దుర్గాదేవి రూపాలు


(29-09-2019న దేవీ శరన్నవరాత్రారంభం)


దుర్గాదేవి రూపాలు


                                         - డా|| మరుదాడు అహల్యాదేవి


భారతదేశంలో వైదిక కాలం నుండీ శక్తిస్వరూపంగా దేవీ ఉపాసన కొనసాగుతోంది. రామాయణ, మహాభారత కాలాల్లోనూ అవిచ్చిన్నంగా సాగింది. లౌకిక సాహిత్యం, నిగమ, ఆగమ శాస్త్రాలలోను ఈ ప్రస్తావన కన్పిస్తుంది. శక్తి స్వరూపమైన భగవతి వివిధ రూపాల వివరాలను తెలుసుకుందాం.


మహాకాళి: ఆద్యశక్తిగా మహాకాళిని అభివర్ణించారు. దుర్గాసప్తశతి ప్రథమాధ్యాయంలో మహాకాళిని మహావిష్ణువు యోగనిద్రా స్వరూపంగా ప్రతిపాదించారు. దశ మహావిద్యల్లో ప్రథమ దేవత మహాకాళి. ఈ దేవత ఆరాధన వల్ల శనిగ్రహ దోషం ఉపశమిస్తుంది. మహాత్రిపురసుందరిశ్రీ కులానికి అధిష్ఠాత్రీ బాలాత్రిపుర సుందరి. దశ మహావిద్యల్లో 'షోడశి'. తంత్రంలో సర్వోన్నత శక్తిగా మహా త్రిపురసుందరిని పూజిస్తారు. షోడశి ఆరాధనతో బుధగ్రహ దోషాలు సమసిపోతాయి.


| త్రిపుర భైరవి: ఈమె కూడా దశ మహావిద్యలలోని దేవతజీవులకు వారి వారి కర్మానుసారం ఫలం పంచడం త్రిపుర భైరవీ కార్యం. ఆమె మహా త్రిపురసుందరికి రథవాహిని. ఈమె కృపతోనే శివుడు స్థూల, సూక్ష్మ రూపాలు ధరిస్తుంటాడుఇంద్రియాలను వశంలో ఉంచుకోవాలనుకునేవారు ఈమెను ఉపాసిస్తారు. జన్మలగ్నం లోపభూయిష్టంగా ఉంటే ఈ దేవిని ఆరాధించాలి.


బగళాముఖి: ఈమెకు దశ మహావిద్యలలో స్థానం ఉంది. శత్రు బాధా నివారణకు, ఆత్మరక్షణకు బగళాముఖిని ఆరాధిస్తారు. ఈ దేవి జననం విష్ణు ఉపాసన వల్ల జరిగింది. అందుచే ఈమె పీతాంబర. ప్రపంచాన్ని నాశనం చేసే ఒక ప్రభంజనాన్ని శాంతింప చేయడానికిశ్రీ మహావిష్ణువు బగళాముఖిని సృష్టించాడు. బగళాముఖి ఆరాధన వల్ల కుజదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.


| ఛిన్నమస్తాదేవి: దశ మహావిద్యలలోని ఛిన్నమస్తాదేవి రూపం అద్భుతం. అగ్నితో సమానమైన శక్తి స్వరూపం. సమస్త దేవీ దేవతలకు హవిస్సు అందించే రూపం. రాహు దోష ఉపశమనానికి ఈ దేవిని ఆరాధించాలి.


మాతంగి: దశ మహావిద్యలలో ఒకటైన మాతంగి మాతంగ మహర్షి కుమార్తె. తన తపస్సుతో శక్తిస్వరూపమయ్యే వరం పొందింది. వాగ్విలాసం ప్రసాదించే దేవత. ఈమెను ఉచ్చిష్ట చండాలి అనీ అంటారు. సుఖం కోరే గృహస్తులు ఈ దేవిని ఉపాసిస్తారు. జాతకంలో రవి గ్రహం బలహీనంగా ఉంటే ఈ దేవిని ఆరాధించాలి.


| ధూమవతి: ఈమెకు మరోపేరు దరిద్ర. లక్ష్మీదేవికి అక్క (జ్యేష్ఠాదేవి). కేవలం ఒక విశేష సిద్ధి కోసమే ఈమెను ఉపాసిస్తారు. కేతుదోషపరిష్కారం కోసం ఈమెను ఆరాధిస్తారు.


| కమల: దశ మహావిద్యలలో చివరి స్వరూపం. ఈమెను మహాలక్ష్మి అని కూడా అంటారు. ఐశ్వర్య ప్రదాయిని. విష్ణుశక్తి కావటం వలన వైష్ణవి అనే పేరు కూడా కలిగింది.దుర్గాసప్తశతిలో 'కమల' రూపం మహిషాసుర మర్దనిగా వర్ణింపబడిందిశుక్రగ్రహ దోష నివారణకు ఈ దేవతను ఆరాధించాలి.


దుర్గ : ఈమెయే అంబిక. ఈ దేవి ఉపాసన వర్ణన మహాభారతంలో లభిస్తుంది. మహాకాళి, మహాలక్ష్మిమహాసరస్వతుల సమ్మిళిత రూపమే దుర్గాదేవి. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించడం వల్ల ఈమెకు 'దుర్గ' అనే పేరు కలిగింది.


శైలపుత్రి: నవదుర్గలలో ప్రముఖ స్థానం. దుర్గా సప్తశతి లోని దేవీకవచంలో శైలపుత్ర వర్ణన లభిస్తుంది.


బ్రహ్మచారిణి: నవదుర్గలలో రెండో స్వరూపం. సచ్చిదానంద బ్రహ్మమయ స్వరూపం. పార్వతీదేవి వివాహత్పూర్వం తపస్సు చేసిన రూపం. నవరాత్రి రెండోరోజు బ్రహ్మచారిణిని ఆరాధించాలి.


చంద్రఘంట: నవదుర్గలలో మూడవ అవతారం. నవరాత్రి మూడవ రోజుచంద్రఘంటను పూజిస్తారు. వ్యాఘ్రం వాహనంగా ప్రపంచంలోని సమస్త దుఃఖాలను నివారించే దేవి. శత్రుబాధా నివారణకై ఈమెను ఉపాసిస్తారు.


| కూష్మాండా దేవి: జగన్మాత నాలుగో స్వరూపం. నవరాత్రులలో నాలుగవ రోజు ఈ దేవిని పూజిస్తారు. బ్రహ్మాండం ఉత్పత్తి రహస్యం విశదపరిచే ఈ రూపం ఉపాసనతో దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది.


స్కందమాత: దుర్గాదేవి పంచమరూపం. నవరాత్రి ఐదవరోజు ఈ రూపాన్ని పూజిస్తారు. కార్తికేయుని జనని స్కందమాత. సంతానప్రాప్తి, సంతాన రక్షణకై ఈ దేవిని ఆరాధిస్తారు.


కాత్యాయిని:దుర్గాదేవి షష్టమరూపం.నవరాత్రి ఆరవరోజు కాత్యాయినిని పూజిస్తారు. సింహవాహిని అయిన ఈ దేవి సమస్త దుష్టులను, రాక్షసులను నిర్మూలిస్తుంది. ఈమె కాత్యాయన ఋషి పుత్రిక. కనుక 'కాత్యాయిని' అని పిలువబడుతోంది..


కాళరాత్రి: నవదుర్గలలో సప్తమరూపం. భయంకర రూపం. నవరాత్రి ఏడవరోజు. దేవిని ఈ రూపంలో పూజిస్తారు.


మహాగౌరి: పరమ శివుని శక్తి, దుర్గాదేవి అష్టమ రూపం. మహాగౌరిని నవరాత్రి ఎనిమిదవ రోజు పూజిస్తారు.


సిద్ధిధాత్రి: నవదుర్గలలో చివరి అవతారం. ఈ దేవిని తొమ్మిది రోజు పూజిస్తారు. ఈ రూపాన్ని ఉపాసించిన వ్యక్తికి సమస్త సిద్ధులూ లభిస్తాయి.


శాకంబరి: దుర్గాసప్తశతి 11 వ అధ్యాయంలో శాకంబరి వర్ణన లభిస్తుంది. లోకంలో అనేక సంవత్సరాలు వర్షాలు లేక క్షామం ఏర్పడి, ప్రజలు అల్లాడిపోయారు. ఆ సమయంలో దుర్గాదేవి శతాక్షి పేరుతో అవతరించింది. కూరగాయలు, పండ్లరూపంలో దేవి అందరి క్షుద్బాధను శమింపచేయడం వల్ల 'శాకంబరి' అన్న నామం కలిగింది. శాకంబరి ఉపాసనతో జీవితంలో ఉన్నతి కలుగుతుంది.


| భీమ: దుర్గాసప్తశతి 11వ అధ్యాయంలో 'భీమ' వర్ణన లభిస్తుంది. పరాశక్తి భీమ (భయంకర) రూపం ధరించి, హిమాలయాల్లోని మునుల రక్షణకై రాక్షసులను నాశనం చేసింది. ఆ తల్లిని మునులు స్తుతించారు.


| భ్రామరి: 'అరుణుడు' అనే రాక్షసుని సంహరించడానికి ఆరుకాళ్ళు గల భ్రమర రూపంలో జగన్మాత వేలాది భ్రమరాలుగా అవతరించిన రూపమే 'భ్రామరి'..


సీత: శ్రీ మహావిష్ణువు రామావతారంలో భూమిపై జన్మించినప్పుడు ఆద్యశక్తి లక్ష్మీదేవి సీతాదేవిగా అవతరించింది. శ్రీ రామునితో కూడా ఈమెను పూజిస్తారు.


రాధ :శ్రీ మహావిష్ణువు శ్రీ కృష్ణుడుగా జన్మించినపుడు స్వామి లీలలకు ఆధారభూతమైన శక్తిగా రాధ అవతరించింది. శ్రీ కృష్ణునితో పాటు పూజలందుకుంటుంది. రాధతో కూడా రుక్మిణిని లక్ష్మీ అవతారంగా భావిస్తారు.


మానస: నాగులకు స్వామిని. వైశాఖం నుండి భాద్రపద మాసం వరకు భూమిపై నివసిస్తుంది. ఈమెను తూర్పుభారత దేశంలోని ప్రజలు విశేషంగా పూజిస్తారు. మానసను శివుని కుమార్తెగా, వాసుకి చెల్లెలుగా, జరత్కారుని భార్యగానూ వర్ణిస్తారు. ఆదివాసుల్లో తాంత్రికుల్లో శాక్తుల్లో ఈమె పూజ విశిష్ట స్థానం కలిగి ఉంటుంది. ఈమెను పద్మావతి అన్న పేరుతో జైనులు పూజిస్తారు. రాహు-కేతు గ్రహాల సంబంధితమైన కాలసర్ప యోగ శాంతి కోసం మానసను ఉపాసిస్తారు.


సరస్వతి: సమస్త విద్యలకు అధిష్ఠాత్రి. దుర్గా సప్తశతి ఉత్తరభాగంలో ఈమెను మహాసరస్వతిగా అభివర్ణించారు. శుంభ, నిశుంభులు అనే మహారాక్షసులను సంహరించిన ఈమెను ఉపాసించడం చేత బుద్ధి వికాసం కలుగుతుంది.


| అన్నపూర్ణ: సమస్త ప్రపంచానికి అన్నం పెట్టే తల్లి. ఒకసారి పార్వతీదేవి శివునిపై అలిగి కాశీకి వెళ్ళింది. పార్వతి లేకపోవడంతో శివునికి అన్నపానీయాలు కరువయ్యాయి. అప్పుడు జగన్మాత పార్వతియే స్వామికి అన్నపానీయాలు ప్రసాదించి ఆకలి తీర్చింది. అప్పటినుండి ఆమె అన్నపూర్ణ అయింది. అన్నపూర్ణాదేవి ఉపాసనతో అన్నపానాదులకు లోటు ఉండదు. వివిధ ఐశ్వర్యాలు ప్రసాదించే జగన్మాత.


| గాయత్రి: వేదమాత గాయత్రి స్వరూపం అద్భుతం. బ్రహ్మశక్తిగా భావిస్తారు. సనాతన మహర్షులు, సంప్రదాయ బద్దులు ఈమెను ఉపాసిస్తారు. గాయత్రి మంత్ర, ఛందస్సులలో దేవీశక్తి సమాహితమై ఉంటుంది. దుర్గాదేవిని, పార్వతీమాతను, కాళికాదేవిని,జగన్మాతనుఏదో ఒకనామంతోధ్యానిస్తే తమతమ కార్యాలు ఘనవిజయం సాధిస్తాయని, సృష్టి, స్థితి, లయ కారిణి దుర్గామాత నామస్మరణమాత్రాననే జీవితం పునీతమవుతుందని చెప్పవచ్చు.


| యోగసాధనలో నవదుర్గలు శైలపుత్రి:


మూలాధార చక్రస్వామిని.ఇది అన్ని చక్రాలకు ఆధారం.


బ్రహ్మచారిణి : స్వాధిష్టాన చక్రం (ఉచక్రం)


చంద్రఘంట: మణిపూరక చక్రం కూష్మాండ:


అనాహత చక్రం (సూర్యమండల మధ్యవర్తిని)


స్కందమాత: విశుద్ద చక్రం (సూర్యమండల అధిష్ఠాత్రి)


కాత్యాయని: ఆజ్ఞాచక్రం కాళరాత్రి:


సహస్రార చక్రం మహాగౌరి: సోమ చక్రం (పరంపరాగతంగా వచ్చిన సంస్కారాల నుండి విముక్తి, కుటుంబ బాధ్యతల పూర్తి, ఆర్థిక సమృద్ధి ప్రదాయిని) సిద్ధిధాత్రి: నిర్వాణ చక్రం. బుద్ది సిద్ది ప్రాప్తి. కార్యసిద్ధిలో వ్యవధానం సమాప్తి కావటం, అభీష్టసిద్ధి ప్రాప్తి.


దుర్గాదేవి నామావళి


ఓం సతీ, సాధ్వీ, భావ్ తా, భవానీ, భవమోచనీ, ఆర్యా, దుర్గా, జయా, ఆద్యా, త్రినేత్రా, శూలధారిణీ, పినాకధారిణీ, చిత్రా, చంద్రఘంటా, మహాతపా, మనః, బుద్ధి, అహంకారా, చిత్తరూపా, చితా, చితిః సర్వమంత్రమయీ, సత్తా, సత్యానంద స్వరూపిణీ, అనంతా, భావినీ, భావ్యా, భవ్యా, అభావ్యా, సదాగతిః శాంభవీ, దేవమాతా, చన్హా, రత్నప్రియా, సర్వవిద్యా, దక్షకన్యా, దక్షయజ్ఞ వినాశినీ, అపర్ణా, అనేక వర్ణా, పాటలా, పాటలీవతీ, పట్టాంబ పరిధానా, కమల మంజీర రంజినీ, అమేయ విక్రమా, క్రూరా, సుందరీ, సురసుందరీ, మాతంగీ, మతాంగముని పూజితా, బ్రాహ్మీ, మాహేశ్వరీ, ఐదీ , కౌమారీ, వైష్ణవీ, చాముండా, వారాహీ, లక్ష్మీః, పురుషాకృతిః, విమలా, ఉత్కర్షిణీ, జ్ఞానా, క్రియా, నిత్యా, బుద్ధిదా, బహుళా, బహుళ మా, సర్వవాహన వాహనా, నిశుంభ, శుంభ హననీ, మహిషాసుర మర్ధినీ, మధుకైటభ హత్రీ , చండ ముండ వినాశినీ, సర్వాసుర వినాశా, సర్వ దానవఘాతినీ, సర్వశాస్త్రమయీ, సత్యా, సర్వాస్త్రధారిణీ, అనేక శస్త హస్తా, అనేకాస్త ధారిణీ, కుమారీ, ఏక కన్యా, కిశోరీ, యువతీ, యతిః, అప్రాధా, ప్రౌఢ, వృద్దమాతా, బలప్రదా, మహోదరీ, ముక్తకేశీ, ఘోరరూపా, మహాబలా, అగ్నిజ్వాలా, రౌద్రముఖీ, కాళరాత్రిః, తపస్వినీ, నారాయణీ, భద్రకాళీ, విష్ణుమాయా, జలోదరీ, శివదూతే, కరాళీ, అనంతా, పరమేశ్వరీ, కాత్యాయనీ, సాత్రీ , ప్రత్యక్షా, బ్రహ్మవాదినీ. దేవి 108 నామాల్లో ఏదో ఒకటి ఎంచుకొని విధ్యుక్తంగా పూజించాలి. భగవతి జగదంబని నిష్ఠ, శ్రద్ధ, భక్తులతో పూజించే భక్తుల కోరికలు తప్పక సఫలమవుతాయి. భక్తితో స్తుతించినపుడు కష్టాలు తొలగించడానికి జగదంబ వివిధ శక్తులతో ప్రకటితమవుతుంది. | భౌమాశ్విని (అశ్వినీ నక్షత్రం ఉన్న మంగళవారం రోజు) అమృత యోగంలో మహాదేవి భగవతి సన్నిధిన జపం చేసేవారుమహామృత్యువును జయించగలరు.


యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||


దుర్గాదేవి దయామయి. దుర్గాదేవిని పూజించి, ఆరాధించేందుకు ఇది ఉత్తమమైన సమయం. దుర్గ అనంత నామావళిలో ఏరూపంలోనైనా అర్చించి, అర్థించి తరించగలరు.