అంబరీషుడు, రుక్మాంగదుడు; విభీషణుడు మొదలైన భాగవతోత్తములు అత్యంత భక్తితో శంఖ చక్ర గదాధరుడనైన నన్ను, లక్ష్మీసహితుడనైన నన్ను తెలుసుకొంటారు. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైన షోడశోపచారాలతో పూజిస్తూ, ధ్యానిస్తూ భగవదారాధనలో నిమగ్నులౌతారు. వారికెప్పుడూ నా ధ్యాసే ఉంటుంది. అలాగే నా విరహాన్ని భరించలేని గోపికలు భక్తి వియోగంతో అనవరతం నన్నే చింతించి మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించారు. ఇదే భక్తియోగ ప్రకారమంటే" అని కృష్ణుడు వివరించగానే ఉద్దవుడు మరో ప్రశ్న వేశాడు. "దేవాశ్రీ కృష్ణా! -


"ధ్యానంబేక్రియ నిలుచును? ధ్యానంబేరీతి తగు? నుదాత్త చరిత్రా! ధ్యాన ప్రకారమంతయ నూనంబుగ చెప్పమయ్య యుర్వీరమణా!" -104ప - ఏ.స్కం - భాగవతము


"ధ్యానం ఎలా చేస్తే నిలుస్తుంది? ఎలా చేస్తే అది ధ్యానమవుతుంది? ధ్యానమంటే ఏమిటి? దానిని ఎలా చేయాలి? ఈ విషయాలన్నీ నాకు సవిస్తరంగా చెప్పు" అని అడిగాడు ఉద్ధవుడు. "కట్టె లోపల అగ్ని సూక్ష్మరూపంలో వర్తించే విధంగా జీవుడు సర్వ శరీరులయందు ఛేదింపబడనివాడుగా, దహింప బడనివాడుగా, ఎండిపోని వాడుగా అంతర్లీనమై వసించి ఉంటాడు" అనిశ్రీ కృష్ణుడు చెబుతుండగా ఉద్ధవుడు మరో ప్రశ్న వేశాడు. "మహాత్మా! సనక సనందనాది యోగీంద్రులకు ఏ విధంగా యోగ మార్గాన్ని తెలియజెప్పావు? యోగ మార్గం ఏవిధంగా ఉంటుంది?"చెప్పమన్నాడు. ఉద్ధవుడి కుతూహలానికి సంతోషించినశ్రీ కృష్ణుడు - "ఒకప్పుడు సనకాది యోగులు ఇదే ప్రశ్నను బ్రహ్మదేవుణ్ణి అడిగారు. 'మహాపురుషులారా! దీనికి సమాధానం నాకూ తెలియద'ని బ్రహ్మ అనగానే వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. అప్పుడు నేను హంస రూపుడిగా వారికి యోగమార్గాన్ని తెలియజెప్పాను. నీకూ చెబుతాను విను. పంచేంద్రియాలకు కనిపించే పదార్థమున్నదే, అది అనిత్యమని తెలుసుకో. నిత్యపదార్థం బ్రహ్మం ఒక్కటే. పూర్వజన్మలలో చేసిన కర్మల చేత లభించిన శరీరంతో ఒప్పే దేహి, భవబంధాలను, బంధుమిత్రుల పట్ల మమకారాన్ని వదలి, నిశ్చలమైన జ్ఞానాన్ని పొందితే మోక్ష పదవిని చేరుకోగలుగుతాడు. అదే, నా స్థానం, 'కలలో దొరికే పదార్థం నిజంకాని విధంగా కర్మానుభవం పూర్తి అయ్యేదాకా, ఆ కర్మను అనుభవించటానికి శరీరం ఉంటుంది' అని సాంఖ్యయోగాన్ని సనకాది యోగులకు తెలియజెప్పాను. బ్రహ్మ మొదలైన దేవతలు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని, భూలోకంలో అందరికీ అవగాహన అయ్యేట్లు చేసి దానిని ప్రసిద్ధి పొందించారు. కాబట్టి ఉద్దవా! నీవు కూడా యోగమార్గాన్ని అర్ధం చేసుకుని పుణ్యాశ్రమాలకు వెళ్ళు. భాగవతుడెవరో మళ్ళీ చెబుతాను విను. నా యొక్క భక్తిలో పరవశించేవాడు; శంఖ చక్రాది ముద్రలు ధరించేవాడు; విష్ణు నామాలను పెట్టుకొనే వానికి అన్నపానాలు ఇచ్చేవాడు; వాసుదేవుని భక్తులచూసి సంతోషించేవాడు; - అయిన భక్తుడే - భాగవతుడు - సర్వసంగ పరిత్యాగం చేసి, వేరెవరినీ తలచక, నన్నే ధ్యానించే మానవుడికి, భుక్తి ముక్తులను ప్రసాదిస్తాను" అశ్రీ కృష్ణుడు చెప్పటం ఆపిన మరుక్షణంలో అంతకుముందు తానడిగిన "ధ్యానమార్గం గురించి" చెప్పమని గుర్తు చేశాడు ఉద్దవుడు.


"ఉద్ధవా! ధ్యానం ఎలా చేయాలో చెబుతాను శ్రద్దగా విను. ముందు ఒక్కడూ ఒంటరిగా కూర్చోవాలి. తన తొడల మీద చేతులు సంధించి, ముక్కు చివరి భాగామా_పు నిలపాలి. ప్రాణాయామం చేస్తూ నన్ను తన హృదయంలో ఉన్నట్లుగా భావించాలి. పద్దెనిమిది రకాల ధారణాయోగ సిద్దులను అర్ధం చేసుకోవాలి. వాటిలో అతి ప్రధానమైన 'అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశత్వము' అనే ఎనిమిదింటినీ ప్రధాన సిద్దులుగా గ్రహించి ఇంద్రియాలను బంధించాలి. అప్పుడు మనస్సును ఆత్మలో చేర్చి, ఆత్మను ఆత్మతో లగ్నం చేసి బ్రహ్మపదాన్ని పొందాలి. ఆ విధంగా బ్రహ్మపదాన్ని పొందే భాగవతోత్తములు మిగిలిన అన్ని విషయాలను మాని, కేవలం నన్ను పొందుతారు".


"చరాచర ప్రపంచాన్ని, అంతటినీ నా రూపంగా భావించి భూతాలలో ఆధారభూతము, సూక్ష్మములందు జీవుడు, దుర్జయమైన వాటిలో మనస్సు - నన్నుగా గ్రహించు. దేవతలలో బ్రహ్మ, వసువులలో అగ్ని, ఆదిత్యులలో విష్ణువు, రుద్రులందు నీలలోహితుడు, బ్రహ్మలందు భృగువు, ఋషులందు నారదుడు, గోవులందు కామధేనువు, సిద్దులలో కపిలుడు, దైత్యులలో ప్రహ్లాదుడు, గ్రహాలలో చంద్రుడు, గజరాజులలో ఐరావతము, గులలో ఉచ్చైశ్రవము, సర్పాలలో వాసుకి, మృగాలలో సింహం, ఆశ్రమాలలో గృహస్థాశ్రమము, అక్షరాలలో ఓంకారము, నదులలో గంగ, సాగరాలలో క్షీరసాగరం, ఆయుధాలలో విల్లు,పర్వతాలలో మేరువు,వృక్షాలలో రావిచెట్టు, ఓషధులలో యవలు, యజ్ఞాలలో బ్రహ్మయజ్ఞం, వ్రతాలలో అహింస, యోగాలలో ఆత్మయోగం, స్త్రీలలో శతరూప, మాటలలో సత్యం, ఋతువులలో వసంతం, మాసాలలో మార్గశిరం, నక్షత్రాలలో అభిజిత్తు, యుగాలలో కృతయుగం, భగవంతుని రూపాలలో వాసుదేవరూపం, యక్షులలో కుబేరుడు, వానరులలో ఆంజనేయుడు, రత్నాలలో పద్మరాగం, దానాలలో అన్నదానం, తిథులలో ఏకాదశి, మానవులలో వైష్ణవుడై భక్తుల ప్రవర్తనతో ప్రవర్తించేవాడు - ఇవన్నీ నాయొక్క విభూతులు" అనిశ్రీ కృష్ణుడు చెప్పగానే విని ఆత్మానందంతో పొంగిపోయాడు ఉద్దవుడు. (సశేషం)