BHAGAVADGITHA- Moksha Sanyasa YOgam


                            విషయేంద్రియ సంయోగం వల్ల కలిగే సుఖం మొదట్లో అమృత తుల్యం. తర్వాత పర్యవసానంలో అది విషతుల్యమవుతుంది. అలాంటి సుఖం రాజస సుఖమని చెప్పబడుతోంది. సాత్విక సుఖానికి విరుద్ధం రాజస సుఖం. మొదట విషంలా తోచి తర్వాత్తర్వాత అమృతమయమవుతుంది సాత్విక సుఖం. మొదట అమృతంలా తోచి పరిణామంలో విషతుల్యమవుతుంది రాజస సుఖం. ముక్కు నాలుక, చెవి చర్మం ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. కంటికి రూపం, ముక్కుకు వాసన, నాలుకకు రుచి, చెవికి శబ్దం, చర్మానికి స్పర్శ ఇవి పంచ విషయేంద్రియాలు. జ్ఞానేంద్రియ విషయేంద్రియ కలయికను విషయేంద్రియ సంయోగం అంటారు.


ఉదాహరణకు చర్మవ్యాధిని తీసుకుందాం. తీట రోగం. మందులు వాడిన వెంటనే పోదు. వేడినీళ్ళు దానిమీద పోస్తే హాయిగా ఉంటుంది. గోర్లతో గోకితే బలే సుఖం. ఇక ప్రపంచంలోని ఏ వస్తువుతో కూడా అంత ఆనందం ఆ క్షణంలో వాడికి లభించదు. ఆ ఆనందంలో ప్రపంచాన్నే మరచిపోతాడని చెప్పాలి. అది అమృత తుల్యమైన సుఖం. తర్వాత కాసేపటికి వాడి బాధ వర్ణనాతీతం. గోకినందువల్ల భరించలేని మంట అనుభవిస్తాడు. విషయ సుఖాలన్నీ ఇదే తంతులోకి వస్తాయి.


“యద్రీ ” ప్రారంభంలో భోగ సమయంలో అత్యంత అమృత తుల్యం. తర్వాత్తర్వాత విషతుల్యం. పాము కాటు వేస్తే దాన్ని విషానికి మనిషి చస్తాడు. ఈ శబ్దాది విషయ ఆకర్షణల వైపు చూస్తే చాలు అవి కాటు వేస్తాయి. ఇక ఇంతే సంగతులు. కురంగ మాతంగ పతంగ మీన భృంగానరఃపంచభిరంచితః కిం బోయవాని గానానికి చెవిచేత జింక ఆకర్షింపబడి చిక్కి చస్తుంది. అలాగే స్పర్శచేత ఏనుగు కంటిచేత (దీపకాంతికి) మిడుత ఎరచేత జిహ్వచాపల్యంతో చేప వాసనకు లోనై తుమ్మెద బంధాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతాయి. అవి ఒక్కో ఇంద్రియానికి గురై నాశనమవుతాయి. ఇక ఐదు ఇంద్రియాలకి దాసుడైన మనిషి గతి ఎలా ఉంటుందో అంటున్నాడు శంకర భగవత్పాదుల వారు తమ వివేకా డామణిలో.


యద్రే చానుబంధేచసుఖం మోహనమాత్మనః | నిద్రలస్యప్రమాదోత్తం తత్తామసముదాహృతమ్ ||


39 నిద్ర సోమరితనం మరుపు వల్ల కలిగే సుఖం తామస సుఖమని చెబుతారు. అది ఆదిలో అంతంలో కూడా మోహింప చేస్తుంది.అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడన్నాడు ఓ కవి. నిద్రలో మనోబుద్దులు, ఇంద్రియాల వ్యాపారాలు నిలిచిపోతాయి. తెలివి పని చేయదు. ఆ నిద్రలో సుఖం ఉంటుంది. అయితే ఆ సుఖం తాత్కాలికం. మెలకువ రాగానే సుఖం ఎక్కడికి పోతుందో తెలియదు. అంటే సుఖం రూపంలోని మోహం అది. అది అజ్ఞానం కింద లెక్క.


ఆలస్యానికి బద్ధకమని సోమరితనమని అర్థాలున్నాయినిద్రకు తమ్ముడు సోమరితనం. ఈ రెండూ ఉంటే బావుండదని ముచ్చటగా మూడోది ప్రమాదం చేర్చబడింది. ప్రమాదం అంటే భ్రమ అని, మరుపు అని కూడా అంటారు. ఈ ప్రమాదంలో ఇంద్రియ వ్యాపారాలు బాగా మందగించి ఉంటాయి. చేయాలో తెలియని బుద్ధిమాంద్యం. నిద్రలో సోమరితనంలో విధమైన మోహం కప్పేస్తుంది మనస్సుని. అదొక ఆభాస సుఖందానికొక ఉదాహరణ చెబుతారు. చెరువులో నీటిపై కమ్ముకున్న నాచును లేదా గుర్రపు డెక్కను తొలగించిన వెంటనే మళ్ళీ ఆ నీటిని ఎలా కప్పివేస్తుందో అదేవిధంగా విషయలోలుడైన సాధకుని మోహం ఆవహించి ముంచేస్తూ ఉంటుంది.


నిద్ర సోమరితనం మోహం ఈ మూడు మొదట్లో కాని మధ్యలో కాని చివర్లో కాని సుఖం పొందుతున్నట్లు భ్రమింపచేసి బతుకుని వ్యర్థం చేస్తాయి. ప్రమాద ఆలస్య నిద్రలు తమోగుణ జనితాలు అని పధ్నాలుగో అధ్యాయం ఎనిమిదో శ్లోకంలో చెప్పబడింది. ప్రమాదం అంటే మరుపు ఏమరుపాటు అనే అర్థంగా వాల్మీకి మహర్షి ప్రయోగించాడు. సృష్టస్వం వనవాసాయస్వమరక్తః సుహృజ్ఞనే రామే ప్రమాదం మాకరేః పుత్రభాతం గచ్ఛతి (అయోధ్య. 40 సర) వనవాసానికి బయల్దేరుతున్న లక్ష్మణునికి తల్లి సుమిత్ర పలికిన హితోక్తి లోనిదీ శ్లోకం. రాముని వనవాసంలో సేవించటానికే నీవు నా కడుపున పుట్టావు. రాముని నడక అందంగా ఉంటుంది. మదపుటేనుగు సింహం శార్దూలం వృషభం నడక లాంటి నడక రామునిది. ఆ చతుర్గతి నడకలోని అందాలూ స్తూ ఏమరుపాటు పడకుండా సాగిపో. రాముని రక్షణలో సావధానుడవై ఉండు. సుహృజ్జనంపై నీకున్న భక్తి ప్రగాఢమైంది.


ఇంద్రియ సుఖాల్లో మునిగి తేలిపోవాలనుకుంటే పశువులకు పక్షులకు మనకు తేడా ఏమిటి? బయట ఉండేది తాత్కాలిక సుఖం. లోపల ఉండే సుఖం అమృతమయం. దాన్ని బుద్ధితో గ్రహించాలి. దీనికొక ఉదాహరణ చెబుతారు.ఒక కుక్కకి ఎముక ముక్కదొరికింది. దాన్ని కొరుకుతోంది. అదేమో జారిపోయిందని తెలియదు. తన దవడ కండరాన్ని పంటితో కొరుకుతోంది. రక్తం కారుతోంది. అది ఎముక నుంచి వచ్చే రసమని మహా ఆనందంలో మునిగిపోయింది ఆ కుక్క. అలా ఆభాస సుఖంలో మునిగిపోతున్నాం. అది దుఃఖభూయిష్టం. విషతుల్యం. నిజమైన నిరతిశయమైన సుఖాన్ని తామసి జారవిడుచుకుంటున్నాడు. తామస రాజస సుఖాలు వద్దు. సాత్విక సుఖం పొందాలని హెచ్చరిస్తున్నాడు భగవానుడు. సాత్విక రాజస తామస భేదాలను సవివరంగా ఇరవై రెండు శ్లోకాల్లో తెలుపుతూ ఈ ప్రకరణం ముగించాడు. అనంతకోటి బ్రహ్మాండాల్లోని సృష్టి యావత్తూ త్రిగుణాత్మకమే అంటున్నాడు ఇపుడు.


నతదస్తీపృథివ్యాం వాదివి దేవేషువాపునః | సత్వం ప్రకృతిజైర్ముక్తంయదేభిః స్యాత్ త్రిభిరుభైః || 40


భూలోకంలోని మనుషులు స్వర్గలోకంలోని దేవతలు తదితర లోకాల్లోని ఏ ప్రాణి అయినా ఈ ప్రకృతి లోనుంచి పుట్టిన త్రిగుణాలకు బద్దులై ఉండి తీరాలి. ప్రకృతి జై - ప్రకృతి నుంచి పుట్టినవి అని అర్థం. అవి ఏవి అంటే త్రిభిరుభైః - సత్వ రజస్తమో గుణాలు. జీవుడు ఈ త్రిగుణాలనుభవిస్తూ ఉంటాడని 13-21 శ్లోకం చెబుతోంది. ఆ గుణసాంగత్యంలోనే జీవునికి ఉత్తమ మధ్యమ అధమ జన్మలు వస్తూ ఉంటాయి. భూ భువర్ స్వర్గ మహార్జన తపో సత్య (బ్రహ్మ) లోకాలు ఇవి ఏడు ఊర్ధ్వలోకాలు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు ఇవి ఏడు అథోలోకాలు. బ్రహ్మ మొదలు సకల దేవతలు రాక్షసులు నర పశు పక్షి కీటకాదులు... సర్వ ప్రాణికోటి యావత్తు త్రిగుణాల పడి తీరాల్సిందే. ఎవ్వరేకాని దేనికైనా మినహాయింపు చెబుతున్నాడు భగవానుడు ఈ శ్లోకంలో.


అయితే ఈ ప్రకృతి గుణాలు ఇద్దరికి వర్తించవుఒకడు పరమాత్మ. రెండోవాడు బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని త్రిగుణాతీతుడు. ఎలా అంతటి స్థాయిని చేరుకోగల్గాడని ప్రశ్నజ్ఞానం అనుష్టానం ఈ రెండింటి వల్ల సత్వగుణాన్ని వదిలేస్తాడుదాంతో శుద్ధసత్వ స్థితిలోకి చేస్తాడు. శాస్త్ర నియత కర్మలు చేస్తున్నా నాహం కర్తా హరిః. కర్త అంటూ నిష్కామ భావనలో నిమగ్నుడై ఉంటాడు బ్రహ్మజ్ఞాని. కర్మ ఫలాలన్నింటినీ భగవదర్పణం చేస్తాడు. అదే మోక్షానికి దారి. | న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానశుః - యజ్ఞ యాగాది కర్మలు సంతానం సంపద వీటివల్ల మోక్షం రాదు. ఒక త్యాగం వల్లనే అమృతత్వం లభిస్తుంది అంటాయి ఉపనిషత్తులు (బృహదారణ్యక నారాయణోపనిషత్తులు)కర్మఫలాన్ని త్యజించాలి. సంగం త్యక్తా అని చాలాచోట్ల గీతాకారుడంటూనే ఉన్నాడు కదా. నియత కర్మల విషయంలో ఎవరెవరికి ఏ కర్మలు మోక్ష సాధనలో ఈ ప్రకరణంలో పేర్కొంటున్నాడు.


బ్రాహ్మణ క్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప | | కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైరుణ్ణిః || 41


శత్రువులను తపింపచేసే అర్జునా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు వారి వారి స్వభావం వల్ల పుట్టిన గుణాలను బట్టి వారి వారి కర్మలు విభజింపబడ్డాయి. | సర్వ భూతకోటి కల్పాంతంలో పరమాత్మలో లయమై పోతుంది. కల్పాదిలో మళ్ళీ వాటిని సృష్టిస్తాడు. అపుడా భూతకోటిని తమ తమ స్వభావాలకు అనుగుణంగా కర్మానుసారంగా సృష్టిస్తానని తొమ్మిదో అధ్యాయంలో చెప్పాడు భగవానుడు. అంటే ప్రాణికోటి కర్మ జన్మల పట్ల పరమాత్మకు ఏవిధమైన సంబంధం లేదు. | సత్వగుణ శాతం ఎక్కువగా ఉంటే బ్రాహ్మణుల జన్మ. రజోగుణం ఎక్కువ, సత్వగుణం కొద్దిగా ఉంటే క్షత్రియ జన్మ. రజో తమో గుణ మిశ్రితంలో రజోగుణం కొంచెం ఎక్కువ ఉంటే వైశ్యజన్మ. రజోస్తమో మిశ్రితంలో తమోగుణం అధికశాతం ఉంటే శూద్రజన్మ. గుణాలను బట్టి స్వభావాలు, స్వభావాలననుసరించి కర్మలుంటాయి.


| గుణాలను బట్టి స్వభావాలా? స్వభావాలను బట్టి గుణాలా అని ప్రశ్న. ఏది ముందు ఏది వెనుక అని పెద్ద సందేహం కలుగుతూ ఉంటుంది. తర్వాతి శ్లోకంలో స్వాభావిక కర్మలంటూ తెలియని చెబుతున్నందువల్ల గుణాలు ముందు తర్వాత స్వభావాలని, ఆ స్వభావాల వల్ల కర్మలు కలుగుతూ ఉంటాయని సమాధానం.


చాతుర్వర్ణ వ్యవస్థలో గుణాలను బట్టి కర్మలను బట్టి పుట్టించినట్లు 4-13 లో చెప్పాడు భగవానుడు. పరిపాలనా సౌలభ్యానికి లోక వ్యవహారాది కార్యాలకి వర్ణ వ్యవస్థ ఏర్పడి ఉండవచ్చునని కొందరి వాదన. గుణకర్మలను బట్టి నిర్ణయించబడ్డాయి కనుక అవి గుణవాచకాలు. జాతి వాచకాలు కాదు. జాతి మత కులాది విభాగం మనం కల్పించుకున్నదేప్రస్తుత కాలంలో వర్ణవ్యవస్థ కుప్పకూలి మరణశయ్య మీద మూలుగుతోంది. స్వార్థపరుల విజృంభణలో మతపిచ్చి పైశాచిక నృత్యం చేస్తోంది. కులగజ్జి రక్తంలో కలిసిపోయి కాన్సర్ కన్నా భయంకర వ్యాధిగా మారిపోయింది. మనది జాతిమతకులాలకు అతీతమైన లౌకిక రాజ్యం అంటారు. అది పుస్తకాలకే పరిమితంవేదికల మీద ఉపన్యాసకుల నోళ్ళలో మాత్రం జీవించి ఉంటోందిఎన్నికల వేళలో కుల మతాలు జడలు విప్పి వీరవిహారం చేసే దయ్యంలా మారటచూస్తున్నాం మనం. మత యుద్దాలు కులాల కుమ్ములాటలు ద్వేషాగ్నితో ట్రేగిపోతున్నాయిఏ వెలుగులకి ఈ ప్రస్థానం అన్న ప్రశ్నకు బదులు లేదు. ఈ సమాజానికి పురుషుడే శాసనకర్త కావడం మన దౌర్భాగ్యంశాసనకర్త స్త్రీ అయి ఉంటే ఈ యుద్దాలు మారణహోమాలు ఉండవేమో! కారణం స్త్రీ మమయి. మాతృమూర్తి కదా!


ధర్మవ్యాధుడు జాతి చండాలుడైనా గుణ స్వభావ కర్మలతో బ్రాహ్మణ ధర్మాలు పుణికిపుచ్చుకున్నాడు. బ్రహ్మజ్ఞానిగా గుర్తింపబడ్డాడు. అలాగే జాతి బ్రాహ్మణులలో శూద్ర ధర్మాలుంటే వాడు శూద్రుడనిపించుకుంటాడు. జన్మచేత బ్రాహ్మణుడు గొప్ప అని, తక్కినవాళ్ళు కాదని భగవద్గీత చెప్పలేదు. మానవజాతి ఒక్కటే. సర్వప్రాణికోటి ఒక్కటే. విశ్వమానవ సోదర మ కాదు, విశ్వప్రాణికోటి మని ప్రదర్శించాలంటుంది భగవద్గీత. నిష్కామాచారణ ఉండాలి. నేను నాది నాకోసం అనే మమతాభిమానాలు తొలగాలి. అపుడు ఏ జాతివాడైనా, ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా భగవదనుగ్రహ ప్రాప్తితో మోక్ష సామ్రాజ్యంలో అడుగు పెడతాడని నికార్సుగా చెబుతోంది గీతామాత.


వసిష్టుని బ్రహ్మతేజస్సుకు శుద్ద క్షత్రియుడైన విశ్వామిత్రుడు తలవంచాడు. దృఢతర తపోదీక్షతో మొదట రాజర్షి అయ్యాడు. తర్వాత బ్రహ్మర్షిగా పిలువబడ్డాడు. ప్రహ్లాదుడు, విభీషణుడు, శబరి, మీరాబాయి, జనాబాయి, కబీరు, చోఖామేళుడు, తులాధరుడు, కొందరు ఆళ్వార్లు ఇత్యాదుల కులగోత్రాలతో పనిలేదు. అందరూ ఆరాధనీయులయ్యారు మనకు. తెలియని అయితే ఈ శ్లోకంలో బ్రాహ్మణ క్షత్రియ విశాం (వైశ్యులు) అని ప్రథమ పాదంలో చెప్పాడు. ద్వితీయ పాదంలో శూద్రాణం అన్నాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలునూ అట్లే శూద్రుల కర్మలునూ అని కొందరు తాత్పర్యం పేర్కొన్నారు. శూద్రులను తక్కిన ముగ్గురితో కలపకుండా విడిగా ఎందుకు చెప్పారని ప్రశ్న. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు యజ్ఞోపవీత ధారణకు అధికారం ఉంది. ఇంకా చెప్పాలంటే యజ్ఞ యాగాది వైదిక కర్మకాండకు ఆ ముగ్గురు అర్హులు. అందుకే ఆ ముగ్గురిని ఒకటిగా చెప్పి శూద్రులను విడిగా పేర్కొనడం ఈ శ్లోకంలోని పూర్వార్థంలోని అంతరార్థంగా అన్వయించుకోవాల్సి వస్తోంది. ఇది వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా చెప్పటం జరిగింది. అంతేకాని శూద్రులను తక్కువ పరచటం గీత ఉద్దేశం కాదని గమనించాలి. | ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగిన వాడన్నాడు అన్నమాచార్య. కనుక ఏ వ్యక్తిని హీనంగా చూడరాదు.కర్మధ్యాన యోగ భక్తి జ్ఞాన యోగాల్లోని సాధనలన్నీ మోక్ష సోపానాలే. ఏ ఉపాయాన్నైనా పట్టుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగి భగవత్ సన్నిధి చేరాలన్నదే భగవానుని ఆశయం .. | బ్రాహ్మణాది నాలుగు వర్గాల వారికి వారి స్వభావ సిద్దమైన కర్తవ్య కర్మలు ఏమిటో వరుసగా మూడు శ్లోకాల్లో వివరింపబడ్డాయి.


| శమోదమస్తపః శాచం క్షాంతిరార్ణవమేవచ! జ్ఞానం విజ్ఞానమాస్తిక్యంబ్రహ్మకర్మస్వభావజమ్ || 42


శమం దమం తపం శౌచం క్షాంతి ఆర్జవం జ్ఞానం విజ్ఞానం విశ్వాసం ఇవి బ్రాహ్మణులకు స్వాభావిక కర్మలు. | | అంతరింద్రియ నిగ్రహాన్ని శమమంటారు. బహిరింద్రియ నిగ్రహాన్ని దమమంటారు. శాస్త్రంలో చెప్పిన రీతిలో స్వధర్మాచరణలో కలిగే శారీరక క్లేశాల్ని సహించటం తపస్సంటారు. దేవ బ్రాహ్మణ గురు జనులను జ్ఞానులను సేవించటం - శారీరక తపస్సు. భగవన్నామ స్మరణం - వాచక తపస్సు. మనో నైర్మల్యం శాంతస్వభావం. నిరంతర భగవత్ చింతన ధ్యానం - మానసిక తపస్సు. పదిహేడో అధ్యాయంలో మూడు రకాల తపస్సులు చెప్పబడ్డాయి. బాహ్యంతర శుద్దిని పాటించడం శౌచం. ఈ శౌచం చాలాసార్లు గీతలో వచ్చిందంటే శుచిత్వానికి ఎంత ప్రాధాన్యం ఉందో గమనించాలి. స్నానం చేయటం బాహ్య శారీరక శుద్ధి. ధ్యానం సాగించటం చూసి అంతశ్శుద్ధి.పాపచింతనలు రాకుండా డటం,రాగద్వేషాలకు లోనుకాకుండా ఉండటం,మనస్సునునిర్మలంగా ఉంచుకోవటం ఇవన్నీ అంతశ్శుద్ధిలోకి వస్తాయి. భగవన్నామ స్మరణతో వంట చేయాలి. వండిన ఆహార పదార్థాలు భగవత్ నివేదితం కావాలి. మితంగా అన్నాదులు స్వీకరించటం ఇవన్నీ ఆహార శుద్దిలోకి వస్తాయి. పరులు చేసిన అపరాధాలు క్షమించటమే క్షాంతి. ఈ క్షాంతి కూడా చాలాసార్లు వచ్చింది గీతలో. పైకి క్షమించానని అంటాం. లోపల శిక్షించాలన్న భావం కాని పగ సాధించాలన్న ఆలోచన కాని ఉండరాదు మనలో. ఎదుటివాడు హాని చేస్తే ప్రతీకారం తీర్చుకోగల శక్తి ఉండి కూడా క్షమించటం క్షాంతి. తనకు కీడు చేసినవాడు మరొకడితో శిక్షింపబడాలని తలంపు లేకపోవటం కూడా క్షాంతి. హాని చేయ తలపెట్టిన అపకారిని మరచిపోయే స్వభావాన్ని క్షాంతి అనవచ్చు. ఆర్జవం అన్న పదం చాలాసార్లు వచ్చింది ఇదివరకు. మనస్సు వక్రబుద్ధితో ప్రవర్తించకుండా ఉండాలి. లోపల ఒకటి, బయటికి మరొకటిగా లేకుండా వినిర్మలమైన నిజాయితీతో కూడిన ప్రవర్తనని ఆర్జవం అంటారు. రుజువర్తనం, సరళ స్వభావం కూడా ఆర్జవంలోకి చేరిక. జ్ఞాన విజ్ఞానాలు - జ్ఞానమంటే కేవలం శాస్త్రజ్ఞానం. అనుభవ జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. వేద శాస్త్రాలపై విశ్వాసం, భగవంతుని మీద నమ్మకం, ఆచార్యుల గురువుల ఉపదేశాలపై ఆచరణపై దృఢ విశ్వాసం - ఇవన్నీ కలగలిపితే ఆస్తిక్యం అవుతుంది. ఇలా తొమ్మిది స్వభావాలు బ్రాహ్మణునికి చెందిన సత్వగుణ కార్యాలు. అధ్యయనం అధ్యాపనం యజనం యాజనం తథా దానం ప్రతిగృహ్యం చైవ బ్రాహ్మణా నామ కల్పయత్ అంటుంది మనుస్మృతి.


శౌర్యం తేజోధృతిర్దాక్ష్యంయుద్దే చాప్యపలాయనమ్ | దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మస్వభావజమ్ || 43


శౌర్యం, తేజస్సు, ధైర్యం, దక్షత, యుద్ధరంగంలో వెచ్నూ పి పారిపోకుండుట, దానం చేయటం, ప్రజలను ధర్మమార్గంలో నడవాలని నియంత్రించటం ఇవి క్షత్రియ స్వాభావిక కర్మలు. యుద్ధంలో నిర్భయంగా ప్రవేశించే సామర్థ్యాన్ని శౌర్యమంటారు. పద్మవ్యూహం పన్నిపుడు భేదించటంలో అభిమన్యుడు ప్రదర్శించింది శౌర్యం. సైంధవ వధ సందర్భంలో శత్రుసంహారం చేసే అర్జునుని వీరవిహారరూడ శక్యం కాకుండా ఉండింది. అది తేజస్సు. కురుక్షేత్రంలో తొమ్మిదో నాటి యుద్ధంలో కురువృద్దుడు భీష్ముని విజృంభతూ సి ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసి కృష్ణుడు రథంలోంచి దూకాడు. చక్రాయుధం ధరించాడు. భీష్ముని పైకి లంఘిస్తున్న కృష్ణుని చూసి కౌరవసేన హాహాకారాలు చేసింది. భీష్మ పితామహుని ధృతి చెదరలేదు. శరణాగత వత్సలా నీ చేతిలో మరణం నా అదృష్టం. చక్రపాణీ నన్ను చంపెయ్. నా కీర్తి రెట్టింపు చెయ్ అని ధైర్యంగా ఆహ్వానించాడు గాంగేయుడు. ప్రాణం పోతుందని భయం లేని స్థితిని ఇక్కడ ధృతి అని చెప్పవచ్చు. (సశేషం).....