తప్పక తెలుసుకోవలసిన 78 విషయాలు

| తప్పక తెలుసుకోవలసిన 78 విషయాలు


గత సంచిక తరువాయి


 ఇది మంచి, ఇది చెడు అని తెలిసికొని, మంచిని చేయడానికి కాని చెడుని మానడానికి కాని నిర్ణయం జూదగృహ తీసుకొనలేని వయస్సులోని పిల్లలకు పుణ్య పాప కర్మలు అంటుకోవు. వారిని సరిదిద్ద వలసిన తల్లితండ్రులకే అవి అంటుకుంటాయి. ఈ కారణం చేతనే పన్నెండు సంవత్సరాల వయస్సు లోపు పిల్లల చేత సంకల్పాలు చెప్పించడం వంటి వాటి అవసరం ఉండదు. అదేవిధంగా, మానసిక పరిపక్వత లేని పిల్లల విషయంలో కూడా సంరక్షకులకే ఆ పుణ్యపాపాలు అంటుకుంటాయి కానీ ఆ పిల్లలకు అంటుకోవు. భర్త సంరక్షణలో ఉన్న భార్య పాపాల బాధ్యత భర్తదేననికూడా కొందరి అభిప్రాయం. భర్త పాపాలతో మాత్రం భార్యకు సంబంధం ఉండదుట. సహధర్మచారిణిగా ఉంటే పుణ్యాలని మాత్రం పంచుకుంటుందిట.


 కొన్ని పనులను అనుకోకుండా, అప్రయత్నంగా 2. చేసేస్తూ ఉంటాం. ఇదివరకు చేసిన కర్మల వాసన వలన అలా జరుగుతూ ఉంటుంది. మరికొన్నిపనులనుజాగ్రత్తగా ఆలోచించి, నిర్ణయం తీసుకొని చేస్తూ ఉంటాం. ఇవి ఇదివరకు చేసిన కర్మల రుచి వలన జరుగుతూ ఉంటుంది. వాసన వలన చేసినా, రుచి వలన చేసినా పుణ్యపాపాల గణనలోకి ప్రతి కర్మ కూడా రావలసినదే. అయితే, వాసన వలన చేసిన దానికన్న రుచి వలన చేసిన దానికి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.


వృత్తిలోని వాడి ప్రవృత్తిూదం , సురాపానం కావచ్చుజూదగృహ వృత్తిలోని వాడికి పిల్లలకి పాఠాలు చెప్పడం ప్రవృత్తి కావచ్చు. వృత్తికి లాగే ప్రవృత్తికి కూడా పుణ్యపాపాలు తప్పవు. జీవనం గడపడానికి ధనాన్ని సంపాదించుకోవాలి.  అందుకోసం ఏదో ఒక వృత్తిని ఎంచుకోక తప్పదు. ఆ ఎంచుకోవడంలోనూ పుణ్య పాపాలు వర్తిస్తాయి. ఎంచుకున్న వృత్తిని చేసేటపుడుకూడపుణ్యపాపాలు జరుగుతూనే ఉంటాయి. అన్నింటినీ అనుభవించక తప్పదు. వృత్తి ఏదైనప్పటికీ ప్రవృత్తి అంటే స్వభావము దానికి భిన్నంగా ఉండవచ్చు. ఉపాధ్యాయవృత్తిలోని వాడి ప్రవృత్తిూదం , సురాపానం కావచ్చు. జూదగృహ వృత్తిలోని వాడికి పిల్లలకి పాఠాలు చెప్పడం ప్రవృత్తి కావచ్చు. వృత్తికి లాగే ప్రవృత్తికి కూడా పుణ్యపాపాలు తప్పవు.


శ్రీ మన్నారాయణ మూర్తికి అర్చన, ఆరాధన, జ . ఆయన విషయం పదిమందికీ తెలియపరచడం వంటివి వృత్తిగా కలవాడు పుణ్యాత్ముడు. ఆ వృత్తిని నిర్వహించే సందర్భంగా వాసన వలన జరిగే పాపాలకు (పొరపాటుగా చేసే తప్పులకు) ప్రత్యేకంగా శిక్ష పడదు. కాని రుచి వలన చేసే పాపాలకు (తెలిసి చేసే తప్పులకు) శిక్ష తప్పదు. శ్రీ మన్నారాయణమూర్తి విషయాలను ప్రవచనంగా చెప్పడం, అర్చనలు, ఆరాధనలను ప్రోత్సహించడం మొదలైన వాటిని ప్రవృత్తిగా తీసుకున్నవాడు, ఆ పనుల వలన ఏ ప్రయోజనాన్నీ ఆశించడు. కనుక పరమ పుణ్యాత్ముడుగా భావింపబడుతాడు. శ్రీ మన్నారాయణునికి అతడంటే చాలా ఇష్టం. అతడి కర్మలన్నీ కైంకర్యాలే. పుణ్య పాప విభాగం వాటిలో ఉండనే ఉండదు. జీవులలో ధన్యుడు అతడు.


శ్రీ మన్నారాయణ మూర్తికి తీవ్రమైన ఆగ్రహం, AJ. తన భక్తుల మనస్సులను చిన్నబుచ్చిన వారివీద వస్తుంది. అంతకన్న పెద్ద పాపం ఉండదు ఆయన దృష్టిలో. వారిని ఏమాత్రం క్షమించడు ఆయన. పశువులు, పక్షులు, బుద్ధిమాంద్యం ఉన్న మనుష్యులు వంటి జీవులకు కూడా, వారు తన భక్తులను ఆశ్రయించి ఉంటే చాలు, రెండవ ఆలోచన లేకుండా మోక్షాన్ని ఇచ్చేస్తాడు మన్నారాయణమూర్తి.


నారాయణ మంత్రోపదేశం పొందినవారికి, దాని  అర్థాన్ని ఉపదేశం పొందినవారికి కూడా చాలా నిశ్చింత. వారికా మంత్రాన్ని, మంత్రార్థాన్ని ఉపదేశించినగురువుగారే,పుణ్యపాపకర్మలని తొలగించేప్రయత్నానికి బాధ్యత పడతారు. అంటే ఆయన రణ చేతతీ మన్నారాయణమూర్తి ఆ పుణ్యపాపాలని సంపూర్ణంగా తొలగిస్తాడు. ఈ ఉపదేశం పొందిన జీవుడు ఏమీ అడగనక్కర్లేకుండానే. బ్రహ్మవిద్యాభ్యాసం కూడా ప్రత్యేకించి చేయనవసరం లేదు వారు. వారుపదేశం పొందిన నారాయణ మంత్రమే అన్ని బ్రహ్మవిద్యల సారం. అయితే శాస్త్ర (చట్ట విరుద్ధమైన పనులేమీ చేయకూడదు. నారాయణ మంత్రం మీద గొప్ప విశ్వాసం ఉండాలి. అంతే..


 పుణ్య పాప కర్మలు చాలవరకు సమాజంలో ఉండే ఇతరులతో కలిసి కాని, కుటుంబంలో ఉండే ఇతర సభ్యులతో కలిసి కాని అనుభవించవలసి ఉంటాయి. అదేవిధంగా కొన్ని శారీరకంగా అనుభవించలసినవి.మరికొన్నిమానసికంగా అనుభవించవలసినవి అయి ఉండవచ్చు. వీటిలో ఇతరులతో కలిసి అనుభవించవలసిన అవసరములేని పుణ్యపాపములను స్వప్నములలో అనుభవించవలసి ఉంటుంది. పాప కర్మలయితే దుష్టమైన స్వప్నాలు, పుణ్యకర్మలైతే మంచి స్వప్నాలు వస్తాయి.అందుచేత కల కల్ల కాదు. మన కర్మానుభవమే చాలావరకు.


 కలలలో ఈ లోకపు అనుభవాలుండవచ్చు. లేదా స్వర్గాదిలోకాల అనుభవాలు కలగవచ్చు. భవిష్యత్తులో శారీరకముగా అనుభవింపవలసిన కర్మల విషయములు కూడా అప్పుడప్పుడు కలలలో,మంచిలేదా చెడుగా సూచితమవుతూ ఉంటాయి. ఇవికాక, శరీర అనారోగ్యాన్ని సూచించేవి, మెలకువగా ఉన్నప్పుడు తీవ్రముగా ఆశపడిసామాజిక భయము చేత అనుభవించడానికి సాహసించనివి కూడ కలలలో ఉంటాయి. పుణ్యం సుఖాన్నిస్తుంది. పాపం దుఃఖాన్నిస్తుంది. కలలో అయినా, మెలకువగా ఉన్నప్పుడైనా సుఖం, దుఃఖం కలిగిపోతే దానికి సంబంధించిన పుణ్య పాప కర్మలు నశించిపోయినట్లే.


మనము మెలకువగా ఉండే దశలోను, స్వప్న దశలోను కూడ మనచేత ఆయా కర్మలను అనుభవింపచేసేది శ్రీ మన్నారాయణమూర్తే. శారీరకముగా, మానసికముగా జీవుడికి విశ్రాంతి అవసరమని అనిపించినపుడు ఆశ్రీ మన్నారాయణమూర్తే గాఢనిద్రను కూడా అనుగ్రహించి సేదతీరిన తరువాత మరల కర్మానుభవానికి సిద్దపరుస్తాడు. ఏది ఏమయినప్పటికీ జీవులందరి ప్రవర్తన వారి వారి పుణ్యపాప కర్మముల ఆధారంగానే నడుస్తూ ఉంటుంది.


పుణ్యకర్మల వలన సంతృప్తి, సంతోషము, మంచి  ఆలోచనలు, అందరిపట్ల ఆదరణ, నవ్వుతూ ఉండటంశ్రీ మన్నారాయణమూర్తి యందు ఆసక్తి, ఇతరులకు సాయం చేయాలనే బుద్ధి కలుగుతూ ఉంటాయి. సాధారణ పాపకర్మల వలన చంచలత్వము, అపనమ్మకము, ఇతరులను రెచ్చగొట్టడం,శ్రీ మన్నారాయణమూర్తి యందు ఉదాసీనత, విపరీతబుద్ధి మొదలైనవి కలుగుతాయి. తీవ్రమైన పాపముల వలన సరియైన నిర్ణయాలు తీసుకోలేక పోవడము, బద్దకము, ఇతరులను హింసించాలనే కోరికశ్రీ మన్నారాయణ మూర్తిని ఎదిరించాలనే భావము కలుగుతూ ఉంటాయి.