సూరదాసు కృష్ణభక్తి 

సూరదాసు కృష్ణభక్తి 


కృష్ణభక్తుల్లో సూరదాసు అగ్రగణ్యుడు. జన్మాంధుడు. పరమానందంతో కృష్ణ లీలలను గానం చేసేవాడు. అతడు నడిచివెళ్ళే దారిలో ఒక బావి ఉంది. అంధుడు కనుక నడుస్తూ ఆ బావిలో పడిపోయాడు. ఏడు రోజులు అందులోనే ఉన్నాడు. దీన స్వరంతో శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. చివరికి సూరదాసు పట్ల కృష్ణునికి దయ కలిగి చేయూతనిచ్చి బయటికి తీసుకొచ్చాడు. బయటికి వచ్చిన సూరదాసు తన అంధత్వాన్ని తలచుకొని దుఃఖించాడు. కన్నయ్యా! ఎదురుగా ఉన్నా చూడలేక పోతున్నానని బాధపడ్డాడు. ఇలా సూరదాసు మధనపడుతుండగా ఒకరోజు రాధాకృష్ణులు మాట్లాడుకోవడం విన్పించింది.


"ముందుకు వెళ్ళకు. ఆ అంధుడు కాళ్ళు పట్టుకుంటాడు" అంటున్నాడు కృష్ణుడు. "అయినా నేను వెళ్తున్నాను" అని రాధాదేవి సూరదాసును సమీపించి "నీవు నిజంగా నా కాలుని పట్టుకుంటావా?" అని అడిగింది. "నేయా_పు లేనివాడిని. ఎలా పట్టుకోగలను" అన్నాడు సూరదాసు దీనంగా రాధకు జాలేసి తానే తన పాదస్పర్శ చేయనిచ్చింది సూరదాసుని. కృష్ణుడు "ముందునుంచి కాదు, వెనక నుండి కాలు పట్టుకుంటాడు" అని గట్టిగా అన్నాడు.. శ్రీ కృష్ణుడే అనుమతి ఇస్తున్నాడు. నేనెందుకు వదలాలి అనుకున్నాడు సూరదాసు. | పాదస్పర్శకై రాధాదేవి కాలు అందించింది. సూరదాసు ఆమె కాళ్ళు పట్టుకొన్నాడు. రాధ వదిలించుకొని వెళ్ళబోయింది. ఆమె కాలి గజై ఊడి, సూరదాసు చేతికి దొరికింది. | "నా కాలిగజైనాకివ్వు. రాసక్రీడకు వెళ్ళాలి" అంది రాధ. చూడటం


గుడ్డివాడిని. ఎవరిదో ఎవరికి ఇవ్వాలో నాకేం తెలుసు. నీకే ఎందుకివ్వాలి.మరెవరో వచ్చి నాదంటే నేనేం చేయాలి? ఒకసారి కాలుని స్తే ఇవ్వగలను" అన్నాడు సూరదాసు. రాధాదేవి నవ్వుతూ దృష్టి ప్రసాదించింది. రాధాకృష్ణులు సూరదాసుకి దర్శనమిచ్చారు. ప్రసన్నులై "నీకేమైనా కోరిక ఉంటే చెప్పుతీరుస్తాం" అన్నారు. "మీరు ఇవ్వరు కదా" అన్నాడు సూరదాసు అమాయకంగా. "నీకు ఇవ్వకూడని వరమేదీ లేదు. కోరుకో" అన్నాడు కృష్ణుడు. "మిమళ్లపూసిన ఈనేత్రాలతో లోకా డదలచుకోలేదు. తిరిగి నాదృష్టితీసుకో స్వామీ!" అన్నాడు సూరదాసు. రాధాకృష్ణుల కళ్ళు చెమ్మగిల్లాయి. చూస్తుండగానే సూరదాసుని మళ్ళీ అంధత్వం ఆవహించింది. శ్రీ కృష్ణుని దర్శనమే పరమోత్కృష్టమని తెలిసి ప్రపంచాన్ని చూడటం ఇష్టపడని కృష్ణభక్తులు ధన్యులు కదా!